DJ Tillu : సక్సెస్ సెలబ్రేషన్స్.. పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్న టిల్లు అండ్ టీమ్..
డీజే టిల్లు పాటలోని సాహిత్యం లాగానే ఇవాళ బాక్సాఫీసు బాక్సులు బద్ధలవుతున్నాయి. రోజు రోజుకీ ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్స్ డీజే టిల్లుని భారీ విజయం పైపు నడిపిస్తున్నాయి.
DJ Tillu : డీజే టిల్లు పాటలోని సాహిత్యం లాగానే ఇవాళ బాక్సాఫీసు బాక్సులు బద్ధలవుతున్నాయి. రోజు రోజుకీ ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్స్ డీజే టిల్లుని భారీ విజయం పైపు నడిపిస్తున్నాయి. ఈ మూవీలో సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించారు. ఈ సినిమాను ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది. డెబ్యూ డైరెక్టర్ విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. గత శుక్రవారం విడుదలయిన ‘డీజే టిల్లు’ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. చిత్రం సాధించిన విజయాన్ని, ఆ ఆనందాన్ని ప్రేక్షకులతో కలసి పంచుకునే దశలో హీరో సిద్దు జొన్నలగడ్డ, నాయిక నేహా శెట్టి, దర్శకుడు విమల్ కృష్ణ ల సక్సెస్ టూర్ చేస్తున్నారు ఈ క్రమంలో విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న చిత్ర బృందం పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు అలాగే రాజమండ్రిలోని పలు ధియేటర్‌లలో సందడిచేశారు.
టిల్లు టీంకు థియేటర్‌లో ప్రేక్షకులు మరింత ఉత్సాహాన్ని అందించారు. తమ ముందుకు వచ్చిన టిల్లును చూసి కేరింతలు కొట్టారు.. ప్రేక్షకులు టిల్లు టిల్లు అంటూ చేసిన నినాదాలతో ధియేటర్స్ దద్దరిల్లాయి. థియేటర్స్ లో ప్రేక్షకులతో హీరో సిద్దు జొన్నలగడ్డ, హీరోయిన్ నేహా శెట్టి, దర్శకుడు విమల్ కృష్ణ సినిమా చూశారు. ఈ సందర్భంగా హీరో సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ..’డీజే టిల్లు సక్సెస్ మీతో సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీ ఆనందం చూసి కడుపు నిండిపోయింది. ఇక రాధిక తో నేను పడుతున్న పాట్లు చూసారుగా మిమ్మల్ని ఏడిపించేంతవరకూ నవ్వించాలి అనుకున్నాం అది ఇప్పడు చూస్తున్నాం.. చాలా ఆనందంగా ఉంది. టిల్లు గాడు మిమ్మల్ని ఆనంద పెట్టేందుకే ఇకపై కూడా ప్రయత్నిస్తుంటాడు.. అన్నారు.. అలాగే డీజే టిల్లు టైటిల్ సాంగ్ కి స్టెప్స్ వేసి ప్రేక్షకుల్ని అలరించారు. ఇక హీరోయిన్ నేహా శెట్టి మాట్లాడుతూ.. నేను మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది.. ఇంత రెస్పాన్స్ ని నేను ఎక్స్ పీరియన్స్ ఎప్పుడూ చేయలేదు. చాలా ఆనందంగా ఉంది.. టిల్లుతో కలసి మిమ్మల్ని నేరుగా కలుసుకోవడం చాలా ఆనందగా ఉంది.. డీజే టిల్లు చిత్రం నా కెరియర్ లో బెస్ట్ గా నిలుస్తుంది అన్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :