AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: సర్టిఫికెట్లు బాబు.. సర్టిఫికెట్లు.. డబ్బులుంటే ఏదైనా ఇచ్చేస్తామంటున్న గ్యాంగ్..!

Hyderabad: ఇతర రాష్ట్రాల్లోని పలు విశ్వవిద్యాలయాలకు చెందిన డిగ్రీ సర్టిఫికెట్లను విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు..

Hyderabad: సర్టిఫికెట్లు బాబు.. సర్టిఫికెట్లు.. డబ్బులుంటే ఏదైనా ఇచ్చేస్తామంటున్న గ్యాంగ్..!
Cp Cv Anand
Shiva Prajapati
|

Updated on: Feb 16, 2022 | 8:06 AM

Share

Hyderabad: ఇతర రాష్ట్రాల్లోని పలు విశ్వవిద్యాలయాలకు చెందిన డిగ్రీ సర్టిఫికెట్లను విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బోపాల్ లోని సర్వేపల్లి రాధాకృష్ణ విశ్వవిద్యాలయానికి చెందిన అసిస్టెంట్ ప్రోఫేస‌ర్ తో పాటు ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీలు నిర్వహిస్తున్న శ్రీకాంత్, మహేశ్వర్, సహా ఏడుగురు విద్యార్థులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి పలు విశ్వవిద్యాలయాలకు చెందిన సర్టిఫికెట్లు, స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన శ్రీకాంత్ దిల్ సుఖ్ నగర్ లో శ్రీసాయి ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. డిగ్రీ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల వివరాలు సేకరించి.. వాళ్లకు ఫోన్ చేసి ఇతర విశ్వవిద్యాలయాలకు చెందిన సర్టిఫికెట్లు ఇస్తానని ఆకర్షించాడు. ఆ తర్వాత ఒక్కో డిగ్రీ సర్టిఫికెట్ కు కనీసం లక్ష రూపాయలు వసూలు చేసి బీటెక్, పీజీ, డిగ్రీ సర్టిఫికెట్లు జారీ చేశాడు.

దుబ్బాకలోని రామక్కపేటకు చెందిన మహేశ్వర్ సైతం అత్తాపూర్ లో ప్రైడ్ ఎడ్యుకెషనల్ అకాడమీ నిర్వహిస్తున్నాడు. గత ఐదేళ్లుగా ఇతను కూడా బోపాల్ లోని స్వామి వివేకానంద విశ్వవిద్యాలయం, సర్వేపల్లి రాధాకృష్ణ విశ్వవిద్యాలయాలకు చెందిన సర్టిఫికెట్లను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. సర్వేపల్లి రాధాకృష్ణ విశ్వవిద్యాలయానికి చెందిన అసిస్టెంట్ ప్రోఫెస‌ర్ కేతన్ సింగ్ సహకారంతో శ్రీకాంత్, మహేశ్వర్ సర్టిఫికేట్లను విద్యార్థులకు విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ తరహా సర్టిఫికెట్ల వల్ల ఏడాదిపాటు చదివి పాసైన ప్రతిభ గల విద్యార్థులకు నష్టం జరుగుతోందని.. వీటిని నివారించడానికి డీఐజీ నేతృత్వంలో ప్రత్యేక ద‌ర్యాప్తు బృందం (సీట్) ఏర్పాటు చేస్తామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.

Also read:

Bappi Lahiri: బ్రేకింగ్.. సింగర్ బప్పి లాహిరి కన్నుమూత .. !!

CM KCR Birthday: పండుగలా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు.. అట్టహాసంగా ఏర్పాట్లు..

CTET December Result 2021: సీటెట్ డిసెండర్ 2021 ఫలితాలు నేడు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..