Ipl 2022 Auction: వేలంలో చారుశర్మ ఘోర తప్పిదం.. తక్కువ ధరకే ముంబయి ప్లేయర్‌ను తన్నుకుపోయిన ఢిల్లీ..
Ipl 2022 Auction: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలం ముగిసింది. బెంగళూరు (Bangalore)లో రెండు రోజుల పాటు జరిగిన ఈ మెగా ఆక్షన్ క్రికెట్ ఫ్యాన్స్ కు కావాల్సిన మజాను అందించింది.
Ipl 2022 Auction: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలం ముగిసింది. బెంగళూరు (Bangalore)లో రెండు రోజుల పాటు జరిగిన ఈ మెగా ఆక్షన్ క్రికెట్ ఫ్యాన్స్ కు కావాల్సిన మజాను అందించింది. సుమారు 600 మంది క్రికెటర్లు ఈ వేలంలో పాల్గొనగా 204 మందిని మాత్రమే వివిధ ఫ్రాంఛైజీలు దక్కించుకున్నాయి. ఈ వేలం కారణంగా ఓవర్‌నైట్‌లో ఏకంగా 28 మంది క్రికెటర్లు కోటీశ్వరులయ్యారు. అదే సమయంలో గతంలో ఐపీఎస్ స్టార్స్ అని పేరు గడించిన ఆటగాళ్లు అన్‌సోల్డ్ జాబితాలో చేరిపోయారు. కాగా ఈ మెగా వేలాన్ని మొదట ప్రధాన ఆక్షనర్ హ్యూస్ ఎడ్మెడ్స్ నిర్వహించారు. అయితే డీహైడ్రేషన్ కారణంగా ఆయన అస్వస్థతకు గురికావడంతో ప్రముఖ కామెంటేటర్ చారుశర్మ మెగా వేలం బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఈ మెగా ఆక్షన్ రెండో రోజు చారుశర్మ చేసిన ఓ ఘోర తప్పిదం చేయడం చర్చనీయాంశమవుతోంది. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
బిడ్ అమౌంట్ మర్చిపోయి..
గత ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సేవలందించిన ఇండియన్ లెఫ్టార్మ్ సీమర్ ఖలీల్ అహ్మద్ కోసం రెండో రోజు రూ.50లక్షల బేస్ ప్రైస్‌తో బిడ్డింగ్ మొదలైంది. అతడిని దక్కించుకునేందుకు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడడంతో వేలంలో ఈ ఫాస్ట్ బౌలర్ ధర రూ.5 కోట్లు దాటేసింది. చివరకు రూ.5.25 కోట్లకు ముంబయి బిడ్ వేయగా.. రూ.5.50 కోట్లకు బిడ్ చేయమని ఢిల్లీ క్యాపిటల్స్ ను అడిగాడు ఆక్షనర్ చారుశర్మ. కానీ ఇక్కడ ఢిల్లీ కో- ఓనర్ కిరణ్ కుమార్ గ్రాంధీ ఉద్దేశపూర్వకంగా చేశాడో లేక అతి తెలివి ప్రదర్శించాడో కానీ కార్డ్ ఎత్తి.. లేదంటూనే చారు శర్మను తప్పుదారి పట్టించాడు. అతని చర్య వల్ల బిడ్ అమౌంట్ మర్చిపోయిన చారు శర్మ మళ్లీ రూ.5.25 కోట్ల వద్దనే ముంబయి అభిప్రాయాన్ని కోరాడు. వాళ్లు కూడా బిడ్ అమౌంట్ పట్టించుకోకుండా వద్దని చెప్పారు. దీంతో ఖలీల్ అహ్మద్ తక్కువ ధరకే ఢిల్లీ క్యాపిటల్స్ సొంతమయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.
ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ ఘటన జరిగినప్పుడు ముంబై, ఢిల్లీలోని ఏ ఫ్రాంచైజీల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. అయితే చారుశర్మ ప్రకటన వెలువడగానే ముంబయి ఇండియన్స్ ఓనర్లలో ఒకరు దీనిపై అభ్యంతరం చేసినా మిగతావారెవరూ పెద్దగా పట్టించుకోలేదు. మరోవైపు వేలంలో ఢిల్లీ ఓనర్ అతి తెలివి ప్రదర్శించాడని క్రికెట్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. కిరణ్ కుమార్ తన తెలివితో స్టార్ ప్లేయర్లను తక్కువ ధరకే సొంతం చేసుకున్నాడంటున్నారు. ఎస్‌ఆర్‌హెచ్ స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్‌ను కూడా కేవలం రూ.6.25 కోట్లకే ఢిల్లీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
— Ashok (@Ashok94540994) February 15, 2022
Mahesh Babu : క్రేజీ అప్డేట్.. మహేష్- త్రివిక్రమ్ సినిమాలో మలయాళ స్టార్ హీరో.?