విచక్షణ మరిచిన ఉపాధ్యాయుడు.. విద్యార్థిపై ప్రతాపం.. తలను బల్లకేసి కొట్టి..
విద్యార్థులు తప్పు చేస్తే.. వారి తప్పును సరిదిద్ది సన్మార్గంలో నడిచించాల్సిన ఓ ఉపాధ్యాయుడు తనలోని రాక్షసత్వాన్ని బయటపెట్టాడు. ఓ విద్యార్థి పట్ల విచక్షణ మరిచి ప్రవర్తించాడు....
విద్యార్థులు తప్పు చేస్తే.. వారి తప్పును సరిదిద్ది సన్మార్గంలో నడిచించాల్సిన ఓ ఉపాధ్యాయుడు తనలోని రాక్షసత్వాన్ని బయటపెట్టాడు. ఓ విద్యార్థి పట్ల విచక్షణ మరిచి ప్రవర్తించాడు. తనకు అస్వస్థతగా ఉందని చెప్పిన బాలుడిని తీవ్రంగా దండించాడు. బాలుడి తలను బల్లకు కొట్టడంతో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. వైద్య చికిత్స కోసం బాలుడి తల్లిదండ్రులు రోహిత్ ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి తిరుపతి(Tirupathi)లోని స్విమ్స్ లో చేర్చారు. వారం రోజుల కిందట జరిగిన ఈ ఘటన మంగళవారం సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగు చూసింది. ఈ ఘటనపై డీవైఈవో పురుషోత్తం మంగళవారం పలమనేరు(palamaneru) వచ్చి విచారణ నిర్వహించారు.
చిత్తూరు జిల్లా పలమనేరు మండలం జరావారిపల్లె గ్రామానికి చెందిన రోహిత్.. పట్టణంలోని ఓ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. వారం రోజుల క్రితం అతను తరగతి గదిలో వెనక బల్లపై పడుకున్నాడు. విషయం గమనించిన గణిత ఉపాధ్యాయుడు రోహిత్ ను మందలించాడు. జ్వరంగా ఉందని చెప్పడంతో తలపై చేయిపెట్టి చూసి, వేడిగా లేదు.. అబద్ధం చెబుతున్నావంటూ బాలుడి తలను బల్లకేసి కొట్టాడు. ఈ ఘటనలో రోహిత్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాలుడిని ఇంటికి పంపించారు. కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఆదివారం నాటికి రోహిత్ పరిస్థితి విషమించడంతో నడవలేని, మాట్లాడలేని స్థితికి చేరుకున్నాడు. దీంతో రోహిత్ ను తిరుపతిలోని స్విమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు.
బాలుడి తల్లిదండ్రులతో డీవైఈవో పురుషోత్తం మాట్లాడారు. ఉపాధ్యాయుడు దండించడంతో రోహిత్ అస్వస్థతకు గురయ్యాడని వారు తెలిపారు. ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు తమకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదని, అయినా తాము విచారించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. రోహిత్ స్విమ్స్‌లో కోలుకుంటున్నాడని సంచాలకురాలు బి.వెంగమ్మ తెలిపారు. కొవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోవడంతో జ్వరం వచ్చిందన్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం మెరుగుపడిందని తెలిపారు.
Also Read
West Godavari: తల పట్టుకుంటున్న పోలీసులు.. ఇవేం దొంగతనాలు.. వంటిట్లోకి దూరి
Polished rice: పాలిష్ చేసిన రైస్ 3 పూటలా తింటున్నారా..? అయితే మీకు ముప్పు తప్పదు
Selfie accident: రైలు పట్టాలపై సెల్ఫీ.. యువకులను ఢీ కొట్టిన రైలు.. నలుగురు మృతి