Mahesh Babu : క్రేజీ అప్డేట్.. మహేష్- త్రివిక్రమ్ సినిమాలో మలయాళ స్టార్ హీరో.?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Mahesh Babu : క్రేజీ అప్డేట్.. మహేష్- త్రివిక్రమ్ సినిమాలో మలయాళ స్టార్ హీరో.?
Mahesh Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 16, 2022 | 2:58 PM

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అందాల భామ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలో మహేష్ మోకాలికి సర్జరీ జరిగింది. ఆవెంటనే మహేష్, కీర్తిసురేష్ తోపాటు పలువురు కరోనా బారిన పడ్డారు. దాంతో సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఈ సినిమాను సమ్మర్ కానుకగా మే 12న విడుదల చేయనున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమా తర్వాత మహేష్ త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పూజాకార్యక్రమాలు జరిగాయి. మహేష్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో సినిమా ఇది.

గతంలో మహేష్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు థియేటర్‌లో అంతగా ఆకట్టుకోకపోయినా టీవీలో మాత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. ఇప్పటికీ ఈ రెండు సినిమాలు టీవీలో టెలికాస్ట్ అయితే మంచి టీఆర్ఫీని సొంతం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాబోతున్న మహెష్ త్రివిక్రమ్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీలో హీరోయిన్‌గా బుట్టబొమ్మ పూజ హెగ్డేను ఎంపిక చేశారు. అలాగే సంగీత దర్శకుడిగా తమన్ ను ఫిక్స్ చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీలక పాత్ర కోసం ఓ సీనియర్ హీరోను తీసుకోనున్నారట. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తుంది. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారట. అలాగే ఈ సినిమాలో రెండో హీరోయిన్ గా మలయాళీ బ్యూటీ సంయుక్త మీనన్ పేరు వినిపిస్తుంది.

Mohanlal

Mohanlal

మరిన్ని ఇక్కడ చదవండి :

Movies In OTT: రొమాంటిక్, సస్పెన్స్, కామెడీ సినిమాలు ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్నాయి.. వివరాల్లోకి వెళ్తే..

DJ Tillu Box Office Collections: కలెక్షన్స్‌తో మైండ్ బ్లాంక్ చేస్తున్న డీజే టిల్లు.. ట్రేడ్ నిపుణులు సైతం షాక్

Anasuya Bharadwaj: ఏమి అందం బాబోయ్… కుర్రకారుకి చెమటలు పట్టిస్తున్న అనసూయ లేటెస్ట్ ఫోటోస్ వైరల్

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..