IND vs WI 1st T20 Highlights: తొలి టీ20లో టీమిండియా ఘన విజయం.. 6 వికెట్ల తేడాతో విండీస్ పరాజయం

Basha Shek

| Edited By: Venkata Chari

Updated on: Feb 16, 2022 | 11:09 PM

India vs West Indies 1st T20 Highlights in Telugu వన్డే సిరీస్‌లో వెస్టిండీస్‌ను 3-0తో ఓడించిన భారత జట్టు ఇప్పుడు టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ను సులభంగా గెలుచుకుని 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

IND vs WI 1st T20 Highlights: తొలి టీ20లో టీమిండియా ఘన విజయం.. 6 వికెట్ల తేడాతో విండీస్ పరాజయం
India Vs West Indies

India vs West Indies 1st T20 Highlights in Telugu: భారత్ వర్సెస్ వెస్టిండీస్‌ల మధ్య మూడు టీ20ఐల సిరీస్‌లో భాగంగా నేడు కోల్‌కతాలో జరిగిన తొలి మ్యాచులో భారత్ ఘన విజయం సాధించింది. టీ20 సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు వన్డే తర్వాత టీ20 సిరీస్‌లో శుభారంభం చేసింది. దీంతో మూడు టీ20ఐల సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో వన్డే ఫిబ్రవరి 18న ఇదే మైదానంలో జరగనుంది.

ఇప్పటికే వన్డే సిరీస్‌లో విండీస్‌ ను వైట్‌వాష్‌ చేసిన టీమిండియా టీ 20 సమరానికి సిద్ధమైంది. కోల్‌కతాలోని చరిత్రాత్మక ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా భారత్‌, వెస్టిండీస్‌ (IND vs Wi) జట్ల మధ్య మొదటి టీ20 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన ఉత్సాహంలో టీ20ల్లోనూ జయకేతనం ఎగురవేయలని టీమిడియా భావిస్తుండగా.. తమకు బాగా పట్టున్న టీ20ల్లో అయినా విజయం సాధించాలని విండీస్‌ జట్టు భావిస్తోంది. కాగా ఈ ఏడాది టీ 20 కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ(Rohith Sharma) కు ఇదే తొలి పూర్తి స్థాయి సిరీస్‌. దీనికి తోడు మరో 8 నెలల్లో ఆస్ట్రేలియా గడ్డమీద ప్రతిష్ఠాత్మక టీ 20 ప్రపంచకప్‌ జరగనుంది. ఇప్పటికే ఐపీఎల్‌, వన్డే సిరీస్‌లో తన కెప్టెన్సీతో ఆకట్టుకున్న రోహిత్.. టీ20ల్లోనూ టీమిండియాను విజయవంతంగా ముందుకు నడిపించాలని క్రికెట్‌ అభిమానులు ఆశిస్తున్నారు.

పిచ్‌ ఎలా ఉందంటే.. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ మైదనాం గతంలో స్పిన్నర్లకే ఎక్కువగా సహకరించేది. అయితే ఇప్పుడు పేసర్లు, స్పిన్నర్లకు సమానంగా అనుకూలిస్తోంది. పిచ్‌పై మంచి బౌన్స్‌ ఉంది. క్యురేటర్‌ అంచనాల ప్రకారం ఇక్కడ ఓ మోస్తరు భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశముంది. రాత్రి మంచు ప్రభావం బాగా ఉంటుంది కాబట్టి మ్యాచ్‌ ముందుకు సాగేకొద్దీ స్పిన్నర్లకు ఇబ్బందవుతుంది. కాబట్టి టాస్‌ గెలిచిన జట్టు మొదట ఫీల్డింగ్‌కే మొగ్గు చూపవచ్చు.

తుది జట్లు

భారత్‌:

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, విరాట్‌ కోహ్లి, రిషభ్‌ పంత్‌, సూర్యకుమార్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, యుజువేంద్ర చాహల్‌, రవి బిష్ణోయ్‌, హర్షల్‌ పటేల్‌, సిరాజ్‌, దీపక్‌ చాహర్‌, భువనేశ్వర్‌ కుమార్

వెస్టిండీస్‌

కీరన్‌ పొలార్డ్‌ (కెప్టెన్‌), కైల్‌ మేయర్స్‌, బ్రెండన్‌ కింగ్‌, నికోలస్‌ పూరన్‌, రోమన్‌ పావెల్‌, రోస్టన్‌ ఛేజ్‌, రోమెరియా షెపర్డ్‌, ఫేబియన్‌ అలెన్‌, ఒడియన్‌ స్మిత్‌, అకీల్‌ హొసీన్‌, షెల్డన్‌ కాట్రెల్‌

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 16 Feb 2022 11:09 PM (IST)

    తొలి టీ20లో టీమిండియా ఘన విజయం

    భారత్ వర్సెస్ వెస్టిండీస్‌ల మధ్య మూడు టీ20ఐల సిరీస్‌లో భాగంగా నేడు కోల్‌కతాలో జరిగిన తొలి మ్యాచులో భారత్ ఘన విజయం సాధించింది. టీ20 సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు వన్డే తర్వాత టీ20 సిరీస్‌లో శుభారంభం చేసింది. దీంతో మూడు టీ20ఐల సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

  • 16 Feb 2022 10:27 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన భారత్..

    టీమిండియాకు కష్టాలు మరింత పెరిగాయి. రిషబ్ పంత్(8) నాలుగో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. కార్టెల్ బౌలింగ్‌లో ఓడియన్ స్మిత్ క్యాచ్‌తో రిషబ్ పంత్ పెవిలియన్ చేరాడు. దీంతో 114 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ను కోల్పోయింది.

  • 16 Feb 2022 10:14 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన భారత్..

    టీమిండియాకు కష్టాలు మొదలయ్యాయి. ఇషాన్ కిషన్ పెవిలియన్ చేరిన వెంటనే విరాట్ కోహ్లీ(17) కూడా పెవిలియన్ చేరాడు. ఫాబియన్ అలెన్ బౌలింగ్‌లో పొలార్డ్‌కు చిక్కాడు. దీంతో 95 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది.

  • 16 Feb 2022 10:11 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన భారత్..

    స్లోగా బ్యాటింగ్ ఆరంభించిన భారత ఓపెనర్ ఇషాన్(35) రోస్టన్ చేజ్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి బౌండరీ వద్ద ఫాబియన్ అలెన్‌కు చిక్కాడు. దీంతో 93 పరుగుల వద్ద 2వ వికెట్‌ను కోల్పోయింది.

  • 16 Feb 2022 09:58 PM (IST)

    10 ఓవర్లకు టీమిండియా స్కోర్..

    10 ఓవర్లు పూర్తయ్యే సరికి టీమిండియా ఒక వికెట్ కోల్పోయి 80 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 30, విరాట్ కోహ్లీ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా విజయం సాధించాలంటే 60 బంతుల్లో 78 పరుగులు సాధించాలి.

  • 16 Feb 2022 09:49 PM (IST)

    మొదటి వికెట్ కోల్పోయిన టీమిండియా.. రోహిత్ ఔట్..

    టీమిండియా మొదటి వికెట్ కోల్పోయింది.  19 బంతుల్లో 40 పరుగులు ( 4 ఫోర్లు, 3 సిక్స్ లు) చేసిన హిట్ మ్యాన్ రోహిత్ రోస్టన్ ఛేజ్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఇప్పుడు కోహ్లీ క్రీజులోకి అడుగుపెట్టాడు.  8 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 65/1. ఇషాన్ కిషన్ (28 బంతుల్లో 23), కోహ్లీ (1) క్రీజులో ఉన్నారు. టీమిండియా విజయానికి 72 బంతుల్లో 93 పరుగులు అవసరం.

  • 16 Feb 2022 09:40 PM (IST)

    ఛేదనలో టీమిండియా జోరు.. 50 పరుగులు పూర్తి..

    158 పరుగుల ఛేజింగ్ లో టీమిండియా ధాటిగా బ్యాటింగ్ చేస్తోంది.  ఓపెనర్లు హిట్ మ్యాన్ రోహిత్, ఇషాన్ కిషన్ లు విండీస్ బౌలర్లను ఉతికారేస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 6 ఓవర్లలో టీమిండియా స్కోరు 58/0.   రోహిత్ శర్మ (38), ఇషాన్ కిషన్ (18) పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 16 Feb 2022 09:31 PM (IST)

    హిట్ మ్యాన్ దూకుడు.. 4 ఓవర్లకు టీమిండియా స్కోరు 44/0..

    158 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ధాటిగా బ్యాటింగ్ చేస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ (13 బంతుల్లో 34 పరుగులు మూడు ఫోర్లు, మూడు  సిక్స్ లు), ఇషాన్ కిషన్ (11 బంతుల్లో9) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 4 ఓవర్లకు 44/0.

  • 16 Feb 2022 09:24 PM (IST)

    ముగిసిన విండీస్ ఇన్నింగ్స్… విజయానికి టీమిండియా ఎన్ని పరుగులు చేయాలంటే..

    విండీస్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. కెప్టెన్ పొలార్డ్ 19 బంతుల్లో 24 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

  • 16 Feb 2022 08:49 PM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన కరీబియన్ జట్టు.. పూరన్ ను బోల్తా కొట్టించిన హర్షల్ పటేల్..

    అర్ధ సెంచరీతో రాణించిన నికోలస్ పూరన్ ( 43 బంతుల్లో 61) ఔటయ్యాడు. ఐపీఎల్ స్టార్ బౌలర్ హర్షల్ పటేల్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి విరాట్ కోహ్లీకి చిక్కాడు. మరోవైపు కెప్టెన్ పొలార్డ్ భారీ షాట్లతో విరుచుకుపడుతున్నాడు. ప్రస్తుతం 18.2 ఓవరల్లో విండీస్ స్కోరు 143/6.

  • 16 Feb 2022 08:39 PM (IST)

    ధాటిగా విండీస్ బ్యాటింగ్.. వంద పరుగులు పూర్తి.. అర్ధ సెంచరీ చేసిన పూరన్

    విండీస్ స్కోరు వంద పరుగులు దాటింది. నికోలస్ పూరన్ 38 బంతుల్లో 53 పరుగులు (4 ఫోర్లు,4 సిక్స్ లు) చేశాడు. మరోవైపు క్రీజులో నిలదొక్కుకునేందుకు పొలార్డ్ ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం 17 ఓవర్లకు విండీస్ స్కోరు 125/5.

  • 16 Feb 2022 08:25 PM (IST)

    ఐదో వికెట్ కోల్పోయిన విండీస్.. క్రీజులోకి అడుగుపెట్టిన కెప్టెన్ పొలార్డ్..

    విండీస్ జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. దీపక్ చాహర్ వేసిన 14 ఓవర్ లో అఖిల్ అకీల్‌ హొసీన్‌ను ఔట్ చేశాడు. దీంతో కెప్టెన్ పొలార్డ్ క్రీజులోకి అడుగుపెట్టాడు. మరోవైపు వైస్ కెప్టెన్ నికోలస్ పూరన్ (30 బంతుల్లో 36 పరుగులు) నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం విండీస్ స్కోరు 14.4 ఓవర్లలో 96/5.

  • 16 Feb 2022 08:09 PM (IST)

    టీమిండియాకు డబుల్ బ్రేక్ ఇచ్చిన రవి బిష్ణోయ్..

    మ్యాచ్ లో అరంగేట్రం చేసిన రవి బిష్ణోయ్ టీమిండియాకు డబుల్ బ్రేక్ ఇచ్చాడు. ఒకే ఓవర్ లో రెండు వికెట్లు తీశాడు. 11 ఓవర్ లో రెండో బంతికి రోస్టన్ ఛేజ్ ను ఎల్బీగా ఔట్ చేసిన బిష్ణోయ్ అదే ఓవర్ లో 5వ బంతికి రోమన్ పావెల్ ను పెవిలియన్ కు పంపించాడు. ప్రస్తుతం 11 ఓవర్లకు విండీస్ స్కోరు 75/4.

  • 16 Feb 2022 07:56 PM (IST)

    కరీబియన్ల జోరుకు స్పిన్నర్ల అడ్డుకట్ట.. 10 ఓవర్లకు విండీస్ స్కోరు ఎంతంటే..

    బౌండరీలు, సిక్స్ లతో రెచ్చిపోతున్న విండీస్ బ్యాటర్లను టీమిండియా స్పిన్నర్లు కట్టడి చేస్తున్నారు. చాహల్, రవి బిష్ణోయ్ ట్టుదిట్టంగా బంతులేస్తుండడంతో పూరన్, ఛేజ్ లు పరుగులు సాధించేందుకు కష్టపడుతున్నారు. 10 ఓవర్లకు విండీస్ స్కోరు 71/2. పూరన్ 27, ఛేజ్ 8 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.

  • 16 Feb 2022 07:40 PM (IST)

    భారత్ కు బ్రేక్ ఇచ్చిన చాహల్.. కైల్ మేయర్స్ ఔట్..

    స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ భారత జట్టుకు బ్రేక్ ఇచ్చాడు. బౌండరీలతో రెచ్చిపోతోన్న కైల్ మేయర్స్ ( 24 బంతుల్లో 31 పరుగులు)ను వికెట్ల ముందు దొరకబుబ్చుకున్నాడు. రోస్టన్ ఛేజ్ క్రీజ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం 7 ఓవర్లలో టీమిండియా స్కోరు 52/2.

  • 16 Feb 2022 07:36 PM (IST)

    50 పరుగులు దాటిన విండీస్ స్కోరు.. రెండు సిక్స్ లు బాదిన పూరన్..

    విండీస్ బ్యాటర్లు అలవోకగా పరుగులు సాధిస్తున్నారు. క్రీజ్ లో నిలదొక్కుకోవడంతో పరుగుల కంటే ఫోర్లు, సిక్స్ లు కొడుతూ ధాటిగా ఆడుతున్నారు. కైల్ మేయర్స్ బౌండరీలతో విరుచుకుపడుతుంగా, పూరన్ సిక్స్ లతో తన దూకుడును కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం 6 ఓవర్లలో విండీస్ స్కోరు 51/1.

  • 16 Feb 2022 07:26 PM (IST)

    ధాటిగా ఆడుతోన్నవిండీస్ బ్యాటర్లు.. 5 ఓవర్లకు విండీస్ స్కోరు ఎంతంటే..

    మొదటి ఓవర్లోనే వికెట్ ను కోల్పోయిన తర్వాత విండీస్ బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ స్కోరుబోర్డును ముందుకు కదిలిస్తున్నారు.ముఖ్యంగా ఓపెనర్ కైల్ మేయర్స్ వరుస ఫోర్లతో రెచ్చిపోతున్నాడు. ప్రస్తుతం 5 ఓవర్లకు విండీస్ స్కోరు 35/1. కైల్ మేయర్స్ (18 బంతుల్లో 23, 5 బౌండరీలు), నికోలస్ పూరన్ (7) పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 16 Feb 2022 07:20 PM (IST)

    ఈడెన్ గార్డెన్లో గంట మోగించిన టీమిండియా మాజీ ఆటగాడు..

    టీమిండియా మాజీ ఆటగాడు, ఇటీవల సెలక్షన్ కమిటీ నుంచి తప్పుకున్న చేతన్ శర్మ ఈడెన్ గార్డెన్ లోని గంటను మోగించి మ్యాచ్ ను ప్రారంభించాడు. ఇంగ్లండ్ లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానం తరహాలో ఈడెన్ గార్డెన్ లో కూడా ఈ గంట సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ క్యాబ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ బెల్ ను ప్రవేశపెట్టాడు.

  • 16 Feb 2022 07:11 PM (IST)

    టీమిండియాకు శుభారంభం.. బ్రెండన్ కింగ్ ను ఔట్ చేసిన భువనేశ్వర్..

    టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన విండీస్ కు టీమిండియా స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ షాక్ ఇచ్చాడు. మొదటి ఓవర్ లోనే విండీస్ ఓపెనర్ బ్రెండన్ కింగ్ ను ఔట్ చేసి టీమిండియాకు శుభారంభం అందించాడు. ప్రస్తుతం విండీస్ స్కోరు 2 ఓవర్లకు 12/1.  కైల్ మేయర్స్ (8), నికోలస్ పూరన్ (0) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.

Published On - Feb 16,2022 7:02 PM

Follow us
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే