AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: వేడెక్కుతున్న దేశ రాజకీయాలు.. బీజేపీని ఢీకొట్టేందుకు ముంబైకి సీఎం కేసీఆర్..

అలాయి బలాయి అటెక్కింది. కేంద్ర ప్రభుత్వం వర్సెస్‌ తెలంగాణ సర్కార్‌ మధ్య హై వోల్టేజీ లడాయి రఫ్పాడుతోంది. ఇన్నాళ్లు ఓ లెక్క..ఇప్పుడు ఔర్‌ ఏక్‌ దక్కా.. టాప్‌గేర్‌లో డైరెక్ట్‌గా ఢిల్లీతోనే కారు ఢీ కొట్టేందుకు రెడీ అవుతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.

CM KCR: వేడెక్కుతున్న దేశ రాజకీయాలు.. బీజేపీని ఢీకొట్టేందుకు ముంబైకి సీఎం కేసీఆర్..
Uddhav Thackeray With Cm Kc
Sanjay Kasula
|

Updated on: Feb 16, 2022 | 12:43 PM

Share

అలాయి బలాయి అటెక్కింది. కేంద్ర ప్రభుత్వం వర్సెస్‌ తెలంగాణ సర్కార్‌ మధ్య హై వోల్టేజీ లడాయి రఫ్పాడుతోంది. పవర్‌ పాలిటిక్స్‌ కాక రేపుతున్నాయి.. సవాల్‌ పే సవాల్‌.. తగ్గేదే లే అనేరేంజ్‌లో బీప్‌లెస్‌ డైలాగ్‌ వార్. ఢిల్లీ కోటలు బద్దలు కొడతామన్న సీఎం కేసీఆర్(CM KCR).. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇన్నాళ్లు ఓ లెక్క..ఇప్పుడు ఔర్‌ ఏక్‌ దక్కా.. టాప్‌గేర్‌లో డైరెక్ట్‌గా ఢిల్లీతోనే కారు ఢీ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. సర్జికల్‌ స్ర్టయిక్స్‌ను టచ్‌ చేస్తూ సెంట్రల్‌ టార్గెట్‌గా స్టేట్స్‌ స్ట్రయిక్‌తో దెబ్బ కొట్టేందుకు మంచి అవకాశం వచ్చింది. ఇందు కోసం ఈనెల 20న ముంబై వెళ్లనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేతో(Maharashtra Chief Minister Uddhav Thackeray).. సీఎం కేసీఆర్ భేటీ అవుతారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌‌తొ కూడా ఫోన్‌లో చర్చలు జరిపారు.

మహారాష్ట్రలోని తమ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ పావులు కదుపుతోందంటూ శివసేన ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌-థాక్రే భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా సీఎం కేసీఆర్ కేంద్రంపై గురి పెడుతున్నారు. తగ్గేదేలే..! అంటూ పావులు కదుపుతున్నారు సీఎం కేసీఆర్. సెంటర్‌ను సెంటర్‌లో ఢీ కొట్టేందుకు దేశ రాజధాని ముంబై నుంచి మొదలు పెడుతున్నారు.

మరో వైపు మార్చి 10 తర్వాత ఏ క్షణమైనా బీజేపీయేతర ప్రాంతాల సీఎంల భేటీ ఉంటుందని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ధృవీకరించారు. మమతా బెనర్జీ, స్టాలిన్, కేసీఆర్‌ల సారథ్యంలో ఈ చర్చలు జరుగుతాయని అంటున్నారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ను కలుస్తానని ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీతో భేటీపై తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా ప్రకటించారు. పదో తేదీలోపు కలిసొచ్చే మిగతా రాష్ట్రాల సీఎంలు, ప్రాంతీయ పార్టీల అధ్యక్షులతో ఈ ముగ్గురు పరస్పర మంతనాలు జరిపే ఛాన్స్ ఉంది. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తున్న తీరుపై అన్ని పార్టీల అధినేతలు, బీజేపీయేతర ముఖ్యమంత్రులు చర్చలు జరిపే అవకాశం ఉంది. రాష్ట్రాల పట్ల కేంద్రం చూపుతున్న వివక్ష టార్గెట్‌గా ఈ సమావేశంలో మంత్రాంగంగా మారనుంది. ఫోన్లు, లేఖల ద్వారా ఇప్పటికే ప్రాథమిక స్థాయి చర్చలు మొదలైనట్లుగా తెలుస్తోంది.

ఇదిలావుంటే.. టీఆర్‌ఎస్- బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సవాళ్లు-ప్రతి సవాళ్లు, ఆరోపణలు-ప్రత్యారోపణలు కాస్త వ్యక్తిగత దూషణలకు దారి తీస్తోంది. కేంద్రం అండ్ ప్రధాని మోదీ టార్గెట్‌గా సీఎం కేసీఆర్‌ పదునైన మాటలను వదులుతున్నారు.

కొత్త కూటమినే లక్ష్యం.. కొట్లాటే మార్గమా..? కొట్లాటే లక్ష్యం.. కొత్త కూటమి మార్గమా..? ఎవరి లెక్కేంటో కానీ గులాబీ బాసూ.. రోజురోజుకు డైలాగ్‌ వార్‌లో డోసు పెంచుతున్నారు. తేల్చుకునుడే.. అనే రేంజ్‌లో అటూ ఇటూ పంచ్‌లు పేల్చుతున్నారు. బడ్జెట్‌ కేంద్రంగా సవాళ్ల రచ్చ పే చర్చ తెరపైకి వచ్చింది. బ్యాక్‌ ఎండ్‌లో ఎవరి బలం ఎంత..? సెంట్రల్‌ వర్సెస్‌ స్టేట్స్‌.. మధ్య పంచాయతీతో జాతీయ స్థాయిలో కుదపులు ఖాయమా? మరికొద్ది రోజుల్లో తేలనుంది.

ఇవి కూడా చదవండి: Ukraine Russia Crisis: ర్యష్యా వెనక్కి తగ్గలేదు.. పుతిన్‌ యుద్ధతంత్రంపై అమెరికా కీలక ప్రకటన..

Rudraksha Tree: మన తెలుగు నేలపై కాస్తున్న రుద్రాక్షలు.. ఎక్కడో తెలుసా?