Selfie accident: రైలు పట్టాలపై సెల్ఫీ.. యువకులను ఢీ కొట్టిన రైలు.. నలుగురు మృతి
సెల్ఫీ(Selfie) మోజులో పడి కొందరు యువకులు ప్రమాదాలను పట్టించుకోవడం లేదు. సోషల్ మీడియాలో లైకులు, షేర్ ల కోసం ప్రాణాలపై తెచ్చుకుంటున్నారు. స్వీయ చిత్రం...
సెల్ఫీ(Selfie) మోజులో పడి కొందరు యువకులు ప్రమాదాలను పట్టించుకోవడం లేదు. సోషల్ మీడియాలో లైకులు, షేర్ ల కోసం ప్రాణాలపై తెచ్చుకుంటున్నారు. స్వీయ చిత్రం తీసుకుంటున్న సమయంలో ముందూ వెనకా చూసుకోకుండా ప్రాణాలపై తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనే హరియాణా(Hariyana) లోని గురుగ్రామ్(Gurugram) లో జరిగింది. నలుగురు యువకులు పట్టాలపై సెల్ఫీలు తీసుకుంటుండగా వీరిని రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురూ అక్కడికక్కడే మృతి చెందారు. హరియాణాలోని గురుగ్రామ్‌లో విషాదం నెలకొంది. నిర్మాణంలో ఉన్న రైల్వే పైవంతెన వద్ద మంగళవారం రాత్రి నలుగురు యువకులు సెల్ఫీ తీసుకుంటుండగా.. రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. ఢిల్లీ నుంచి అజ్మీర్ వెళ్తున్న జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్.. యువకులను ఢీకొట్టింది. ఈ ఘటనలో యువకుల మృతదేహాలు నుజ్జునుజ్జయ్యాయి. గుర్తు పట్టరాని విధంగా మారిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
మృతి చెందిన వారందరూ..18-21 ఏళ్ల వారేనని రైల్వే పోలీసులు తెలిపారు. రైలు దగ్గరగా వస్తున్నప్పటికీ యువకులు పక్కకు తప్పుకోకుండా సెల్ఫీ తీసుకోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన వారిలో ఒకరువిద్యార్థి కాగా.. మిగిలిన ముగ్గురు యువకులు సెల్‌ఫోన్ దుకాణంలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఇలాంటి ఘటనలను ప్రమాదాలుగా రైల్వే పరిగణించడంలేదని ఉన్నతాధికారులు తెలిపారు. వారిని అతిక్రమణ దారులుగానే పరిగణిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read
Ajit Doval: అజిత్ దోవల్ ఇంటి వద్ద కలకలం.. ఇంట్లో చొరబడేందుకు ఆగంతకుడి యత్నం
Central Government: వాహనదారులకు షాకింగ్ న్యూస్.. ఇకపై వారికీ హెల్మెట్ తప్పనిసరి.. పాటించకపోతే జైలే..