EPFO: ఆ పీఎఫ్ ఖాతాలకు వడ్డీ వస్తుందా.. లేకుంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి..

EPFO: గడచిన మూడు నెలలుగా నిర్వహణలో లేని/ ఇన్ ఆపరేషన్(Inoperative) EPFO ఖాతాల విషయంలో ఏం జరగనుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ప్రావిడెంట్ ఫండ్ సొమ్ముకు వడ్డీ చెల్లింపులపై..

EPFO: ఆ పీఎఫ్ ఖాతాలకు వడ్డీ వస్తుందా.. లేకుంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి..
Epfo
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Feb 16, 2022 | 12:42 PM

EPFO: గడచిన మూడు నెలలుగా నిర్వహణలో లేని/ ఇన్ ఆపరేషన్(Inoperative) EPFO ఖాతాల విషయంలో ఏం జరగనుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ప్రావిడెంట్ ఫండ్ సొమ్ముకు వడ్డీ చెల్లింపులపై వచ్చే నెల బోర్డు నిర్ణయం తీసుకోనుంది. 2020 మార్చిలో ఈపీఎఫ్ఓ వడ్డీ చెల్లింపు రేటును ఏడేళ్ల కనిష్ఠానికి(8.5 శాతం) తీసుకెళ్లింది. అంతకుముందు 2018-19 సంవత్సరంలో అది 8.65 శాతంగా ఉంది. ఈపీఎఫ్ఓ నిర్ణయించిని వడ్డీ రేటును కేంద్ర ఆర్థిక మంత్రి అంగీకారం పొందాక వడ్డీ చెల్లింపు జరుగుతుంది.

పీఎఫ్ అకౌంట్ నిర్వహణలో లేకపోతే వడ్డీ రాదా? ఆ ఖాతాలకు ఏం జరుగుతుంది..

EPFO నిబంధనల ప్రకారం రిటైర్మెంట్ తర్వాత లేదా విదేశాలకు శాశ్వతంగా వలస వెళ్లిన లేదా మరణం సంభవించిన తర్వాత 3 సంవత్సరాల పాటు నిర్వహణలో లేని పీఎఫ్ ఖాతాను ఇన్ ఆపరేటివ్ ఖాతాగా వర్గీకరిస్తారు. ప్రస్తుతం, అన్ని ఖాతాలకు సభ్యుని వయస్సు 58 సంవత్సరాలు వచ్చేంత వరకు వడ్డీ లభిస్తుంది.

పీఎఫ్ ఖాతాను ఇన్ ఆపరేటివ్ ఖాతాగా వర్గీకరిస్తే ఏం చేయాలి?

మీరు ఇప్పటికీ EPF & MP చట్టం, 1952 వర్తిస్తున్న సంస్థలో పని చేస్తుంటే.. మీరు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ పద్ధతి ద్వారా మీ కొత్త ఖాతాలోకి ఇన్ ఆపరేటివ్ గా ఉన్న ఖాతాలోని సొమ్మును బదిలీ చేసుకోవాలి. మీరు పదవీ విరమణ చేసినట్లయితే.. మీరు పీఎఫ్ ఖాతాలోని మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఇవీ చదవండి..

Safe Investment: పతనమవుతున్న షేర్ మార్కెట్లతో ఆందోళన చెందుతున్నారా.. అయితే నష్టాలను తప్పిచుకోవడానికి ఈ 5 సూత్రాలు పాటించండి..

Flight Tickets: ఆ దేశానికి వెళ్లే ప్రయాణికులకు శుభవార్త.. విమాన టికెట్లపై భారీ తగ్గింపు..