AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: ‘నా దృష్టిలో ప్రేమంటే అదే’.. తనను కట్టుకోబోయే వాడు ఎలా ఉండాలో చెప్పేసిన నేషనల్‌ క్రష్‌..

ఏ ముహూర్తాన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిందో కానీ వరుసగా విజయాలు సొంతం చేసుకుంటోంది కన్నడ బ్యూటీ రష్మిక మందాన (Rashmika Mandanna).

Rashmika Mandanna: 'నా దృష్టిలో ప్రేమంటే అదే'.. తనను కట్టుకోబోయే వాడు ఎలా ఉండాలో చెప్పేసిన నేషనల్‌ క్రష్‌..
Rashmika Mandanna
Basha Shek
|

Updated on: Feb 16, 2022 | 4:10 PM

Share

ఏ ముహూర్తాన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిందో కానీ వరుసగా విజయాలు సొంతం చేసుకుంటోంది కన్నడ బ్యూటీ రష్మిక మందాన (Rashmika Mandanna). ‘ఛలో’  అంటూ తెలుగులో తన సినిమా ప్రయాణాన్ని ఆరంభించిన ఈ ముద్దుగుమ్మ ‘గీతగోవిందం’, ‘దేవదాస్’, ‘డియర్‌ కామ్రేడ్‌’, ‘సరిలేరు నీకెవ్వరు’ ‘భీష్మ’ చిత్రాలతో వరుస హిట్లు సొంతం చేసుకుంది. ఇక పుష్ప (Pushpa) సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయింది. అందంతో పాటు అభినయంతో ప్రేక్షకులను మెప్పిస్తోన్న ఈ అందాలతార ఏకంగా ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’గా క్రేజ్‌ సొంతం చేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది. సినిమాల సంగతి పక్కన పెడితే పర్సనల్ లైఫ్‌ పరంగానూ ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది రష్మిక. తన డియర్‌ కామ్రేడ్‌ విజయ్‌ దేవరకొండతో డేటింగ్‌ చేస్తోందన్న పుకార్లు బాగా షికార్లు చేస్తున్నాయి. ఈక్రమంలో ప్రస్తుతం ఓ సినిమా కోసం ముంబయిలో ఉంటోన్న ఈ బ్యూటీ క్వీన్‌ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. తన వృత్తగత జీవితంతో పాటు ప్రేమ, రిలేషన్‌షిప్‌, పెళ్లి గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

మాటల్లో చెప్పలేని ఫీలింగ్‌..

‘నా దృష్టిలో ప్రేమంటే మాటల్లో వర్ణించలేం. అది కేవలం ఫీలింగ్స్‌కు సంబంధించిన విషయం మాత్రమే. రిలేషన్‌ షిప్‌లో ఒకరికి మరొకరు తగిన సమయం, గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. అప్పుడే మాత్రమే అది ప్రేమగా మారుతుంది. ప్రేమ అనేది రెండువైపులా ఉంటేనే ఆ బంధం ముందుకు వెళుతుంది’ అని లవ్‌, రిలేషన్‌ షిప్‌ గురించి చెప్పుకొచ్చింది రష్మిక. ఇక పెళ్లి గురించి స్పందిస్తూ ‘ప్రస్తుతానికి నా వయసు చిన్నది. కాబట్టి పెళ్లి గురించి ఏవిధంగా ఆలోచించాలో నాకు తెలియడం లేదు. పెళ్లికి సంబంధించిన ఆలోచనలను కూడా నా మనసులోకి రానీయడంలేదు. నన్ను ఎవరైతే ప్రేమగా, సురక్షితంగా చూసుకుంటారో వారిని పెళ్లి చేసుకుంటాను’ అని రష్మిక మందన్న పేర్కొంది. ప్రస్తుతం తెలుగులో ‘పుష్ప’ సినిమాలో నటిస్తోన్న బాలీవుడ్‌లో మిస్టర్‌ మజ్ను, గుడ్‌ బై చిత్రాల్లో నటిస్తోంది.

Also Read:Ipl 2022 Auction: వేలంలో చారుశర్మ ఘోర తప్పిదం.. తక్కువ ధరకే ముంబయి ప్లేయర్‌ను తన్నుకుపోయిన ఢిల్లీ..

Selfie accident: రైలు పట్టాలపై సెల్ఫీ.. యువకులను ఢీ కొట్టిన రైలు.. నలుగురు మృతి

Andhra Pradesh: రేపు విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్-2 ప్రారంభం.. సీఎం జగన్‌ తో కలిసి హాజరు కానున్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ..