Peacock Feathers: పనిలో ఆటంకాలు, ఆర్ధిక ఇబ్బందుల ఏర్పడుతున్నాయా.. దోష నివారణకు నెమలి ఈకలను ప్రయత్నించండి..
Peacock Feathers: నెమలి అందమైన పక్షి అయితే.. ఆ నెమలికి మరింత అందం తెచ్చింది మాత్రం దాని ఈకలు.. నీలం, ఆకుపచ్చ, ఊదా ఇలా రకరాల రంగులతో ఇంద్రధనస్సు(Rainbow)ను మనముందుకు తీసుకొస్తుంది నెమలి ఈక..
Peacock Feathers: నెమలి అందమైన పక్షి అయితే.. ఆ నెమలికి మరింత అందం తెచ్చింది మాత్రం దాని ఈకలు.. నీలం, ఆకుపచ్చ, ఊదా ఇలా రకరాల రంగులతో ఇంద్రధనస్సు(Rainbow)ను మనముందుకు తీసుకొస్తుంది నెమలి ఈక. నెమలికి హిందూ పురాణాల్లో ప్రత్యేక స్థానం ఉంది. మన దేశ జాతీయ పక్షి. అయితే నెమలి వాస్తు ప్రకార అదృష్టానికి చిహ్నమని భావిస్తారు. ముఖ్యంగా నెమలి ఈకలను సానుకూలతకు చిహ్నంగా భావిస్తారు. ఇవి శరీరం, ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపుతాయి. పూర్వ కాలంలో, శరీరంలోని విషాన్ని తొలగించడానికి నెమలి ఈకలను ఔషధంగా ఉపయోగించేవారని తెలుస్తోంది. పురాతన కాలం నుండి , నెమలి ఈకలను ఇంట్లో పెట్టుకోవడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. వాస్తు ప్రకారం, నెమలి ఈక ఇంటిలోని అనేక రకాల వాస్తు దోషాలను తొలగిస్తుంది. సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. కనుక వాస్తులో నెమలి ఈకలు చాలా ఉపయోగకరంగ పరిగణిస్తున్నారు. ఈరోజు నెమలి ఈకలను కొన్ని దోషాల నివారణకు ప్రయత్నించవచ్చు. అవి ఏమిటో చూద్దాం..
సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం: నేటి కాలంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు సర్వసాధారణమైపోయాయి. వైవాహిక జీవితంలో ఏదో ఒక సమయంలో వివాదాలు తలెత్తే పరిస్థితి ఏర్పడుతూనే ఉంది. అటువంటి వారు బెడ్ రూమ్ లో తూర్పు లేదా ఉత్తరం వైపున ఉన్న గోడకు రెండు నెమలి ఈకలను కలిపి ఉంచడం వల్ల దాంపత్య జీవితానికి సంబంధించిన సమస్యలు తొలగి.. సంతోషకరమైన వైవాహిక బంధం నెలకొంటుంది.
జాతకంలో దోషాల నివారణకు: కొంతమంది జాతకంలో కాల సర్ప దోషంతో సహా రాహు-కేతువు వంటి అనేక రకాల దోషాలు ఉంటాయి. వీటి ప్రభావంతో జీవితంలో దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, వ్యక్తి తన జాతకం నుండి ఈ దుష్ప్రభావాన్ని తొలగించాలనుకుంటే, బెడ్ రూమ్ లోని పశ్చిమ దిశలో ఉన్న గోడపై నెమలి ఈకలను ఉంచడం వలన మంచి ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల ఇంటిలోని ప్రతికూలత తొలగిపోవడంతో పాటు అనేక ప్రయోజనాలు కూడా లభిస్తాయని నమ్మకం.
ఆర్థిక సమస్యల నివారణకు: ఎవరైనా డబ్బు సమస్యలను ఎదుర్కొంటుంటే.. నెమలి ఈకలు మంచి సహాయకారని నమ్మకం. ఆర్ధిక సమస్యతో ఇబ్బంది పడేవారు నెమలి ఈకను ఇంటిలోని ఆగ్నేయ మూలలో ఉంచండి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అంతేకాదు రావాల్సిన డబ్బులు కాకుండా నిలిచిపోయిన డబ్బు కూడా అందుతుంది. నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి.
పనిలో అంతరాయాలను తొలగించడానికి: వాస్తు శాస్త్రం ప్రకారం, మీ పనిలో నిరంతరం ఆటంకాలు ఏర్పడి,చేపట్టిన పని సమయానికి పూర్తి చేయకపోతే.. సాధారణ రోజుల్లో మీ ఇంటి పూజా స్థలంలో ఐదు నెమలి ఈకలను ఉంచి వాటిని ప్రతిరోజూ పూజించండి. 21వ రోజున ఈ నెమలి ఈకలను అల్మారాలో ఉంచితే.. ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయని విశ్వాసం.
చదుకునే పిల్లలకు: చదువు అంటే శ్రద్ధ పెట్టని పిల్లలకు చదువు అంటే ఆసక్తి కలగడానికి పిల్లలు చదువుకునే టేబుల్ పై ఏడు నెమలి ఈకలను ఉంచడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అంతేకాదు నెమలి ఈకలను తప్పనిసరిగా పుస్తకంలో లేదా డైరీలో ఉంచాలి.
(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకంపై ఆధారపడి ఉంటుంది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)
Also Read: