Andhra Pradesh: రేపు విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్-2 ప్రారంభం.. సీఎం జగన్‌ తో కలిసి హాజరు కానున్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ..

Nitin Gadkari: కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ (Nithin Gadkari) రేపు (ఫిబ్రవరి17) రాష్ట్రంలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (CM Jagan) తో కలిసి ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు

Andhra Pradesh: రేపు విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్-2 ప్రారంభం.. సీఎం జగన్‌ తో కలిసి హాజరు కానున్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ..
Follow us
Basha Shek

|

Updated on: Feb 16, 2022 | 2:43 PM

Nitin Gadkari: కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ (Nithin Gadkari) రేపు (ఫిబ్రవరి17) రాష్ట్రంలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (CM Jagan) తో కలిసి ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. గడ్కరీ విజయవాడ పర్యటన వివరాలిలా ఉన్నాయి.. కేంద్రమంత్రి గురువారం ఉదయం 11.45 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని నేరుగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియానికి చేరుకుంటారు. జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ రాష్ట్రంలో రూ.11,157 కోట్లతో నిర్మించిన 20 రహదారులు, ఇతర ప్రాజెక్టులను సీఎం  జగన్‌తో కలిసి ప్రారంభిస్తారు. అదేవిధంగా రూ.10,401 కోట్లతో నిర్మించనున్న 31 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు వర్చువల్ గా  భూమిపూజ  చేయనున్నారు . ఈ సందర్భంగా మున్సిపల్‌ స్టేడియంతో నిర్వహించే బహిరంగ సమావేశంలో జగన్‌తో కలిసి ప్రసంగించనున్నారు.

సీఎం ప్రత్యేక విందు..

ఈ సమావేశం అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు బెంజ్ సర్కిల్ కు చేరుకుని కొత్తగా నిర్మించిన పశ్చిమదిశ ఫ్లై ఓవర్‌ను ప్రారంభిస్తారు. ఆతర్వాత తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ కు చేరుకుని రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నిర్వహించే విందులో కేంద్ర మంత్రి పాల్గొననున్నారు. లంచ్‌ అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు గడ్కరీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను దర్శించుకుంటారు. దుర్గమ్మ దర్శనం అనంతరం విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతారు. సాయంత్రం 5.45 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని నేరుగా నాగ్‌పూర్‌కు ప్రయాణమవుతారు. కాగా కేంద్రమంత్రి పర్యటన, బహిరంగసభ కోసం అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది.

Benz Circle Fly Over

Benz Circle Fly Over

Also Read:PSL 2022: కౌంటర్ ఇద్దామనుకున్నాడు అడ్డంగా బుక్కయ్యాడు.. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో ఆసక్తికర ఘటన

UP Elections 2022: యూపీలో మళ్లీ పాత నినాదాన్నే నమ్ముకున్న కమల దళం.. ఆ వ్యూహంతో ముందుకు

Hilarious Video: నా మామ కట్నంగా రైలు ఇచ్చారు.. నడపడం రాదని వద్దన్నాను! నాకైతే ఏకంగా రాకెట్‌ ఇచ్చారు తెలుసా..