AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma: మరో ఫార్మెట్‌కు కూడా రోహిత్ శర్మ కెప్టెన్.. శ్రీలంక సిరీస్‌కు ముందు కీలక ప్రకటన చేయనున్న బీసీసీఐ..

శ్రీలంక సిరీస్‌కు ముందు టెస్ట్ జట్టుకు కెప్టెన్‌ను ప్రకటించనుంది బీసీసీఐ. భారత క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కొత్త టెస్టు కెప్టెన్‌గా ఎంపిక చేయనుంది. బీసీసీఐ (BCCI) సెలెక్టర్లు డిసెంబర్‌లో..

Rohit Sharma: మరో ఫార్మెట్‌కు కూడా రోహిత్ శర్మ కెప్టెన్.. శ్రీలంక సిరీస్‌కు ముందు కీలక ప్రకటన చేయనున్న బీసీసీఐ..
Rohit Sharma
Sanjay Kasula
|

Updated on: Feb 16, 2022 | 1:11 PM

Share

శ్రీలంక సిరీస్‌కు ముందు టెస్ట్ జట్టుకు కెప్టెన్‌ను ప్రకటించనుంది బీసీసీఐ. భారత క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కొత్త టెస్టు కెప్టెన్‌గా ఎంపిక చేయనుంది. బీసీసీఐ (BCCI) సెలెక్టర్లు డిసెంబర్‌లో రోహిత్ శర్మను పరిమిత ఓవర్ల భారత జట్టుకు రెగ్యులర్ కెప్టెన్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ కూడా హోమ్ సిరీస్‌కు ముందు టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక కానున్నారు. ఇప్పటికే వన్డే, టీ20 లకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. పరిమిత ఓవర్ల సారథి, టెస్టు వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకే పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం సాగుతున్నాయి. అయితే ముందుగా కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌… పేర్లు తెర మీదకు వస్తున్నాయి. వయసు, ఫిట్‌నెస్‌ రీత్యా బీసీసీఐ హిట్‌మ్యాన్‌ వైపు మొగ్గు చూపకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీసీసీఐ మాత్రం ఈ విషయంపై పూర్తి క్లారిటీతో ఉంది. రోహిత్‌ శర్మకే టెస్టు కెప్టెన్సీ కూడా అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం

కానీ, ఇప్పుడు టెస్టు జట్టుకు కూడా కెప్టెన్‌ మారనున్నాడు. అంటే ఇక ముందు క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో రోహిత్ భారత కెప్టెన్‌గా ఉంటాడు. అదే సమయంలో శ్రీలంకతో జరిగే సిరీస్‌కు టీమ్ ఇండియా జట్టును ఎంపిక చేయనున్నారు. శ్రీలంక జట్టును ఎంపిక చేయడానికి భారత సెలక్టర్లు  సమావేశం కానున్నారు. వారు రోహిత్ శర్మను టెస్ట్ కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు కూడా ప్రకటించే ఛాన్స్ ఉంది.

విరాట్ కోహ్లీ (విరాట్ కోహ్లీ) టీమ్ ఇండియాలో టెస్ట్ కెప్టెన్సీకి రాజీనామా చేసినప్పటి నుంచి ఖాళీగా ఉంది. ప్రస్తుతం ఎలాంటి టెస్టు సిరీస్ లేక పోవడంతో సెలెక్టర్లు ఈ అంశాన్ని పక్కన పెట్టారు. కానీ, ఇప్పుడు శ్రీలంకతో సిరీస్‌లో భారత్ 2 టెస్టులు ఆడాల్సి ఉంది. దీంతో కెప్టెన్‌ని నియమించుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

ఇక దక్షిణాఫ్రికాతో రెండో టెస్టుకు సారథిగా వ్యవహరించిన కేఎల్‌ రాహుల్‌నే వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేసేందుకు బీసీసీఐ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మరోవైపు పంత్‌ కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి: Ukraine Russia Crisis: ర్యష్యా వెనక్కి తగ్గలేదు.. పుతిన్‌ యుద్ధతంత్రంపై అమెరికా కీలక ప్రకటన..

Rudraksha Tree: మన తెలుగు నేలపై కాస్తున్న రుద్రాక్షలు.. ఎక్కడో తెలుసా?