AP Crime News: ఆటో ఎక్కిన బాలికపై డ్రైవర్ కన్ను.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్తుండగా..

Guntur District: దేశంలో నిర్భయ లాంటి కఠిన చట్టాలున్నప్పటికీ.. కామాంధులు రెచ్చిపోతున్నారు. రోజురోజుకు బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు

AP Crime News: ఆటో ఎక్కిన బాలికపై డ్రైవర్ కన్ను.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్తుండగా..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 16, 2022 | 9:22 AM

Guntur District: దేశంలో నిర్భయ లాంటి కఠిన చట్టాలున్నప్పటికీ.. కామాంధులు రెచ్చిపోతున్నారు. రోజురోజుకు బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా.. ఓ ఆటో డ్రైవర్.. ఒంటిరిగా ఉన్న బాలికపై కన్నేశాడు. చివరకు ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్తుండగా.. ఆమె (Girl) ఆటోలోనుంచి దూకి తప్పించుకుంది. ఈ దారుణ సంఘటన ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని పి.వి.పాలెం మండలంలో ఇంటర్ చదువుతున్న బాలికపై ఆటోడ్రైవర్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది.

పివీ పాలెం మండలంలోని ఖాజీపాలెం నుంచి అల్లూరు వెళ్ళేందుకు మంగళవారం విద్యార్థిని ఓ ఆటో ఎక్కింది. ఈ క్రమంలో ఆటోలో ఉన్న ప్రయాణీకులంతా దిగిపోవడంతో.. ఆటోలో విద్యార్థిని ఒంటరిగా ఉంది. దీంతో ఆమెపై కన్నేసిన ఆటో డ్రైవర్ విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగకుండా వేరే దారిలో ఆటోని తీసుకెళ్తుండగా ఆ బాధితురాలు కిందికి దూకేసి తప్పించుకుంది. అనంతరం ఆటో డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.

అయితే.. ఆ బాలికకు స్వల్ప గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న కొంతమంది ఆమెను చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. అనంతరం ఆ బాలిక బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆటో డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు పివీ పాలెం పోలీసులు వెల్లడించారు.

Also Read:

Crime News: వారి కన్ను పడితే చాలు రూపురేఖలే మారిపోతాయి.. విషయం తెలిసి పోలీసులే బిత్తరపోయారు!

Hyderabad: సర్టిఫికెట్లు బాబు.. సర్టిఫికెట్లు.. డబ్బులుంటే ఏదైనా ఇచ్చేస్తామంటున్న గ్యాంగ్..!