High Protein Lentils: ఈజీగా బరువు తగ్గాలనుకుంటున్నారా..? ఈ పప్పు దినుసులను ఆహారంలో చేర్చుకోండి..
Weight Loss Diet: వేడివేడి పప్పు అన్నంలో కలుపుకోని తింటే.. ఆ మజానే వేరు. అయితే.. పప్పు పదార్థాలు రోజూ ఒక గిన్నె తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. బరువు తగ్గడానికి ఇది సులభమైన, అత్యంత
Weight Loss Diet: వేడివేడి పప్పు అన్నంలో కలుపుకోని తింటే.. ఆ మజానే వేరు. అయితే.. పప్పు పదార్థాలు రోజూ ఒక గిన్నె తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. బరువు తగ్గడానికి ఇది సులభమైన, అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి. పప్పు ధాన్యాలు (High Protein lentils) ఏవైనా అధిక మొత్తంలో ఫైబర్, ప్రోటీన్లను కలిగి ఉంటాయి. ఇది తక్కువ కేలరీల ఆహారంగా మార్చడమే కాకుండా, ఇది మిమ్మల్ని చాలా కాలం పాటు సంతృప్తికరంగా ఉంచుతుంది. పప్పులో ఫైబర్, లెక్టిన్లు, పాలీఫెనాల్స్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది గుండె జబ్బులు, ఊబకాయం, మధుమేహం, క్యాన్సర్ లాంటి ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడతాయి. డయాబెటిక్ పేషెంట్లకి పప్పుధాన్యాలు మంచి ఆహారం. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. కాగా.. దేశంలోని దాదాపు ప్రతి ఇంట్లో పప్పులు రోజువారీ ఆహారంలో భాగం. ఇవి చాలా సులభంగా అందుబాటులో ఉంటాయి. ఈ పప్పు దినుసులను చాలా రకాల వంటకాల్లో ఉపయోగించవచ్చు. బరువు తగ్గడానికి ఉత్తమమైన 5 అధిక ప్రోటీన్ (Protein) పప్పులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం
మినప పప్పు..
మినపపప్పులో చాలా రకాల పోషకాలు ఉన్నాయి. ఇందులో కొవ్వు, కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది ప్రోటీన్, విటమిన్ B3 గొప్ప మూలం. అవి మన ఎముకలను దృఢంగా చేస్తాయి. అంతేకాకుండా శక్తిని కూడా పెంచుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు మన నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఇందులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది.
శనగపప్పు
శనగపప్పులో మాంసకృత్తులు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఒక కప్పు శనగపప్పు మీకు తగినంత ప్రోటీన్, ఐరన్, కాల్షియం, పొటాషియంలను అందిస్తుంది. ఇది మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. మధుమేహాన్ని కూడా అదుపులో ఉంచుతుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా జీవక్రియను కూడా పెంచుతుంది.
కంది పప్పు
పప్పు మాంసకృత్తులు బాగా ఉండే పప్పుదినసుల్లో కందిపప్పు ఒకటి. ఇందులో ఫైబర్, ఫోలిక్ యాసిడ్, ఐరన్, క్యాల్షియం పుష్కలంగా ఉన్నాయి. ఇది మంచి కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది. ఇది ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. మధుమేహం, గుండె జబ్బులతో బాధపడేవారికి కూడా పప్పు ఒక సూపర్ ఫుడ్.
పెసర పప్పు
పోషకాలు పుష్కలంగా ఉన్న శాఖాహార సూపర్ ఫుడ్స్‌లో పెసర పప్పు ఒకటి. ఇందులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్త ప్రసరణను ప్రోత్సహించడంలో, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. పొటాషియం, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. ఇవి కండరాల తిమ్మిరిని నివారిస్తాయి. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
మైసూర్ పప్పు
మైసూర్ పప్పులో కార్బోహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది మిమ్మల్ని చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. దీనిలోని పోషకాలు సెల్ డ్యామేజ్‌ని తగ్గించి, వృద్ధాప్యాన్ని నిరోధించడంలో సహాయపడతాయి.
Also Read: