Viral Video: ఇదెందయా ఇది.. బాబా రాందేవ్‌నే మించిపోయిందిగా ఈ మొసలి.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..!

Viral Video: ఆరోగ్యంగా ఉండటం కోసం అందరూ వ్యాయామం, యోగా చేస్తుంటారు. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో ప్రపంచ వ్యాప్తంగా

Viral Video: ఇదెందయా ఇది.. బాబా రాందేవ్‌నే మించిపోయిందిగా ఈ మొసలి.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..!
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 16, 2022 | 10:09 AM

Viral Video: ఆరోగ్యంగా ఉండటం కోసం అందరూ వ్యాయామం, యోగా చేస్తుంటారు. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల ప్రజలు యోగా బాట పడుతున్నారు. యోగాతో అనేక ఆరోగ్య ప్రయోజనాలుండటమే అందుకు కారణం. మన దేశంలో చూసుకుంటే యోగాకు సంబంధించి ప్రత్యేక స్థానం ఉంది. మన దేశంలో యోగా గురువులు కూడా చాలా మందే ఉన్నారు. అయితే, యోగాలో అనేక భంగిమలు ఉంటాయి. యోగా తెలిసిన వారు నీటిలోనూ ఆసనాలు వేస్తుంటారు. జలస్తంభాసనంతో పాటు, నీటిలో తేలియాడుతూ కూడా ఆసనాలు వేస్తుంటారు. అయితే, ముఖ్యంగా యోగా ఐకానిక్‌గా రాందేవ్ బాబా గురించి చెప్పుకోవచ్చు. మనుషుల విషయంలో రాందేవ్ బాబా గురించి చెప్పుకుంటున్నాం.. మరి జంతుజాలంలోనూ యోగా గురువులు ఉన్నాయని మీకు తెలుసా? ఈ వీడియో చూస్తే మీలో కూడా అదే భావన కలుగుతుంది. అవును.. ఓ ముసలి యోగా చేస్తోంది. నీటిలోనే ఉండి ప్రాణయామం చేస్తోంది. దానికి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వైరల్ వీడియోలో.. నీటిలో ఉన్న ఓ మొసలి యోగా చేస్తోంది. అవును.. జలస్థంభాసనం మాదిరిగా మొసలి ప్రాణయామం చేస్తోంది. నేటిపై తేలియాడుతున్న మొసలి.. పొట్టనిండా గాలి పీల్చి.. వదులతోంది. పలుమార్లు ఇలా చేసిన మొసలి.. ఆ తరువాత నీటిలోకి జారుకుంది. దీనికి సంబంధించిన వీడియోను వైల్డ్ యూనివర్స్ అనే ఇన్‌స్టాగ్రమ్ ఖాతాలో షేర్ చేయగా అదికాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ మొసలి యోగాలో బాబా రాందేవ్‌నే మించిపోయిందిగా అంటూ కామెంట్స్ చేస్తుంటారు. మొసలికి ఆరోగ్యంపై బాగానే శ్రద్ధ ఉందంటూ మరికొందరు అంటున్నారు. ఈ ఫన్నీ వీడియోను మీరు కూడా చూసేయండి.

Viral Video:

Also read:

Andhra Pradesh: 8 బృందాలు.. 90 రోజుల వేట.. లక్షలాది ఫోన్ కాల్స్ విశ్లేషణ.. ఎట్టకేలకు పట్టుబడ్డ ఆ ఒక్కడు..

Viral Video: పిల్లి – పాము మధ్య భీకర ఫైటింగ్.. భయంతో పరుగులు తీసిన స్థానికులు..

Hyderabad: సర్టిఫికెట్లు బాబు.. సర్టిఫికెట్లు.. డబ్బులుంటే ఏదైనా ఇచ్చేస్తామంటున్న గ్యాంగ్..!