Valentine Day 2022: ప్రేమికుల రోజున ఈ 5 బహుమతులు ఎవ్వరికి ఇవ్వొద్దు.. ఎందుకో తెలుసా..?

Valentine Day 2022: ప్రేమికుల రోజున ఇష్టమైనవారికి ప్రత్యేక బహుమతులు అందిస్తారు. ఎందుకంటే ఆ క్షణంలో వారి ముఖంలో కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది. దీనికోసం వారు

Valentine Day 2022: ప్రేమికుల రోజున ఈ 5 బహుమతులు ఎవ్వరికి ఇవ్వొద్దు.. ఎందుకో తెలుసా..?
Valentine2
Follow us
uppula Raju

|

Updated on: Feb 14, 2022 | 1:04 PM

Valentine Day 2022: ప్రేమికుల రోజున ఇష్టమైనవారికి ప్రత్యేక బహుమతులు అందిస్తారు. ఎందుకంటే ఆ క్షణంలో వారి ముఖంలో కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది. దీనికోసం వారు ఎన్నోరోజులుగా వేచిచూస్తారు. కొంతమంది తన మనసులోని భావాలను వెల్లడించడానికి కూడా బహుమతుల సాయం తీసుకుంటారు. అయితే వాస్తు ప్రకారం ప్రేమికుల రోజున మీ భాగస్వామికి కొన్ని బహుమతులు ఇవ్వకూడదు. ఎందుకంటే అవి ప్రతికూల ఫలితాలను అందిస్తాయి. వాటి గురించి తెలుసుకుందాం.

1. మునిగిపోతున్న ఓడ

వాస్తు ప్రకారం మునిగిపోతున్న ఓడ ఫోటొని, విగ్రహాన్ని ఎప్పుడు బహుమతిగా ఇవ్వకూడదు. అంతేకాదు ఎవ్వరి నుంచి తీసుకోకూడదు. అలాంటివి ఇంట్లో ఉంటే అశుభ ఫలితాలు ఉంటాయి. బహుమతిని స్వీకరించే వ్యక్తి ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.

2. నల్లని దుస్తులు

వాస్తు శాస్త్రం ప్రకారం నల్లని దుస్తులను ఎప్పుడు ఎవ్వరికి బహుమతిగా ఇవ్వకూడదు. ఒక వ్యక్తి మీకు తెలియకుండా ఈ రంగు దుస్తులను బహుమతిగా ఇస్తే అది దుఃఖాన్ని, బాధను మిగులుస్తుంది.

3. షూస్

మీ గర్ల్‌ఫ్రెండ్ షూస్ ధరించడానికి ఇష్టపడితే ఎప్పుడు బహుమతిగా ఇవ్వకండి. ఎందుకంటే షూస్‌ విభజనకు చిహ్నంగా భావిస్తారు. మీ బంధం బలహీనంగా మారుతుంది.

4. చేతిరుమాలు

చేతి రుమాలు ఎవ్వరికీ బహుమతిగా ఇవ్వకూడదనే విషయం చాలా మందికి తెలుసు. ఎందుకంటే రుమాలు దుఃఖానికి కారణమమవుతుంది. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది.

5. వాచ్

చాలా మంది గడియారాన్ని బహుమతిగా ఇస్తారు. అయితే ఇది జీవిత పురోగతిని నిలిపివేస్తుంది.

Viral Video: ఎర్రడ్రెస్ వేసుకున్న చిన్నది డ్యాన్స్‌ అదరగొట్టింది.. సోషల్‌ మీడియాలో వైరల్‌..?

IPL 2022:14 కోట్ల కంటే తక్కువైనా పర్వాలేదు.. కానీ అదే జట్టుకి ఆడతా..

Funny Video: సన్నీలియోన్‌ పాటకి సూపర్ డ్యాన్స్‌.. సడెన్‌గా ఏం జరిగిందో తెలిస్తే నవ్వు ఆపుకోలేరు..?