West Godavari: తల పట్టుకుంటున్న పోలీసులు.. ఇవేం దొంగతనాలు.. వంటింట్లోకి దూరి
AP Crime News: పశ్చిమగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో దొంగలు స్థానికులను, పోలీసులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. పంథా మార్చి ఖాకీలకు సవాల్ విసురుతున్నారు.
Kovvur: పశ్చిమగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో దొంగలు స్థానికులను, పోలీసులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. పంథా మార్చి ఖాకీలకు సవాల్ విసురుతున్నారు. దొంగలు సాధారణంగా డబ్బులు, బంగారు, వెండి నగలు, ఇంకా విలువైన వస్తువులు ఉంటే దోచుకెళతారు. ఇక్కడ మాత్రం అవేమీ టచ్ చేయరు. ఓన్లీ గ్యాస్ సిలిండర్లే టార్గెట్ చేసుకుని దొంగతనాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకు ఇలా గ్యాస్ సిలిండర్స్ ఎత్తుకెళ్తున్నారో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు, ఆ పరిసర ప్రాంతాల్లో ఇటీవల సుమారు 100 పైచిలుకు గ్యాస్ సిలిండర్లు చోరీకి గురి అయ్యాయి. ఒకే రోజు వివిధ ప్రాంతాల్లో ఇంత పెద్దఎత్తున గ్యాస్ సిలిండర్లు చోరీ కావడంతో పోలీసులు విస్మయానికి గురయ్యారు. దీంతో స్థానికులు డబ్బు నగలు కన్నా జాగ్రత్తగా గ్యాస్ సిలిండర్లు కాపాడుకునే పరిస్థితి ఏర్పడింది. చివరకు పోలీసుల ఇళ్లను కూడా వదలకుండా దొంగతనాలకు పాల్పడుతున్నారంటే ఇక్కడ పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా గ్యాస్ సిలిండర్ దొంగతనం చేయడం వెనక ఓ పెద్ద ముఠా దాగుందా లేక వేరే ఏ కారణం చేతనైనా ఇలా దొంగతనాలు చేస్తున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే అనుమానితులను గుర్తించి వారిపై పోలీసులు నిఘా పెట్టారు.
Also Read: Polished rice: పాలిష్ చేసిన రైస్ 3 పూటలా తింటున్నారా..? అయితే మీకు ముప్పు తప్పదు