PM Kisan: రైతులకు గమనిక.. ‘పీఎం కిసాన్‌’ కింద కుటుంబంలో ఎంతమంది లబ్ధి పొందవచ్చు..?

PM Kisan: రైతులకు గమనిక.. 'పీఎం కిసాన్‌' కింద కుటుంబంలో ఎంతమంది లబ్ధి పొందవచ్చు..?
Pm Kisan

PM Kisan: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ PM కిసాన్ సమ్మాన్ నిధి10వ విడతను జనవరి 1, 2022న విడుదల చేసారు. పీఎం కిసాన్ పథకం కింద భూమి కలిగి ఉన్న రైతుల కుటుంబాలందరికీ

uppula Raju

|

Feb 14, 2022 | 1:44 PM

PM Kisan: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ PM కిసాన్ సమ్మాన్ నిధి10వ విడతను జనవరి 1, 2022న విడుదల చేసారు. పీఎం కిసాన్ పథకం కింద భూమి కలిగి ఉన్న రైతుల కుటుంబాలందరికీ సంవత్సరానికి రూ. 6000 ఆర్థిక ప్రయోజనం అందిస్తున్నారు. ప్రతి నాలుగు నెలలకు రూ.2000 చొప్పున మూడు వాయిదాలు చెల్లిస్తారు. ఇప్పుడు10వ విడతగా రూ. 20,000 కోట్ల కంటే ఎక్కువ మొత్తాన్ని బదిలీ చేశారు. రైతులు  అధికారిక వెబ్‌సైట్‌కి లాగిన్ చేయడం ద్వారా అన్ని వివరాలను తనిఖీ చేయవచ్చు.

కుటుంబంలోని ఎంత మంది లబ్ధి పొందవచ్చు..

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఒక కుటుంబంలో భర్త, భార్య, మైనర్ పిల్లలు అర్హులు అని కేంద్రం స్పష్టం చేసింది. కానీ ఇందులో ఒక సభ్యుడి పేరుపై మాత్రమే పథకం ప్రయోజనం అందుతుంది. రాష్ట్ర ప్రభుత్వం, UTలు స్కీం నిబంధనలను అనుసరించి అర్హులైన రైతు కుటుంబాలను గుర్తిస్తుంది. భార్యాభర్తలిద్దరు పథకం ప్రయోజనం పొందలేరు. భూమి రికార్డుల్లో పేర్లు ఉన్న రైతుల కుటుంబాలలోని సభ్యులందరి వివరాలతో కూడిన ఆధార్ అనుసంధానిత ఎలక్ట్రానిక్ డేటాబేస్ ద్వారా పథకం అమలు చేస్తారు. దీంతో వివరాలన్ని ప్రభుత్వం దగ్గర ఉంటాయి. వాటి ప్రకారమే పథకం ప్రయోజనం అందిస్తారు. ధనవంతులు, ట్యాక్స్‌ కట్టేవారు పథకం ప్రయోజనం పొందేందుకు అర్హులు కాదు. మాజీ, ప్రస్తుత మంత్రులు / రాష్ట్ర మంత్రులు, మాజీ / ప్రస్తుత లోక్‌సభ / రాజ్యసభ / రాష్ట్ర శాసనసభలు / రాష్ట్ర శాసన మండలి సభ్యులు, జిల్లా పంచాయతీల మాజీ, ప్రస్తుత చైర్మన్‌లు అర్హులు కాదు. నెలవారీ పెన్షన్ రూ. 10,000/- లేదా అంతకంటే ఎక్కువ (మల్టీ-టాస్కింగ్ స్టాఫ్/ క్లాస్ IV/గ్రూప్ డి ఉద్యోగులు మినహా) ఉన్న సూపర్‌యాన్యుయేట్ / రిటైర్డ్ పెన్షనర్లు కూడా అర్హులు కాదు.

మీ ఇన్‌స్టాల్‌మెంట్ రాలేదంటే ఏం చేయాలి?

PM-KISAN పథకం కింద లావాదేవీల వైఫల్యానికి కేంద్ర ప్రభుత్వం అనేక కారణాలను గుర్తించింది. మూసివేసిన ఖాతాలు, చెల్లని IFSC కోడ్‌లు, నిష్క్రియ ఖాతాలు, గడువు ముగిసిన ఖాతాలు, బ్లాక్ చేసిన ఖాతాలు, స్తంభించిన ఖాతాలు, ఆధార్‌ నెంబర్‌ సరిగ్గా లేకపోవడం, నెట్‌వర్క్ వైఫల్యం మొదలైనవి ఉన్నాయి. ఇందులో ఏదైనా తప్పు జరిగినట్లయితే పీఎం కిసాన్‌ డబ్బులు రావడం కష్టమవుతుంది. ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి ఒక ప్రామాణిక ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) అభివృద్ధి చేశారు. అవసరమైన చర్యలు తీసుకోవడానికి రాష్ట్రాలకి అనుమతి ఇచ్చారు. తప్పులు సరిదిద్దాక పెండింగ్‌లో ఉన్న వాయిదాలు ప్రాసెస్ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం, UT పరిపాలన పథకం మార్గదర్శకాల ప్రకారం అర్హులైన రైతు కుటుంబాలను గుర్తిస్తుంది. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నిధులు బదిలీ చేస్తారు. పథకం కోసం వివిధ మినహాయింపు వర్గాలు కూడా ఉన్నాయి. ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే రైతులు pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి లాగిన్ అయి మరింత సమాచారం తెలుసుకోవచ్చు.

Riding Bike: బైక్‌పై వెళ్లేటప్పుడు కరోనా రావొద్దంటే ఈ 4 జాగ్రత్తలు తప్పనిసరి.. అవేంటో తెలుసుకోండి..?

Valentine Day 2022: ప్రేమికుల రోజున ఈ 5 బహుమతులు ఎవ్వరికి ఇవ్వొద్దు.. ఎందుకో తెలుసా..?

Viral Video: ఎర్రడ్రెస్ వేసుకున్న చిన్నది డ్యాన్స్‌ అదరగొట్టింది.. సోషల్‌ మీడియాలో వైరల్‌..?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu