Crime News: వారి కన్ను పడితే చాలు రూపురేఖలే మారిపోతాయి.. విషయం తెలిసి పోలీసులే బిత్తరపోయారు!

Car theft gang held in Telangana: కార్లను దొంగతనం చేస్తారు.. ఆపై రూపురేఖలను మారుస్తారు. ఆ తర్వాత వేరే రాష్ట్రాల్లో అమ్ముతుంటారు.. ఆ ఘరానా దొంగలు..

Crime News: వారి కన్ను పడితే చాలు రూపురేఖలే మారిపోతాయి.. విషయం తెలిసి పోలీసులే బిత్తరపోయారు!
Car Theft
Follow us

|

Updated on: Feb 16, 2022 | 6:46 AM

Car theft gang held in Telangana: కార్లను దొంగతనం చేస్తారు.. ఆపై రూపురేఖలను మారుస్తారు. ఆ తర్వాత వేరే రాష్ట్రాల్లో అమ్ముతుంటారు.. ఆ ఘరానా దొంగలు.. అలాంటి దొంగల ఆట కట్టించారు తెలంగాణలోని మిర్యాలగూడ పోలీసులు. ఇతర రాష్ట్రాల్లో కార్లు దొంగిలించి పశ్చిమ బెంగాల్‌లో ఇంజిన్, చాసిస్ నెంబర్లు మార్చి తెలంగాణలో అమ్ముతున్న ఘరానా దొంగల ముఠాను (Car theft gang) మిర్యాలగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 6 కోట్ల రూపాయల విలువైన లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు. కారు కొని ఎన్నిరోజులైన ఎన్ఓసీ ఇవ్వకపోవడంతో వీరస్వామి అనే బాధితుడు మిర్యాలగూడ (Miryalaguda) పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. లగ్జరీ కార్లను దొంగిలించి తక్కువ ధరకు అమ్ముతున్నట్లు విచారణ వెల్లడైందని చెప్పారు నల్లగొండ ఎస్పీ రమా రాజేశ్వరి. కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న మిర్యాలగూడ పోలీసులు సీఐ సత్యనారాయణ, డీఎస్పీ వెంకటేశ్వరరావుల ఆధ్వర్యంలో ప్రత్యేక టీం సాయంతో జిప్, ఓబీడీ సాంకేతిక ఆధారంగా లోతైన విచారణ చేశారు.

విచారణలో కలకత్తాకు చెందిన బొప్పా ఘోష్ అనే వ్యక్తి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో దొంగలించిన కార్లకు ఇంజిన్, చాసిస్ నెంబర్లు మార్చి సికింద్రాబాద్‌కు చెందిన ముఠాకు, మంచిర్యాల జిల్లాలకు చెందిన RTA ఏజెంట్‌కు అమ్ముతున్నట్లు గుర్తించారు. రెండు ముఠాల్లోని 10 మందిపై కేసులు నమోదు చేసి.. వారిలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఆరు కోట్ల విలువైన 19 కార్లు, ఒక లారీ స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన వాహనాలపై ఢిల్లీ, మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో FIR నమోదైనట్లు చెప్పారు ఎస్పీ. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన రూరల్ సీఐ సత్యనారాయణ, డిఎస్పీ వెంకటేశ్వరరావులను, ఎస్ఐలను ఎస్పీ రాజేశ్వరి అభినందించారు.

Also Read:

Bank Fraud Case: భారీ కుంభకోణం.. ఏబీజీ షిప్‌యార్డు చైర్మన్‌పై సహా 8 మందికి లుక్‌అవుట్‌ నోటీసులు

Crime News: కిలాడీ ప్రేమ జంట.. స్కెచ్ వేసి హోటల్‌కి వెళ్లారు.. ఆ తర్వాత అసలు కథ స్టార్ట్..