AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Safe Investment: పతనమవుతున్న షేర్ మార్కెట్లతో ఆందోళన చెందుతున్నారా.. అయితే నష్టాలను తప్పిచుకోవడానికి ఈ 5 సూత్రాలు పాటించండి..

Safe Investment: వరుసగా 18 నెలల పాటు భారత స్టాక్ మార్కెట్లు బుల్ జోరును కొనసాగించాయి. కానీ.. గత అక్టోబర్ నుంచి మార్కెట్లు ఎక్కువ ఓలటైల్ గా మారాయి. దీని వల్ల మార్కెట్లలో అనిశ్చితి పెరగడం.. రిటైల్ మదుపరులను ఎక్కువగా ఆందోళనకు గురి చేస్తున్నాయి.

Safe Investment: పతనమవుతున్న షేర్ మార్కెట్లతో ఆందోళన చెందుతున్నారా.. అయితే నష్టాలను తప్పిచుకోవడానికి ఈ 5 సూత్రాలు పాటించండి..
Safe Investment
Ayyappa Mamidi
|

Updated on: Feb 16, 2022 | 12:07 PM

Share

Safe Investment: వరుసగా 18 నెలల పాటు భారత స్టాక్ మార్కెట్లు బుల్ జోరును(Bull Market) కొనసాగించాయి. కానీ.. గత అక్టోబర్ నుంచి మార్కెట్లు ఎక్కువ ఓలటైల్ గా(Market Volatility) మారాయి. దీని వల్ల మార్కెట్లలో అనిశ్చితి పెరగడం.. రిటైల్ మదుపరులను(Retail Investors) ఎక్కువగా ఆందోళనకు గురి చేస్తున్నాయి. దీనికి తోడు కొన్ని వారాలు మార్కెట్లలో కరెక్షన్ భారీగా కొనసాగుతోంది. ఈ వారం ప్రారంభంలో సోమవారం ఒక్కరోజే సెన్సెక్స్ సూచీ 1700 పాయింట్ల మేర పతనమై 3 శాతం కిందకు పడింది. సాధారణ పెట్టుబడిదారులుగా మీరు సైతం ఇటువంటి పరిస్థితుల నుంచి తమ పెట్టుబడులను కాపాడుకోవడం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అందుకే స్టాక్ మార్కెట్ భారీ పతనాల నుంచి మీ పెట్టుబడులను రక్షించుకునేందుకు ఈ సూత్రాలను తప్పక పాటించండి.

1. ఎస్ఐపీ పెట్టుబడులను ఆపకండి..

ఈక్విటీ మార్కెట్లు ఓలటైల్ గా మారాయని సిప్ పెట్టుబడులు నిలిపివేయవద్దు. ఐడిఎఫ్ సి మ్యూచువల్ ఫండ్ చేపట్టిన స్టడీలో తెలిసిందేంటంటే కరోనా సమయంలో మార్కెట్లు పడిపోయాయని చాలా మంది తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. కానీ ఆ సమయంలో కూడా పెట్టుబడులను కొనసాగించిన వారు చాలా మంచి లాభాలను ఆర్జించినట్లు తేలింది. ప్రస్తుతం మార్కెట్ ఉద్రిక్తతలను సైతం రిటైల్ ఇన్వెస్టర్లు వినియోగించుకోవాలని ఎంకే వెల్త్ సూచిస్తోంది. మరికొంత కాలం పాటు మార్కెట్లు ఇలా పతనం అవుతాయని గుర్తుంచుకుని మదుపరులు ముందుకు వెళ్లాలని వారు సూచిస్తున్నారు.

2. ఇన్వెస్ట్ చేయండి, స్పెకులేషన్ కాదు..

చాలా మంది తమ సొంత నిర్ణయాల మేరకు షేర్ల పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటుంటారు. చాలా మంది డెరివేటివ్స్(స్టాక్ ఆప్షన్స్)లో ట్రేడ్ చేస్తుంటారు. ఒక వేళ ట్రేడింగ్ లో తేడా వస్తే భారీగా నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సోమవారం మార్కెట్లు భారీగా పతనమయ్యాయి.. అలాంటి సమయంలో నష్ట నివారణకు చేసే ప్రయత్నాలు చాలా తక్కువగా ఉంటాయి. మదుపరుల పూర్తి పెట్టుబడి ఆవిరయ్యే ప్రమాదం ఉంది. కొనాలనుకుంటున్న షేర్ల గురించి వాటికి ఉండే రిస్క్ గురించి పూర్తిగా అర్థం చేసుకున్న తరువాత పెట్టుబడులు పెట్టడం ఉత్తమం. త్వరగా డబ్బు సంపాదించాలని ఆత్రుతతో.. మార్కెట్ లో కొంత మంది ఇచ్చే సూచనల మేరకు కొనుగోళ్లు చేయడం చాలా ప్రమాదకరం. షేర్లలో నేరుగా పెట్టుబడులు పెట్టడం.. ఎక్కువ హైప్ తో వచ్చే ఐపీఓ లలో పెట్టుబడులు పెట్టకపోవటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

3. థిమాటిక్ పెట్టుబడులను పరిశీలించండి..

గత కొన్ని సంవత్సరాలుగా అనేక థిమాటిక్ ఫండ్లు మార్కెట్ లోకి వచ్చాయి. అనేక మంది వాటిలో పెట్టుబడి కూడా పెట్టారు. వాటిలో ఎక్కువ శాతం ఫండ్లు అధిక రిస్క్ కలిగి ఉన్నవే. మీ పూర్తి పెట్టుబడుల్లో 10 శాతానికి మించి వీటిలో పెట్టుబడి పెట్టకండి. ఇటువంటి ఫండ్లలో పెట్టుబడి పెట్టకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

4. పెట్టుబడిని ఎక్కువ డైవర్సిఫై చేయడం మంచిది..

పెట్టుబడి పెట్టేవారు ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, మల్టీ క్యాప్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలని ఆర్థిక నిపుణుల మాట. దీనికి తోడు చాలా తక్కువ మెుత్తాన్ని ఈటీఎఫ్ లలో పెట్టాలని వారు అంటున్నారు. యాక్టివ్ గా మేనేజ్ చేసే ఫండ్లను ఎంచుకోవాలని వారు సూచిస్తున్నారు. తక్కువ రిస్క్ తీసుకుని పెట్టుబడి పెట్టేవారు బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ లాంటి వాటిని ఎంచుకోవాని సూచిస్తున్నారు. దీని వల్ల ఓలటాలిటీ ఎక్కువగా ఉన్నప్పటికీ పెట్టుబడి విలువ భారీగా తగ్గదని వారు అంటున్నారు.

5. బంగారాన్ని మరచిపోకండి..

పెట్టుబడికి బంగారం అనేది చాలా సురక్షితమైన ఆప్షన్. బంగారం ధర దిగువకు వచ్చిన ప్రతిసారీ కొంత కొనుగోలు చేయటం మంచిదని నిపుణులు అంటున్నారు. గత కొంత కాలంగా బంగారం ఎక్కువ లాభాలను ఇవ్వలేదు. పెరుగుదల లేకపోవడంతో చాలా మంది గోల్ట్ ఈటీఎఫ్ లను అమ్మేస్తున్నారు. కానీ ఇది సరైనది కాదని .. ద్రవ్యోల్బణం, మార్కెట్ ఓలటాలిటీ, ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతలు లాంటివి వచ్చినప్పడు ఈ పెట్టుబడి నిర్ణయం ఎక్కువగా ఉపకరిస్తుందని అంటున్నారు. గతంలో ఏ పెట్టుబడులు ఎలా లాభాలను ఇచ్చాయి అనే దానిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవద్దని మదుపరులకు నిపుణులు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి.. 

Flight Tickets: ఆ దేశానికి వెళ్లే ప్రయాణికులకు శుభవార్త.. విమాన టికెట్లపై భారీ తగ్గింపు..

MGNREGS: కరోనా తరువాత జాతీయ ఉపాధి హామీ పథకానికి పెరుగుతున్న డిమాండ్.. కానీ..