Traffic Signals: ట్రాఫిక్ సిగ్నల్ కనిపిస్తే చాలు టెంప్ట్ అయిపోతారు.. అర్థరాత్రి వచ్చి పని పూర్తిచేసి వెళ్తారు..

Traffic Signals: ఆ దంపతులకు ట్రాఫిక్ సిగ్నల్ కనిపిస్తే చాలు పూనకాలు వచ్చేస్తాయి. దాని పని పట్టేంత వరకు నిద్రపోరు.

Traffic Signals: ట్రాఫిక్ సిగ్నల్ కనిపిస్తే చాలు టెంప్ట్ అయిపోతారు.. అర్థరాత్రి వచ్చి పని పూర్తిచేసి వెళ్తారు..
Follow us

|

Updated on: Feb 16, 2022 | 12:15 PM

Traffic Signals: ఆ దంపతులకు ట్రాఫిక్ సిగ్నల్ కనిపిస్తే చాలు పూనకాలు వచ్చేస్తాయి. దాని పని పట్టేంత వరకు నిద్రపోరు. అందుకోసం పక్కా పథకం వేస్తారు.. అర్థరాత్రి వచ్చి పని పూర్తి చేసుకుని వెళ్తారు. అయితే, పోలీసులేమైనా తక్కువా? తమదైన స్టైల్‌లో విచారణ జరిపి.. నిందితులైన ఆ జంటను కటకటాల వెనక్కి పంపారు. వివరాల్లోకెళితే ట్రాఫిక్ సిగ్నల్ బ్యాటరీలను దొంగిలిస్తున్న ఓ జంటను బెంగళూరులోని అశోక్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ట్రాఫిక్ సిగ్నల్ బ్యాటరీలను దొంగిలించే కేసుల ఇటీవలి కాలంలో భారీగా పెరుగుతున్నాయి. దాంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు పోలీసులు. ఒక జంట తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య స్కూటర్‌పై అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గుర్తించారు. అయితే, వీరు తమ వాహనం, వాహనం నెంబర్ గుర్తుపట్టుకుండా ఉండేందుకు ముందుగా లైట్స్‌ ఆఫ్ చేస్తున్నారు.

అయితే, తమ బుర్రకు పదును పెట్టిన పోలీసులు.. ఆనుమానిత స్కూటర్‌ను పోలిన అన్ని వాహనాలను వివరాలను ఆర్టీవో కార్యాలయం నుంచి సేకరించారు పోలీసులు. దాదాపు 4,000 స్కూటర్ల డేటాను సేకరించారు. 300 మంది అనుమానితులను ప్రశ్నించారు. లాభం లేకపోవడంతో ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ప్రత్యేకంగా మాటు వేసి కాపలా కాశారు పోలీసులు. చివరకు ట్రాఫిక్ సిగ్నల్స్ బ్యాటరీలను చోరీ చేస్తున్న సికిందర్, నజ్మా దంపతులను పట్టుకున్నారు పోలీసులు. ఈ జంట జూన్ 2021 నుంచి ట్రాఫిక్ సిగ్నల్స్ బ్యాటరీలను దొంగిలిస్తున్నట్లు తెలిపారు. బెంగళూరులోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో దొంగిలించబడిన ట్రాఫిక్ సిగ్నల్ బ్యాటరీలపై మొత్తం 68 కేసులు నమోదయ్యాయి. కాగా, దొంగిలించిన ఈ బ్యాటరీలను నిందితులు స్క్రాప్ కింద విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని పోలీసులు వెల్లడించారు. కాగా, నిందితుల్లో సికిందర్ టీ అమ్ముతుండగా, అతని భార్య నజ్మా గార్మెంట్ వర్క్. సికిందర్‌పై గతంలోనూ అనేక కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఒకసారి జైలు శిక్ష కూడా అనుభవించినట్లు తెలిపారు పోలీసులు.

Also read:

Hyderabad: వెబ్‌సిరీస్ చూసి ఆరితేరాడు.. మనుషులనూ పెట్టుకున్నాడు.. కట్ చేస్తే సీన్ రివర్స్..!

Guru Ravidass Jayanti: గురు రవిదాస్ జయంతి వేడుకలు.. ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రధాని మోదీ..

Viral Video: ఇదెందయా ఇది.. బాబా రాందేవ్‌నే మించిపోయిందిగా ఈ మొసలి.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..!