AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana crime: ఎడబాటు తట్టుకోలేక – యువతి ఆత్మహత్య.. ప్రియురాలి మరణ వార్త విని.. యువకుడు బలవన్మరణం

వారిద్దరూ ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా ఇష్టపడ్డారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ తామొకటి తలిస్తే.. దైవమొకటి తలచిందనట్లు..

Telangana crime: ఎడబాటు తట్టుకోలేక - యువతి ఆత్మహత్య.. ప్రియురాలి మరణ వార్త విని.. యువకుడు బలవన్మరణం
Couple Suicide
Ganesh Mudavath
|

Updated on: Feb 16, 2022 | 4:00 PM

Share

వారిద్దరూ ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా ఇష్టపడ్డారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ తామొకటి తలిస్తే.. దైవమొకటి తలచిందనట్లు.. వీరి ప్రేమ విషయం ఇరువురి తల్లిదండ్రులకు తెలిసింది. ప్రేమ వివాహానికి పెద్దలు ససేమిరా ఒప్పుకోలేదు. అంతే కాకుండా వారిని దూరం చేశారు. ఈ ఎడబాటును తట్టుకోలేక యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రియురాలు లేని లోకంలో తానుండలేనని యువకుడు పురుగుల మందు తాగాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన కంటతడి పెట్టిస్తోంది. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం వెంకటేశ్వరతండా పంచాయతీలోని మామిడిచెట్టుతండాకు చెందిన శాంతి, పక్కన ఉన్న కోమటికుంటతండాకు చెందిన శివ ప్రేమించుకున్నారు. వీరి విషయం పెద్దలకు తెలిసింది. అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి పెద్దలు అంగీకరించలేదు.

ఈ క్రమంలో శాంతి తన తల్లిదండ్రులతో కలిసి ఈనెల 3న పుణె వెళ్లింది. శివ స్థానికంగా ప్రైవేట్‌ డ్రైవర్‌గా విధుల్లో చేరాడు. కాగా, తమ పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోరనే బాధతో పుణెలో ఉన్న శాంతి.. 14వ తేదీ సోమవారం ఉదయం ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న శివ.. ప్రియురాలి మరణం తట్టుకోలేక పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న శివను స్థానికులు షాద్‌నగర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. ప్రేమికుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Also read

PSL 2022: కౌంటర్ ఇద్దామనుకున్నాడు అడ్డంగా బుక్కయ్యాడు.. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో ఆసక్తికర ఘటన

ధనియాల నీటితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Jagananna Thodu: వారి ఖాతాల్లోకి జగనన్న తోడు డబ్బులు జమ.. డేట్ ఫిక్స్..