Crime News: కిలాడీ ప్రేమ జంట.. స్కెచ్ వేసి హోటల్‌కి వెళ్లారు.. ఆ తర్వాత అసలు కథ స్టార్ట్..

Lover Arrested: వారిద్దరూ ప్రేమికులు.. వారి ప్రవృత్తి దొంగతనాలు చేయడం.. సహాజీవనం చేస్తున్న ఈ యువ జంట పని.. డబ్బున్న వారిని మోసం చేయడం. అలానే.. పక్కా ప్లాన్ వేసి 5 స్టార్ హోటల్‌‌కి వెళ్లారు.

Crime News: కిలాడీ ప్రేమ జంట.. స్కెచ్ వేసి హోటల్‌కి వెళ్లారు.. ఆ తర్వాత అసలు కథ స్టార్ట్..
Lovers
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 15, 2022 | 9:59 PM

Lover Arrested: వారిద్దరూ ప్రేమికులు.. వారి ప్రవృత్తి దొంగతనాలు చేయడం.. సహాజీవనం చేస్తున్న ఈ యువ జంట పని.. డబ్బున్న వారిని మోసం చేయడం. అలానే.. పక్కా ప్లాన్ వేసి 5 స్టార్ హోటల్‌‌కి వెళ్లారు. మంచిగా అక్కడ భోజనం చేశాక.. అసలు కథ మొదలైంది. ఏందో.. అనుకుంటున్నారా..? ఒక్కసారిగా వాంతులు చేసుకుంటూ.. అందరూ బిత్తరపోయేలా చేశారు. భోజనంలో ఏదో కలిసిందంటూ నాటాకాలాడారు. చివరకూ తాము అడిగినంత ఇస్తే.. వెళ్లిపోతామంటూ బ్లాక్ మేయిల్ (blackmailing) చేశారు. కానీ చివరకు అడ్డంగా బుక్కయ్యారు. ఈ షాకింగ్ సంఘటన కేరళ (Kerala) రాష్ట్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళలోని కొచ్చి నగరంలో నివసించే రెన్జీనా, షాజహాన్ అనే ప్రేమికులు దోపిడీలు, దొంగతనాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

ఇటీవల ఒకరోజు ఇద్దరూ కలిసి కొచ్చి (Kochi) నగరంలోని ఒక 5 స్టార్ హోటల్‌కు భోజనానికి వెళ్లారు. అక్కడ భోజనం తిన్నాక వాంతులు చేసుకుంటూ.. భోజనంలో ఏదో ఉందంటూ గోల చేశారు. వెంటనే అప్రమత్తమైన హోటల్ మేనేజర్ వారిద్దరినీ ఆసుపత్రికి తరలించాడు. ఈ క్రమంలో హోటల్ యజమాని రావాలంటూ పిలిపించారు. తమకు నష్ట పరిహారం ఇస్తే గొడవ చేయమని.. దీనికోసం రూ.5 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. లేకపోతే హోటల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని.. హోటల్ ఇమేజ్‌ను దెబ్బతీస్తామని బెదిరించారు. ఈ క్రమంలో వారి బెదిరింపులకు లొంగమని.. డబ్బులిచ్చేదిలేదంటూ యజమాని తేల్చిచెప్పాడు.

దీంతో రెన్జీనా, షాజహాన్ ఆ హోటల్ యజమానిపై ఆసుపత్రిలోనే దాడి చేసి పరారయ్యారు. దీంతోపాటు అతని వద్ద ఉన్న రూ.11 వేలు దోచుకొని అక్కడినుంచి పరారయ్యారు. అయితే.. ఈ విషయంపై హోటల్ యజమాని ఫిర్యాదు చేయడంతో కొచ్చి పోలీసులు రంగంలోకి దిగారు. 24 గంటల్లో మోసగాళ్ల జంటను అరెస్టు చేశారు. ఫోర్ట్ కొచ్చికి చెందిన ఇద్దరు నిందితులు అంతకుముందు పలువురు వ్యాపారులను హనీట్రాప్ చేసి దోచుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Lakhimpur Kheri Violence: లఖీంపూర్ ఖేరి కేసులో.. జైలు నుంచి విడుదలైన కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా..

Delhi Police: వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడిన కామాంధుడి అరెస్ట్.. 16 గంటల్లో..