AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Polished rice: పాలిష్ చేసిన రైస్‌ 3 పూటలా తింటున్నారా..? అయితే మీకు ముప్పు తప్పదు

Diabetes and Rice: ప్రజల ఆహారంలో ప్రధానమైన అన్నం చక్కెర వ్యాధికి దారి తీస్తుందని పరిశోధనలు చెబుతుంటే అన్నం తినాలో వద్దో అనే అనుమానాలు తలెత్తుతాయి. మరి దీనిపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

Polished rice: పాలిష్ చేసిన రైస్‌ 3 పూటలా తింటున్నారా..? అయితే మీకు ముప్పు తప్పదు
Polished Rice
Ram Naramaneni
|

Updated on: Feb 16, 2022 | 3:48 PM

Share

Rice purity test: బాగా తెల్లగా, సన్నగా ఉంటేనే  రైస్ మన కంటికి ఇంపుగా ఉంటుంది. నోటికి రుచిగా అనిపిస్తుంది. అందుకే పాలిష్ మీద పాలిష్ చేయించిన రైస్ వైపు మన మనసు మళ్లుతుంది. కానీ ఇలాంటి రైస్ చాలా అంటే చాలా డేంజర్. దీన్ని తినడం వల్ల షుగర్ వ్యాధి, స్థూలకాయం ముప్పు ఎక్కువవుతుందట. ప్రపంచవ్యాప్తంగా చేసిన అనేక పరిశోధనల్లోనూ ఇదే విషయం తేటతెల్లమైంది. రెండు తరాల క్రితం మన పెద్దలు జొన్న అన్నం తినేవారు. చాలా ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో రాగి సంగటి తినేవారు. పల్లెటూర్లలో ఉల్లిపాయతో చల్ల అన్నం కూడా ఎక్కువగా తినేవారని పెద్దలు చెప్పేవారు. కానీ ఇప్పుడు అన్ని ప్రాంతాలలోనూ పాలిష్ చేసిన బియ్యమే తింటున్నారు అందరూ. అవును బియ్యాన్ని ఎక్కువసార్లు మర ఆడించడం వల్ల.. ప్రొటీన్స్ అన్ని తవుడులో, నూకలో వెళ్లిపోతున్నాయి. ఇక మిగిలేది పిండి పదార్థం మాత్రమే ఇది తిన్నవెంటనే జిర్ణమయిపోయి.. రక్తంలో కలిసిపోతుంది. ఈ క్రమంలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనవుతాయి. ఈ సమయంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించేందుకు ప్యాంక్రియాస్ గ్రంధి ఇన్సిలిన్‌ను అధిక స్థాయిలో విడుదల చేస్తుంది. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే, క్రమేణ ఇన్సిలిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీంతో షుగర్ వ్యాధి మనల్ని వెంటాడుతుంది.  ఇండియాలో 20 – 79 ఏళ్ల మధ్య వయస్కులలో 10.39 శాతం టైపు 2 డయాబెటిస్ బాధితులని ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫౌండేషన్ 2017 లెక్కలు చెబుతున్నాయి.

ఈ పరిణామాల వల్ల ప్రధాన ఆహారమైన అన్నం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రకృతిలో సహజంగా లభించే ఏ ఆహార పదార్ధమైనా హెల్త్‌కి మంచిదేననీ, కానీ, దానిని ప్రకృతి నుంచి వేరు చేసి తినే ప్రక్రియలో వాటి సహజత్వాన్ని నాశనం చేయడం వల్లే సమస్యలు ఉత్పన్నమవుతాయని వారు చెబుతున్నారు. బ్రౌన్ రైస్, మిల్లెట్స్ వంటి వాటిపైపు దృష్టి పెట్టాలని చెబుతున్నారు.

(ఈ సమాచారం నిపుణుల నుంచి సేకరించబడింది. మీరు ఏదైనా డైట్ ఫాలో అయ్యేముందు, మీకు ఏదైనా అనుమానాలు ఉన్నా.. ఆరోగ్య నిపుణులను సంప్రదించండి)

Also Read: DJ Tillu Box Office Collections: కలెక్షన్స్‌తో మైండ్ బ్లాంక్ చేస్తున్న డీజే టిల్లు.. ట్రేడ్ నిపుణులు సైతం షాక్