Edible Oil Prices: కేంద్రం గుడ్‌న్యూస్‌.. సుంకంలో కోత.. మరింత దిగిరానున్న వంట నూనె ధరలు..!

Edible Oil Prices: సామాన్య ప్రజలకు మరింత ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. గత కొన్ని రోజులుగా వంట నూనె ధరలు తగ్గుముఖం పడుతున్నాయి...

Edible Oil Prices: కేంద్రం గుడ్‌న్యూస్‌.. సుంకంలో కోత.. మరింత దిగిరానున్న వంట నూనె ధరలు..!
Follow us

|

Updated on: Feb 14, 2022 | 2:38 PM

Edible Oil Prices: సామాన్య ప్రజలకు మరింత ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. గత కొన్ని రోజులుగా వంట నూనె ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో ఆయిల్‌ ధరలు తీవ్రంగా పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తర్వాత కేంద్రం వంట నూనె దిగుమతి సుంకాలను తగ్గించడంతో ధరలు దిగి వచ్చాయి. ఇక క్రూడ్‌ పామాయిల్‌ ధరలపై దిగుమతి సుంకాలను తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నిర్ణయం దేశ వ్యాప్తంగా వంటనూనె ధరలు నియంత్రించడంతో పాటు దేశీయ ప్రాసెసింగ్‌ కంపెనీలకు మద్దతును అందిస్తోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

కేంద్రం ముడి పామాయిల్‌ దిగుమతిపై సుంకాన్ని 8.25 శాతం నుంచి 5.5 శాతానికి తగ్గించింది. ఇక ముడి పామాయిల్‌పై ప్రాథమిక కస్టమ్స్‌ సుంకం జీరో. ప్రస్తుతం సెంట్రల్‌ బోర్డు ఆప్‌ పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ నోటిఫికేషన్‌ ద్వారా అగ్రి ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్‌ సెస్‌ను ఫిబ్రవరి 13 నుంచి7.5 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. క్రూడ్‌ పామాయిల్‌, ఇతర క్రూడ్‌ నూనెలపై తగ్గించిన సుంకాన్ని సెప్టెంబర్‌ 30 వరకు ఆరు నెలల పాటు పొడిగించినట్లు కేంద్రం వెల్లడించింది. ఇక ప్రస్తుతం శుద్ధి చేసిన పామాయిల్‌పై ఎఫెక్టివ్‌ ఇంపోర్ట్‌ డ్యూటీ 13.75 శాతంగా ఉంది.

గత సంవత్సరం ఎడిబుల్‌ ఆయిల్ ధరలు అధికంగా ఉండటంతో దేశీయ లభ్యతను పెంచేందుకు కేంద్ర సర్కార్‌ పలు మార్లు పామాయిల్‌ దిగుమతులపై సుంకాన్ని తగ్గింపు చేసింది. ఈ సందర్భంగా సాల్వెంఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ (SEA) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బిబి మోహతా మాట్లాడుతూ.. క్రూడ్‌ పామాయిల్‌పై అగ్రి సెస్‌ను 7.5 శాతం నుంచి 5 శాతానికి తగ్గించిందని, అలాగే క్రూడ్‌ పామాయిల్‌, పొద్దుతిరుగుడు, సోయాబీన్‌ ఆయిల్‌పై డ్యూటీ 5.5 శాతం సెప్టెంబర్‌ 30 వరకు ఉండనుందని తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూనే దేశీయ రిఫైనర్లు ఆర్థికంగా ఆయా రిఫైనర్లను నిర్వహించడానికి ఆయా ఆయిల్‌ల మధ్య కనీసం 11 శాతం డ్యూటీ వ్యత్యాసాన్ని ఉంచాలని ఎస్‌ఈఏ అభ్యర్థించినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

Inspector Raj: పారిశ్రామిక వర్గాల పాలిట శాపంగా మారిన ఇన్పెక్టర్ రాజ్.. మరి దీనికి పరిష్కారం ఏంటి?

PM Kisan: రైతులకు గమనిక.. ‘పీఎం కిసాన్‌’ కింద కుటుంబంలో ఎంతమంది లబ్ధి పొందవచ్చు..?

ప్రమాదంలో టీమిండియా ప్లేయర్ టెస్ట్ కెరీర్..
ప్రమాదంలో టీమిండియా ప్లేయర్ టెస్ట్ కెరీర్..
ఒకే జట్టులో కోహ్లీ, బాబర్.. 17 ఏళ్ల తర్వాత ఆఫ్రో ఆసియా కప్?
ఒకే జట్టులో కోహ్లీ, బాబర్.. 17 ఏళ్ల తర్వాత ఆఫ్రో ఆసియా కప్?
హంతకుడిని పట్టించిన ఈగలు.. ఈ మర్డర్ మిస్టరీలో ఊహించని ట్విస్ట్..
హంతకుడిని పట్టించిన ఈగలు.. ఈ మర్డర్ మిస్టరీలో ఊహించని ట్విస్ట్..
ఈ ట్రైన్‌లో ప్రయాణించాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. టికెట్ ఎంతో
ఈ ట్రైన్‌లో ప్రయాణించాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. టికెట్ ఎంతో
టాలీవుడ్ పై కన్నేసిన కన్నడ బ్యూటీ.. ఎన్టీఆర్ జోడిగా ఛాన్స్.. !
టాలీవుడ్ పై కన్నేసిన కన్నడ బ్యూటీ.. ఎన్టీఆర్ జోడిగా ఛాన్స్.. !
కార్తీక మాసంలో బెస్ట్ రెసిపీ పులగం.. ఇలా చేశారంటే సూపర్..
కార్తీక మాసంలో బెస్ట్ రెసిపీ పులగం.. ఇలా చేశారంటే సూపర్..
ఓర్నాయనో.. మందు తాగే అలవాటుందా..? మీ కిడ్నీలు గుల్లయినట్లే..
ఓర్నాయనో.. మందు తాగే అలవాటుందా..? మీ కిడ్నీలు గుల్లయినట్లే..
సౌదీ ఎడారిలో హిమపాతం.. చరిత్రలో తొలిసారి..వాతావరణ శాఖ హెచ్చరికలు!
సౌదీ ఎడారిలో హిమపాతం.. చరిత్రలో తొలిసారి..వాతావరణ శాఖ హెచ్చరికలు!
ముంబై టీంను వీడాడు.. కట్‌చేస్తే.. 9 మ్యాచ్‌ల్లో 8 సెంచరీలు
ముంబై టీంను వీడాడు.. కట్‌చేస్తే.. 9 మ్యాచ్‌ల్లో 8 సెంచరీలు
మనిషివేనా నువ్వసలు.. కస్టమర్ పై డెలివరీ బాయ్ చిందులు.. కారణం ఇదే
మనిషివేనా నువ్వసలు.. కస్టమర్ పై డెలివరీ బాయ్ చిందులు.. కారణం ఇదే