Flipkart Sell Back: ఫ్లిప్‌కార్ట్‌ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. సెల్‌బ్యాక్‌ సదుపాయం వచ్చేసింది.. మీ పాత ఫోన్‌ విక్రయించవచ్చు.. ఎలాగంటే!

Flipkart Sell Back: ఆన్‌లైన్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్టు రకరకాల ఆఫర్లను ప్రవేశపెడుతుంటుంది. ఇప్పుడు ఫ్లిప్‌కార్టు కొత్త Sell Back ప్రోగ్రాంను ప్రకటించింది. దీని ద్వారా వినియోగదారులు వారు..

Flipkart Sell Back: ఫ్లిప్‌కార్ట్‌ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. సెల్‌బ్యాక్‌ సదుపాయం వచ్చేసింది.. మీ పాత ఫోన్‌ విక్రయించవచ్చు.. ఎలాగంటే!
Follow us
Subhash Goud

|

Updated on: Feb 16, 2022 | 10:46 AM

Flipkart Sell Back: ఆన్‌లైన్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్టు రకరకాల ఆఫర్లను ప్రవేశపెడుతుంటుంది. ఇప్పుడు ఫ్లిప్‌కార్టు కొత్త Sell Back ప్రోగ్రాంను ప్రకటించింది. దీని ద్వారా వినియోగదారులు వారు ఉపయోగించిన పాత స్మార్ట్‌ఫోన్‌లను ప్లాట్‌ఫారమ్‌లో విక్రయించేందుకు అవకాశం ఉంటుంది. కొత్త ప్రోగ్రామ్ మొదట్లో స్మార్ట్‌ఫోన్‌లతో ప్రారంభమవుతుంది. ఫ్లిప్‌కార్ట్‌లో అందించే ఇతర రకాల ఉత్పత్తులను కలిగి ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ రీ-కామర్స్ సంస్థ యంత్రాన్ని ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేసిన తర్వాత సెల్ బ్యాక్ ప్రకటన వెలువడింది. Flipkart ద్వారా కొత్త సెల్ బ్యాక్ ప్రోగ్రామ్ ప్రధానంగా ఇండియాలోని ప్రధాన నగరాల్లో 1,700 వరకు పిన్ కోడ్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చింది.

అయితే ఈ సెల్‌ ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభించింది. సెల్‌ బ్యాక్‌లో భాగంగా కస్టమర్లు ఏ మొబైల్‌ అయినా అమ్మవచ్చు. వేరే చోటు కొనుగోలు చేసిన ఫోన్‌ను కూడా ఫ్లిప్‌కార్టులో అమ్మవచ్చు. ప్రస్తుతం మొబైల్‌లకే మాత్రమే ఈ సదుపాయం ఉంది. త్వరలో ఇతర కేటగిరిలను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని ఫ్లిప్‌ కార్ట్‌ చెబుతోంది. ఈ విధానం ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్‌, పాట్నా నగరాలతో దేశ వ్యాప్తంగాపాటు 1700 పిన్‌కోడ్స్‌లను ప్రస్తుతం ఈ సెల్‌ బ్యాక్‌ సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చింది సంస్థ.

ఫోన్‌లో ఎలా విక్రయించాలి..?

► ముందుగా మీ ఫోన్‌లలో ఫ్లిప్‌కార్ట్‌ యాప్‌ ఓపెన్‌ చేయాలి.

► యాప్‌ కింది భాగంలో ఉన్న బాటమ్‌బార్‌లో మెనూపై క్లిక్‌ చేయాలి.

► తర్వాత సెల్‌బ్యాక్‌ (Sell Back) ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

► అక్కడున్న మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పి కన్ఫార్మ్‌ చేయాలి.

► 48 గంటలలోపు ఫ్లిప్‌కార్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ మీ ఇంటివద్దకు వచ్చి ఫోన్‌ను తీసుకుంటారు.

► వెరిఫికేషన్‌ పూర్తయిన తర్వాత కొన్ని గంటల్లోనే ఫోన్‌ వాల్యూ ఎంత ఉందో ఆ మొత్తంలో కూడిన ఓచర్‌ కస్టమర్లకు జారీ అవుతుంది.

► ఫోన్‌ను విక్రయించే ముందు దీని ధర ఎంత ఉంటుందనేది ముందుగానే అంచనా వేసుకోవడం ముఖ్యం.

Sell Back

ఇవి కూడా చదవండి:

Edible Oil Prices: కేంద్రం గుడ్‌న్యూస్‌.. సుంకంలో కోత.. మరింత దిగిరానున్న వంట నూనె ధరలు..!

Google: జాక్‌పాట్‌ కొట్టేశాడు.. గూగుల్‌ నుంచి రూ.65 కోట్ల రివార్డు.. ఎందుకో తెలుసా..?

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.