Andhra Pradesh: 8 బృందాలు.. 90 రోజుల వేట.. లక్షలాది ఫోన్ కాల్స్ విశ్లేషణ.. ఎట్టకేలకు పట్టుబడ్డ ఆ ఒక్కడు..

Andhra Pradesh: అనంతపురం జిల్లా కదిరిలో సంచలనం రేపిన ఉపాధ్యాయురాలి హత్య కేసులో నిందితుడు ఎట్టకేలకు పట్టుబడ్డాడు.

Andhra Pradesh: 8 బృందాలు.. 90 రోజుల వేట.. లక్షలాది ఫోన్ కాల్స్ విశ్లేషణ.. ఎట్టకేలకు పట్టుబడ్డ ఆ ఒక్కడు..
Ap Crime
Follow us
Shiva Prajapati

| Edited By: Ram Naramaneni

Updated on: Feb 16, 2022 | 3:22 PM

Andhra Pradesh: అనంతపురం జిల్లా కదిరిలో సంచలనం రేపిన ఉపాధ్యాయురాలి హత్య కేసులో నిందితుడు ఎట్టకేలకు పట్టుబడ్డాడు. నిందితుడిని పట్టుకోవడానికి జిల్లా పోలీస్ యాంత్రాంగం పెట్టిన ఎఫర్ట్ చివరకు సక్సెస్ అయ్యింది. దోచుకోవడానికి వచ్చిన వాడే.. ఉపాధ్యాయురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు నిర్ధారించారు. నిందితుడిని పట్టుకోవడం కోసం ఒక అదనపు ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, ముగ్గురు సీఐ లు, ఐదుగురు ఎస్సై లతో కూడిన 8 ప్రత్యేక పోలీసు బృందాలు, 90 రోజుల పాటు పగలు రేయి అనే తేడా లేకుండా శ్రమించారు. నిందితుడి కోసం 5 రాష్ట్రాలలో గాలించి, 5 వేల మంది అనుమానితులను విచారించారు. లక్షలాది ఫోన్ కాల్స్‌ను విశ్లేషించారు. చివరకు హత్య చేసింది ఒక్కడే అని తేల్చిన పోలీసులు.. ఎట్టకేలకు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకెళితే.. అనంతపురం జిల్లా కదిరిలోని ఎన్జీవో కాలనీలో ఇంట్లో నిద్రిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఉషారాణిని గుర్తు తెలియని దుండగులు అత్యంత కిరాతకంగా హతమార్చారు. హత్య అనంతరం బంగారు నగలు దోచుకున్నాడు. ఘటన సమయంలో అడ్డొచ్చిన మరో మహిళపైనా నిందితుడు క్రూరంగా దాడి చేశాడు. ఘటన యావత్ రాష్ట్రాన్ని షేక్ చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఉపాధ్యాయురాలి పరిశీలించారు. దోపిడీ కోసమే హత్య చేసినట్ల ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ హత్యను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. నిందితుడిని పట్టుకోవడం కోసం తీవ్రంగా శ్రమించారు. అసాధారణ రీతిలో జిల్లా పోలీసు యంత్రాంగం అంతా దీనిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. 90 రోజుల పాటు శ్రమించి.. చివరకు నిందితుడు ఎవరో గుర్తించారు. కర్నాటకలోని దేవెనహళ్లికి చెందిన షఫీవుల్లాగా గుర్తించిన పోలీసులు.. అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also read:

AP Crime News: ఆటో ఎక్కిన బాలికపై డ్రైవర్ కన్ను.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్తుండగా..

NHM East Godavari Jobs: రాత పరీక్షలేకుండానే తూ.గోదావరిలో 117 ప్రభుత్వ ఉద్యోగాలు..3 రోజుల్లో ముగుస్తున్న గడువు!

Viral Photo: క్యూట్‌.. క్యూట్‌ లుక్స్‌తో ఫోటోకు పోజిచ్చిన ఈ చిన్నారి టాలీవుడ్‌లో ట్రెండ్‌సెట్టర్.. ఎవరో గుర్తుపట్టారా!..