AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sleeping Disorder: నిద్రపోయే ముందు ఈ 5 ఆహారాలను దూరం పెట్టండి.. లేదంటే ఏమవుతుందో తెలుసా!

Sleeping Disorders: తగినంత ఆహారం తీసుకోవడమే కాకుండా.. కంటి నిండా నిద్ర పడితే.. మనిషి ఆరోగ్యంగా ఉంటాడని పెద్దలు అంటుంటారు...

Sleeping Disorder: నిద్రపోయే ముందు ఈ 5 ఆహారాలను దూరం పెట్టండి.. లేదంటే ఏమవుతుందో తెలుసా!
Food
Ravi Kiran
|

Updated on: Feb 16, 2022 | 1:36 PM

Share

తగినంత ఆహారం తీసుకోవడమే కాకుండా.. కంటి నిండా నిద్ర పడితే.. మనిషి ఆరోగ్యంగా ఉంటాడని పెద్దలు అంటుంటారు. ఓ వ్యక్తి నిర్దిష్ట సమయం కంటే తక్కువ గంటల నిద్రపోతే.. లేనిపోని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకు నిద్రపోయే ముందు పలు ఆహారాలను దూరంగా పెడితే.. కంటి నిండా నిద్ర పడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. మరి ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రాత్రిపూట భోజనం తర్వాత ఈ 5 ఆహారాలను దూరం పెట్టండి…

  1. నాన్-వెజ్: మాంసాహారంలో కొవ్వు, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. జీర్ణం అయ్యేందుకు కూడా చాలా సమయం పడుతుంది. అందుకే రాత్రిపూట మాంసాహరానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
  2. కాఫీ: రాత్రి భోజనం చేసిన అనంతరం కాఫీ తాగడం చాలామందికి అలవాటు. అయితే కాఫీలో కెఫిన్ శాతం అధిక మోతాదులో ఉంటుంది గనుక అది నిద్రలేమికి కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. ఉదయం లేదా మధ్యాహ్న సమయాల్లో కాఫీ తాగడం మంచిదని సూచిస్తున్నారు.
  3. స్పైసీ ఫుడ్: స్పైసీ ఫుడ్ ఏ సమయంలో తిన్నా కూడా కడుపు సంబంధిత సమస్యలకు కారణమవుతుంది. అయితే డిన్నర్‌లో స్పైసీ ఫుడ్‌ను తీసుకుంటే మాత్రం అది జీర్ణం కావడం అంత తేలిక కాదు. ఎసిడిటీ సమస్య తలెత్తవచ్చు.
  4. టీ: రాత్రిపూట భోజనం చేశాక కొంతమంది టీ తగుతుంటారు. కాఫీలో మాదిరిగానే టీ ఆకులలోనూ కెఫిన్ ఉంటుంది. నిద్రపోయే ముందు టీని సేవించడం వల్ల.. అది నిద్రపై ప్రభావం చూపిస్తుంది.
  5. జంక్ ఫుడ్: జంక్ ఫుడ్‌లో అధిక మొత్తంలో సంతృప్త కొవ్వు ఎక్కువ. అంత త్వరగా జీర్ణం కాదు. రాత్రిపూట జంక్ ఫుడ్ తినడం వల్ల నిద్ర సరిగ్గా పట్టదు.