AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amani: ఆ దర్శకుడి సినిమాలో నటించాలి.. అదే నా కోరిక.. సీనియర్ హీరోయిన్ ఆమని ఇంట్రస్టింగ్ కామెంట్స్

ఒకప్పుడు హీరోయిన్స్‌గా రాణించిన వారు ఆతర్వాత సినిమాలు దూరమై ఇప్పుడు తిరిగి క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మరి అమ్మ, అక్క, వదిన క్యారెక్టర్స్ తో ఆకట్టుకుంటున్నారు.

Amani: ఆ దర్శకుడి సినిమాలో నటించాలి.. అదే నా కోరిక.. సీనియర్ హీరోయిన్ ఆమని ఇంట్రస్టింగ్ కామెంట్స్
Aamani
Rajeev Rayala
|

Updated on: Feb 16, 2022 | 3:55 PM

Share

Amani: ఒకప్పుడు హీరోయిన్స్‌గా రాణించిన వారు ఆతర్వాత సినిమాలు దూరమై ఇప్పుడు తిరిగి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లుగా మరి అమ్మ, అక్క, వదిన క్యారెక్టర్స్‌తో ఆకట్టుకుంటున్నారు. చాలా మంది ఇప్పటికే పోటీపడి మరి సినిమాల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ హీరోయిన్ ఆమని  కూడా ఇప్పుడు వరుస సినిమాలతో సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్నారు. హీరోయిన్ గా రాణించిన సమయంలో బాపు, విశ్వనాథ్‌లాంటి లెజెండ్రీ దర్శకుల ప్రశంసలు అందుకున్నారు ఆమని. ఇక ఇటీవల వచ్చిన చావు కబురు చల్లగా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ వంటి సినిమాలో నటించి ఆకట్టుకున్నారు ఆమని. తాజాగా ఆమని మేనకోడలు హ్రితిక నటించిన ‘అల్లంత దూరాన’ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమనీ మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను  పంచుకున్నారు.

ఆమని మాట్లాడుతూ.. ప్రస్తుతం చాలా సినిమాలనుంచి మంచి పాత్రలు వస్తున్నాయి. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నా.. అయినా కూడా నేను ఇంకా ఒక నటిగా సంతృప్తి చెందలేదు అన్నారు. నటిగా నాకు సంతృప్తినిచ్చే పాత్రల కోసం ఎదురుచూస్తున్నా అన్నారు. అలాగే నాకు ఏదైనా కోరిక ఉంది అంటే అది రాజమౌళి సినిమా చేయాలనీ.. ఆయన సినిమాలో చిన్న పాత్ర అయిన చేయాలని ఉంది అని ఆమని అన్నారు. మరి జక్కన్న ఈ సీనియర్ హీరోయిన్ కు ఛాన్స్ ఇస్తారేమో చూడాలి. ఇప్పటికే రాజమౌళి సినిమాల్లో సీనియర్ హీరోయిన్స్ పలువురు నటించిన విషయం తెలిసిందే.. ముఖ్యంగా బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ నటించిన శివగామి పాత్రకు మంచి పేరు వచ్చింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Movies In OTT: రొమాంటిక్, సస్పెన్స్, కామెడీ సినిమాలు ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్నాయి.. వివరాల్లోకి వెళ్తే..

DJ Tillu Box Office Collections: కలెక్షన్స్‌తో మైండ్ బ్లాంక్ చేస్తున్న డీజే టిల్లు.. ట్రేడ్ నిపుణులు సైతం షాక్

Anasuya Bharadwaj: ఏమి అందం బాబోయ్… కుర్రకారుకి చెమటలు పట్టిస్తున్న అనసూయ లేటెస్ట్ ఫోటోస్ వైరల్