AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon Offer: అమెజాన్‌ అదిరిపోయే ఆఫర్‌.. సభ్యత్వంపై 50 శాతం క్యాష్‌బ్యాక్‌.. వారికి మాత్రమే..!

Amazon Offer: ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ కస్టమర్ల కోసం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ప్రైమ్‌ మెంబర్‌షిప్‌పై ఏకంగా 50 శాతం వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఆఫర్‌..

Amazon Offer: అమెజాన్‌ అదిరిపోయే ఆఫర్‌.. సభ్యత్వంపై 50 శాతం క్యాష్‌బ్యాక్‌.. వారికి మాత్రమే..!
Subhash Goud
|

Updated on: Feb 16, 2022 | 11:14 AM

Share

Amazon Offer: ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ కస్టమర్ల కోసం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ప్రైమ్‌ మెంబర్‌షిప్‌పై ఏకంగా 50 శాతం వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఆఫర్‌ 18 నుంచి 24 ఏళ్ల లోపు ఉన్న యువకులకు మాత్రమే వర్తించనుంది. అంతేకాకుండా అమెజాన్‌కు పాత కస్టమర్లు అయి ఉండాలి. అమెజాన్‌ యువతే లక్ష్యంగా ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. గత సంవత్సరం ప్రైమ్‌ సేవల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. యువతను లక్ష్యంగా చేసుకుని ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ రెఫరల్స్‌ ప్రోగ్రామ్‌ను అమెజాన్‌ ప్రారంభించింది. ఇందులో చేరిన యువకులకు సభ్యత్వంపై 50 శాతం తగ్గింపు అందజేస్తోంది.

యూత్‌ ఆఫర్‌లో భాగంగా అమెజాన్ ప్రైమ్‌ మెంబర్‌ షిప్‌ నెలవారీ సభ్యత్వం రూ.179పై రూ.90 క్యాష్‌బ్యాక్‌తో పాటు మరో రూ.18 వరకు క్యాష్‌బ్యాక్‌ రిఫరల్‌ రివార్డుగా అందజేస్తోంది. ఇక త్రైమాసిక సభ్యత్వం రూ.479పై రూ.230 క్యాష్‌బ్యాక్‌ తోపాటు మరో 46 క్యాష్‌బ్యాక్‌ రిఫరల్‌ రివార్డ్‌ను అందుకోవచ్చు. వార్షిక సభ్యత్వం రూ.1,499పై రూ.750 క్యాష్‌బ్యాక్‌తో పాటు మరో రూ.150 క్యాష్‌బ్యాక్‌ పొందే అవకాశం ఉంటుంది. అమెజాన్‌ అందిస్తున్న యూత్‌ ఆఫర్‌ను సదరు వ్యక్తి ఆయా యూజర్‌కు రెఫరల్‌ చేయడంతో 50 శాతం వరకు తగ్గింపు సదుపాయం పొందవచ్చు. అయితే ఇందులో చేరే యూజర్‌ సెల్ఫీ, వయసు ధృవీకరణ పత్రాలను సబ్మిట్‌ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు క్యాష్‌బ్యాక్‌ అమెజాన్‌పేలో క్రెడిట్‌ అవుతుంది.

ఇవి కూడా చదవండి:

Flipkart Sell Back: ఫ్లిప్‌కార్ట్‌ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. సెల్‌బ్యాక్‌ సదుపాయం వచ్చేసింది.. మీ పాత ఫోన్‌ విక్రయించవచ్చు.. ఎలాగంటే!

PM KISAN: పీఎం కిసాన్‌ స్కీమ్‌ డబ్బులు భార్యాభర్తలు తీసుకుంటున్నారా..? అయితే ఇబ్బందుల్లో పడినట్లే..!