Andhra Pradesh: కర్నూలు వరుస ఘటన కలకలం.. ఓ చోట భారీ చోరీ.. మరో చోట మాత్రం..
Andhra Pradesh: కర్నూలు జిల్లాలో వరుస ఘటనలు కలకలం సృష్టించాయి. ఓ చోట భారీ చోరీ జరిగితే.. మరో చోట పెద్ద ఎత్తున నగదు పట్టుబడింది.
Andhra Pradesh: కర్నూలు జిల్లాలో వరుస ఘటనలు కలకలం సృష్టించాయి. ఓ చోట భారీ చోరీ జరిగితే.. మరో చోట పెద్ద ఎత్తున నగదు పట్టుబడింది. ఈ రెండు వేర్వేరు ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని ఎమ్మిగనూరు షారఫ్ బజార్‌లోని శ్రీలక్ష్మీ నరసింహ జ్యూవెలరీ షాపులో భారీ చోరీ జరిగింది. అర్థరాత్రి సమయంలో దుండగుడు దుకాణం వెనుక భాగంలో ఉన్న గోడకు రద్రం పెట్టి దుకాణంలో ప్రవేశించాడు. షాపులో ఉన్న రూ. 12 లక్షల నగదు, 45 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండి ఆభరణాలను అపహరించాడు. అయితే షాపులో సీసీ కెమెరా ఉండగా.. దానిని తెలివిగా పక్కకు తిప్పేశాడు. అనంతరం చోరీకి పాల్పడ్డాడు షాప్ యజమాని రఘు ఈ చోరీని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్లూస్ సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదే జిల్లో మరో ఘటన కూడా వెలుగు చూసింది. పంచలింగాల చెక్‌పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న రూ. 30 లక్షల నగదు పట్టుబడింది. పంచలింగాల చెక్‌పోస్ట్ వద్ద స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో సీఐ మంజుల ఆధ్వర్యంలోని బృందం తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సును కూడా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా తరలిస్తున్న రూ. 30 లక్షల నగదును గుర్తించారు పోలీసులు. నగదును తరలిస్తున్న కిషోర్ కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కిషోర్ కర్నాటకలోని గుల్బర్గాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. హైదరాబాద్‌లోని ఓ బంగారు దుకాణంలో గుమస్తాగా పని చేస్తున్నాడు. ఈ నగదుకు సంబంధించి ఎలాంటి రసీదులు లేకపోవడంతో డబ్బును స్వాధీనం చేసుకుని, కిషోర్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Also read:
Hyderabad: వెబ్‌సిరీస్ చూసి ఆరితేరాడు.. మనుషులనూ పెట్టుకున్నాడు.. కట్ చేస్తే సీన్ రివర్స్..!
Guru Ravidass Jayanti: గురు రవిదాస్ జయంతి వేడుకలు.. ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రధాని మోదీ..