AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bitter Gourd: మీరు కాకరకాయ తినడం లేదా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

కాకరకాయ(Bitter Gourd) తినడం చాలా మందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే అది చేదుగా ఉంటుంది కాబట్టి...

Bitter Gourd: మీరు కాకరకాయ తినడం లేదా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..
Bitter Gourd
Srinivas Chekkilla
| Edited By: |

Updated on: Feb 15, 2022 | 11:35 AM

Share

కాకరకాయ(Bitter Gourd) తినడం చాలా మందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే అది చేదుగా ఉంటుంది కాబట్టి. కానీ కాకరకాయలో తింటే కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే కాకరకాయ తినకుండా ఉండలేరు. కాకరకాయను ఫ్రై చేసినా, ఉడికించినా.. జ్యూస్ రూపంలో తీసుకున్నా.. అందులోని పోషకాలు(Nutrients) శరీరాని(Body)కి చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలోనైతే కాకరను తరచుగా తీసుకోవడం మరింత ఫలితాన్నిస్తుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను పెంపొందిస్తుంది. బరువు తగ్గడానికి సహకరిస్తుంది.

వర్షాకాలంలో కాకరను ఎక్కువగా తీసుకోవడం వల్ల.. వాటిలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగాలను రాకుండా చేస్తాయి. కాకరకాయను తరచుగా తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలంగా మారి, ఇన్ఫెక్షన్లు రావు. కాకరకాయలోని యాంటీఆక్సిడెంట్లు శరీరం నుంచి ట్యాక్సిన్లు బయటకు పోయేలా చేస్తాయి. ఫలితంగా జీర్ణవ్యవస్థ మెరుగ్గా పని చేసి బరువు తగ్గుతారు. కాకరకాయలో క్యాలరీలు, కొవ్వు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి.

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు కాకరకాయ ఓ వరం. కాకరలోని ఆల్కలైడ్లు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. ఇందులోని చార్న్‌టిన్ పెప్‌టైడ్లు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. కాకరలోని యాంట్రీ మైక్రోబియాల్, యాంటీఆక్సిడెంట్ గుణాలు రక్తాన్ని శుద్ధి చేయడంలో తోడ్పడతాయి. కాకరను తరచుగా తినడం వల్ల చర్మ, రక్త సంబంధ సమస్యలు దూరం అవుతాయి. ఆస్తమా, బ్రాంకైటిస్, దగ్గు, శ్వాస సంబంధ సమస్యలు తగ్గడంలో కాకర ఎంతో ఉపయోగపడుతుంది.

గమనిక :– అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Read Also.. Gas Problem: మీరు గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ పని చేయండి..

Follow Us
జమ్మూ కాశ్మీర్ చారిత్రాత్మక విజయం.. ప్రధాని మోదీ ప్రశంసల జల్లు..!
జమ్మూ కాశ్మీర్ చారిత్రాత్మక విజయం.. ప్రధాని మోదీ ప్రశంసల జల్లు..!
బతికితే ఆ హీరోలా బతకాలి.. జగపతి బాబు..
బతికితే ఆ హీరోలా బతకాలి.. జగపతి బాబు..
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే