Bank Fraud Case: భారీ కుంభకోణం.. ఏబీజీ షిప్‌యార్డు చైర్మన్‌పై సహా 8 మందికి లుక్‌అవుట్ నోటీసులు
ABG shipyard bank fraud case: గుజరాత్‌కు చెందిన ఏబీజీ షిప్‌యార్డు సంస్థ 28 బ్యాంకులను మోసం చేసిన విషయం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ సంస్థ
ABG shipyard bank fraud case: గుజరాత్‌కు చెందిన ఏబీజీ షిప్‌యార్డు సంస్థ 28 బ్యాంకులను మోసం చేసిన విషయం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ సంస్థ 22 వేల 842 కోట్ల మేర బ్యాంకులకు టోకరా పెట్టింది. సీబీఐ ఈ కేసుపై విచారణ జరిపి.. ఏబీజీ షిప్‌యార్డ్ (ABG shipyard) సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రిషి కమలేశ్ అగర్వాల్‌తో పాటు మరో ఎనిమిది మందికి లుక్ అవుట్ (Lookout circular) నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే దీనిపై కేసు నమోదు చేసిన సీబీఐ.. నిందితులు దేశం నుంచి పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు జారీచేసింది. ఈ మేరకు దేశంలోని ఎయిర్ పోర్టులు, సరిహద్దు ప్రాంతాల వద్ద యంత్రాంగాన్ని సీబీఐ అధికారులు అప్రమత్తం చేశారు.
ఇప్పటికే ఎస్‌బీఐతో పాటు ఐసీఐసీఐ, ఐడీబీఐ వంటి బ్యాంకుల వద్ద తీసుకున్న అప్పులు చెల్లించకపోవడంతో ABG షిప్ యార్డ్ కంపెనీ డైరెక్టర్లు రిషి అగర్వాల్, ముత్తుస్వామి, అశ్వినీ కుమార్‌లపై సీబీఐ కేసు నమోదు చేసింది. బ్యాంకుల నుంచి కంపెనీ యాజమాన్యం అప్పులు తీసుకుని డబ్బులను మళ్లించడం, నిధుల దుర్వినియోగం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు సీబీఐ ఎఫ్ఐఆర్ వెల్లడించింది.
గత 16 సంవత్సరాలలో ఎగుమతి మార్కెట్ కోసం 46 సహా 165 కంటే ఎక్కువ నౌకలను నిర్మించింది ఏబీజీ షిప్‌యార్డ్ లిమిటెడ్ సంస్థ. ఈ కంపెనీకి గుజరాత్‌లోని సూరత్, దహేజ్‌లలో యార్డులు ఉండగా.. ABG నిర్మించిన నౌకలు లాయిడ్స్, అమెరికన్ బ్యూరో ఆఫ్ షిప్పింగ్, బ్యూరో వెరిటాస్, IRS, DNV వంటి అన్ని అంతర్జాతీయ వర్గీకరణ సంఘాల నుండి క్లాస్ ఆమోదం పొందాయి.
Also Read: