AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Movies In OTT: రొమాంటిక్, సస్పెన్స్, కామెడీ సినిమాలు ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్నాయి.. వివరాల్లోకి వెళ్తే..

Movies In OTT: కరోనా వైరస్(Corona Virus) వెలుగులోకి వచ్చిన తర్వాత ఓటీటీ మంచి ఆదరణ సొంతం చేసుకుంది.  చిన్న పెద్ద సినిమాలను ఎక్కువుగా ఇంట్లో ఉండే చూడాలని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో..

Movies In OTT: రొమాంటిక్, సస్పెన్స్, కామెడీ సినిమాలు ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్నాయి.. వివరాల్లోకి వెళ్తే..
Ott Releases This Friday
Surya Kala
|

Updated on: Feb 16, 2022 | 2:43 PM

Share

Movies In OTT: కరోనా వైరస్(Corona Virus) వెలుగులోకి వచ్చిన తర్వాత ఓటీటీ మంచి ఆదరణ సొంతం చేసుకుంది.  చిన్న పెద్ద సినిమాలను ఎక్కువుగా ఇంట్లో ఉండే చూడాలని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వెండి తెరపై అలరించిన సినిమాలు కొన్ని రోజుల గ్యాప్ తో OTT లో ప్రీమియర్ కాబోతున్నాయి.  ఈ నేపథ్యంలో ఫిబ్రవరి థర్డ్ వీక్ లో రిలీజ్ కాబోతున్న సినిమాలు ఏమిటి.. ఏ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ కాబోతున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం..

జీ 5 (ZEE5): 

సంక్రాంతికానుకగా రిలీజై.. బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ అందుకున్న సినిమా “బంగార్రాజు”. అక్కినేని నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి  ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కావడానికి రెడీ అవుతుంది. ఫిబ్రవరి 18న జీ 5 లో ప్రసారం కానుంది.  కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ సినిమాను నాగార్జున నిర్మించడం విశేషం.

అమెజాన్ ప్రైమ్:  సస్పెన్స్ థ్రిల్లర్‌ మూవీ బెస్ట్ సెల్లర్ కూడా ఈ నెల 18న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. శృతి హాసన్, మిథున్ చక్రవర్తి, గౌహర్ ఖాన్, అర్జన్ ఎస్ బజ్వా, సత్యజీత్ దూబే, సోనాలీ కీలక పాత్రల్లో నటించారు. ఇద్దరు అపరిచితుల యాదృచ్ఛిక సమావేశం.. ఇతరుల జీవితాలపై ఎలా ప్రభావం చూపించింది అన్న నేపథ్యంలో తెరకెక్కింది.

డిస్నీ+ హాట్‌స్టార్‌:

మలయాళంలో సూపర్ హిట్ సినిమా హృదయం ఈ నెల 18న డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. కరోనా నిబంధనల సమయంలో కూడా కేరళలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ సినిమా లో ప్రణవ్ మోహన్‌లాల్, కళ్యాణి ప్రియదర్శన్, దర్శన రాజేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించారు. వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించారు.

బాలీవుడ్ లో స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన 83 సినిమా ఫిబ్రవరి 18న రిలీజ్ కానుంది. కబీర్ ఖాన్ దర్శకత్వంలో రణవీర్ సింగ్, దీపికా పదుకొణె హీరో, హీరోయిన్లుగా నటించారు. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదలైంది

నెట్‌ఫ్లిక్స్:

స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన 83 సినిమా డిస్నీ+ హాట్‌స్టార్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్లో కూడా ఏకకాలంలో రిలీజ్ కానుంది.

సోనీ లైవ్‌: విశాల్ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ ‘విలన్’ ఈ నెల 18న OTTలో ప్రసారం కానుంది. సోనీ లైవ్‌లో  విశాల్ విలన్ సందడి చేయనుంది.

Also Read:

ఈ రాశివారు అద్భుతమైన నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు.. అందులో మీరున్నారా..