AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ipl 2022 Auction: కేకేఆర్‌ కెప్టెన్‌గా టీమిండియా యంగ్‌ ప్లేయర్‌.. అధికారికంగా ప్రకటించిన యాజమాన్యం..

టీమిండియా యంగ్‌ ప్లేయర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) మరో గోల్డెన్‌ ఛాన్స్ దక్కించుకున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో అదరగొడుతోన్న ఈ ఆటగాడు ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ మెగావేలం( Ipl 2022 Auction)లో జాక్ పాట్ కొట్టిన సంగతి తెలిసిందే.

Ipl 2022 Auction: కేకేఆర్‌ కెప్టెన్‌గా టీమిండియా యంగ్‌ ప్లేయర్‌.. అధికారికంగా ప్రకటించిన యాజమాన్యం..
Kolkata Knight Riders
Basha Shek
|

Updated on: Feb 16, 2022 | 5:40 PM

Share

టీమిండియా యంగ్‌ ప్లేయర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) మరో గోల్డెన్‌ ఛాన్స్ దక్కించుకున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో అదరగొడుతోన్న ఈ ఆటగాడు ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ మెగావేలం( Ipl 2022 Auction)లో జాక్ పాట్ కొట్టిన సంగతి తెలిసిందే.  కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (Kolkata Knight Riders) యాజమాన్యం అతడిని ఏకంగా 12.25 కోట్లకు దక్కించుకుంది. తాజాగా అతనికే కేకేఆర్ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈవిషయాన్ని కేకేఆర్‌ ఫ్రాంఛైజీ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించింది. కాగా గతేడాది వరకు ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఆడాడు శ్రేయస్‌ అయ్యర్‌. కెప్టెన్‌గా సమర్థవంతంగా జట్టును నడిపించాడు. అతని నాయకత్వంలో మొదటిసారి నాకౌట్‌ దశకు చేరుకుంది.

కాగా గాయం కారణంగా గతేడాది ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు శ్రేయస్‌. అతని స్థానంలో యంగ్‌ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది ఢిల్లీ యాజమాన్యం. ఆ తర్వాత దుబాయిలో జరిగిన రెండో దశ టోర్నీలో జట్టులోకి వచ్చినా కేవలం ఆటగాడిగానే కొనసాగాడు. ఢిల్లీ యాజమాన్యం పంత్‌నే కెప్టెన్‌గా కొనసాగించింది. దీంతో బహిరంగ వేలంలోకి వచ్చాడు అయ్యర్‌. ఇతనిని వేలంలో దక్కించుకోవడం బెంగళూరు, కేకేఆర్ జట్లు తీవ్రంగా పోటీపడ్డాయి. అయితే కేకేఆర్‌ గూటికే చేరుకున్నాడు ఈ యంగ్‌ ప్లేయర్‌. మొత్తం 12.25 కోట్లకు అతడిని దక్కించుకుంది కేకేఆర్‌ యాజమాన్యం. అప్పుడే అతనికి కెప్టెన్సీ అప్పగిస్తారని వార్తలు వచ్చాయి. తాజాగా అవి నిజమయ్యాయి. తన నాయకత్వ లక్షణాలతో ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను అద్భుతంగా ముందుకు నడిపించిన శ్రేయస్‌ కేకేఆర్‌కు మరో టైటిల్‌ అందిస్తాడో లేదో చూడాలి మరి..

Also Read:DJ Tillu : సక్సెస్ సెలబ్రేషన్స్.. పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్న టిల్లు అండ్ టీమ్..

Bappi Lahiri: బప్పీల హరికి బంగారు ఆభరణాలంటే ఎందుకంత పిచ్చి?..ఈ డిస్కో కింగ్‌ వద్ద ఎంత గోల్డ్‌ ఉందో తెలుసా..

Sai pallavi: వరుస సినిమాలతో బిజీ బిజీగా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి…