AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PSL 2022: కౌంటర్ ఇద్దామనుకున్నాడు అడ్డంగా బుక్కయ్యాడు.. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో ఆసక్తికర ఘటన

గత తప్పుల నుంచి నేర్చుకోవాలంటారు పెద్దలు.. కానీ జాతీయ జట్టులో సభ్యులగా ఉండి కూడా తమ తప్పుల నుంచి ఏమీ నేర్చుకోలేక పోయారు. ఇలాంటి ఘటన ఒకటి పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(PSL 2022)లో చోటుచేసుకుంది.

PSL 2022: కౌంటర్ ఇద్దామనుకున్నాడు అడ్డంగా బుక్కయ్యాడు.. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో ఆసక్తికర ఘటన
Ben Cutting
Sanjay Kasula
|

Updated on: Feb 16, 2022 | 2:18 PM

Share

గత తప్పుల నుంచి నేర్చుకోవాలంటారు పెద్దలు.. కానీ జాతీయ జట్టులో సభ్యులగా ఉండి కూడా తమ తప్పుల నుంచి ఏమీ నేర్చుకోలేక పోయారు. ఇలాంటి ఘటన ఒకటి పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(PSL 2022)లో చోటుచేసుకుంది. ఎప్పుడో నాలుగేళ్ల క్రితం తనకు చేసిన అవమానాన్ని గుర్తుతెచ్చుకున్న బ్యాట్స్‌మన్‌.. బౌలర్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే చివరికి ఆ ప్లాన్‌ తనకే రివర్స్ అయ్యింది. ఆ బ్యాట్స్‌మన్‌ ఆస్ట్రేలియా డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ కటింగ్‌ అయితే.. బౌలర్‌ పాకిస్తాన్‌ క్రికెటర్‌ సోహైల్‌ తన్వీర్‌. విషయంలోకి వెళితే.. 2018లో కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో తన్వీర్‌ గయానా అమెజాన్‌ వారియర్స్‌ తరపున ఆడాడు. బెన్‌ కటింగ్‌ సెంట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పాట్రియోట్స్‌ తరపున ప్రాతినిధ్యం వహించారు. అదే సమయంలో బెన్‌ కటింగ్‌ను అవుట్ చేసిన తర్వాత సోహైల్‌ తన్వీర్‌ కటింగ్‌ను చూస్తూ తన రెండు చేతులతో మిడిల్‌ ఫింగర్‌ చూపించాడు. దీనిని బెన్‌ కటింగ్‌ నాలుగేళ్లుగా మనసులో పెట్టుకున్నాడని తాజాగా జరిగిన సీన్ చూస్తే అదే అర్థమవుతుంది.

మంగళవారం రాత్రి పెషావర్‌ జాల్మీ, క్వెటా గ్లాడియేటర్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. పెషావర్‌ జాల్మి ఇన్నింగ్స్‌ సమయంలో తన్వీర్‌ వేసిన 19వ ఓవర్లో బెన్‌ కటింగ్‌ మూడు సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఆ తర్వాత తన్వీర్‌వైపు తిరిగి రెండు చేతులు పైకెత్తి మిడిల్‌ ఫింగర్‌ చూపించి.. నాలుగేళ్ల క్రితం తనకు జరిగిన అవమానాన్ని కౌంటర్ ఇవ్వాలని అనుకున్నాడు. అది ఇంతటితో ఎండ్ కార్డ్ పడలేదు.

నసీమ్‌ షా వేసిన చివరి ఓవర్‌లో భారీ షాట్‌కు యత్నించి బెన్‌ కటింగ్‌ బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ వద్ద తన్వీర్‌కే క్యాచ్‌ ఇచ్చి పెవెలియన్ దారి పట్టాడు. ఇక తన్వీర్‌ కూడా అదే స్థాయి ఆటగాడు కాబట్టి.. వెంటనే తన రెండు చేతులు పైకెత్తి మిడిల్‌ ఫింగర్‌ చూపించి దెబ్బకు దెబ్బ కొట్టేశానంటూ రచ్చ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

4 ఏళ్ల క్రితం.. 4 ఏళ్ల తర్వాత… మళ్లీ అదే గొడవ

పాకిస్తాన్ సూపర్ లీగ్ 7వ సీజన్‌లో ఏమి జరిగిందో తెలుసుకునే ముందు.. 2018లో CPL అంటే కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఏమి జరిగిందో తెలుసుకుందాం. నిజానికి, ఆ సమయంలో ఆస్ట్రేలియా ఆటగాడు బెన్ కట్టింగ్, సెయింట్ కిట్స్ జట్టుకు ఆడుతూ.. మ్యాచ్‌లో గయానా అమెజాన్ బౌలర్ సోహైల్ తన్వీర్‌ను కొన్ని సిక్సర్లు కొట్టాడు. దీని తర్వాత తన్వీర్ కటింగ్‌ను కొట్టిపారేశాడు. అయితే ఆ తర్వాత అతడు చేసిన పనికి మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా పడింది. బయటికి వచ్చిన తన్వీర్ నిజానికి తన మధ్య వేలును బెన్ కటింగ్‌కి చూపించాడు.

2022 సంవత్సరంలో, PSL 7వ సీజన్‌లో, పెషావర్ జల్మీ మరియు క్వెట్టా గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో, కటింగ్ పెషావర్ జల్మీ మరియు తన్వీర్ క్వెట్టా గ్లాడియేటర్స్‌లో భాగంగా ఉంది. ఇక్కడ కూడా కొన్ని సిక్సర్లు కొట్టిన తన్వీర్‌ను కట్టింగ్ కొట్టి, ఆ తర్వాత అతని మధ్య వేలును చూపించాడు. దీని తర్వాత తన్వీర్ అతనిని తొలగించి, బయటకు వచ్చిన తర్వాత, అతను మధ్య వేలితో కోత వైపు కూడా చూపించాడు.

ఇవి కూడా చదవండి: Ukraine Russia Crisis: ర్యష్యా వెనక్కి తగ్గలేదు.. పుతిన్‌ యుద్ధతంత్రంపై అమెరికా కీలక ప్రకటన..

Rudraksha Tree: మన తెలుగు నేలపై కాస్తున్న రుద్రాక్షలు.. ఎక్కడో తెలుసా?