అన్నం పెట్టే అన్నదాత అని కనికరం చూపకుండా.. మాయమాటలు చెప్పి..
ఆరుగాలం శ్రమించి, పంట పండిస్తున్న రైతుకు కష్టాలు తప్పడం లేదు. వాతావరణం సహకరించకపోయినా.. వ్యవసాయం చేస్తూ కష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నాడు. అధిక వర్షాలు, వర్షాలు కురవకపోవడం,....
ఆరుగాలం శ్రమించి, పంట పండిస్తున్న రైతుకు కష్టాలు తప్పడం లేదు. వాతావరణం సహకరించకపోయినా.. వ్యవసాయం చేస్తూ కష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నాడు. అధిక వర్షాలు, వర్షాలు కురవకపోవడం, తెగుళ్లు, చీడపీడలు వంటి వాటి నుంచి పంటను రక్షిస్తూ భారంగా బతుకెళ్లదీస్తున్నాడు. పట్టెడంత అన్నం పెట్టేందుకు పడరాని పాట్లు పడుతున్నాడు. గిట్టుబాటు ధర లేకపోవడం వారు ప్రధాన సమస్యగా భావించగా.. తాజాగా వారిని దొంగలూ వదలడం లేదు. నెల్లూరు జిల్లాలో జరిగిన ఓ ఘటన ఆందోళన కలిగిస్తోంది. ధాన్యం విక్రయించి, ఇంటికి వస్తున్న రైతు నుంచి గుర్తు తెలియని వ్యక్తులు డబ్బును అపహరించారు. మాయమాటలు చెప్పి నగదు దొంగిలించి పరారయ్యారు. బాధిత రైతు తేరుకోగానే దుండగులు కనిపించకుండా వెళ్లిపోయారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధిత రైతు ఫిర్యాదుతో సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలం బత్తలవల్లం గ్రామానికి చెందిన మునిరాజా.. తాను పండించిన ధాన్యాన్ని నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని ఓ రైస్ మిల్లులో విక్రయించాడు. ధాన్యం అమ్మగా వచ్చిన రూ.4.80 లక్షల చెక్కును మిల్లు యజమాని ఇచ్చాడు. దీనిని స్థానిక యూనియన్ బ్యాంకులో నగదు డ్రా చేసుకుని, బ్యాగ్ లో పెట్టు్కుని బైక్ పై స్వగ్రామానికి బయల్దేరాడు. మార్గమధ్యలోని వాటంబేడు రోడ్డులో.. ఎదురుగా రెండు ద్విచక్ర వాహనాల్లో వచ్చిన నలుగురు యువకులు నగదు కింద పడ్డాయని మునిరాజాకు చెప్పారు. వెంటనే మునిరాజ ద్విచక్ర వాహనాన్ని ఆపి, అటు ఇటు చూసేలోగా యువకులు వాహనంలో ఉన్న నగదు బ్యాగును తీసుకుని పరారయ్యారు. మునిరాజు చూసేసరికి బ్యాగు కనిపించలేదు. ఆందోళనకు గురైన రైతు వెంటనే కొంతదూరం వారిని వెంబడించినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అంతటా గాలించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
Also Read
విచక్షణ మరిచిన ఉపాధ్యాయుడు.. విద్యార్థిపై ప్రతాపం.. తలను బల్లకేసి కొట్టి..
Ipl 2022 Auction: వేలంలో చారుశర్మ ఘోర తప్పిదం.. తక్కువ ధరకే ముంబయి ప్లేయర్‌ను తన్నుకుపోయిన ఢిల్లీ..
Andhra Pradesh: కర్నూలు వరుస ఘటన కలకలం.. ఓ చోట భారీ చోరీ.. మరో చోట మాత్రం..