Fruit Juice Side Effects: ఉదయాన్నే ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నారా ? మీకు ఈ సమస్యలు రావడం ఖాయం..
సాధారణంగా పండ్లు మన ఆరోగ్యానికి మంచివని అందరికి తెలిసిందే. రోజు ఫ్రూట్స్ తినడం వలన అనారోగ్య సమస్యలు దరిచేరవు.
సాధారణంగా పండ్లు మన ఆరోగ్యానికి మంచివని అందరికి తెలిసిందే. రోజు ఫ్రూట్స్ తినడం వలన అనారోగ్య సమస్యలు దరిచేరవు. ఆరోగ్యంగా.. ఫిట్‌గా ఉండేదుకు రోజు తాజా పండ్లను తమ ఆహారంతో పాటు తీసుకుంటారు. తాజా పండ్ల రసంలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అవి రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ సహయపడతాయి. రోజూ ఏదైన పండ్ల జ్యూస్ తీసుకోవడం మంచిదని.. ఫలితంగా అనారోగ్య సమస్యలు తగ్గుతాయని అంటారు. కానీ ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో పండ్ల రసాలు తీసుకోడం చాలా ప్రమాదకరం. రాత్రి పూట తినడం.. ఉదయం తినడానికి కనీసం ఆరు గంటల సమయం ఉంటుంది. ఇందులో ఉదయం ఖాళీ కడుపుతో పండ్ల రసాలు తీసుకోవడం వలన అది జీర్ణక్రియపై ప్రభావం చూపిస్తుంది. అలాగే మరిన్ని సమస్యలు ఉన్నాయి. అవెంటో తెలుసుకుందామా.
డైటీషియన్ల ప్రకారం.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పండ్ల రసం తీసుకోవడం వలన జీర్ణక్రియపై ప్రభావితం చేస్తుంది. అందుకే పండ్లు మాత్రమే కాకుండా.. ఉసిరి, చేదు, కలబంద వంటి వాటి రసాలను కూడా నియంత్రించుకోవాలి. ఇవి జీర్ణక్రియపై ప్రభావం చూపిస్తుంది. అలాగే వేసవిలో చల్లటి పండ్ల రసాలు అస్సలు తాగకూడదు. ఇది శ్లేష్మ పొరను ప్రభావితం చేస్తుంది. అలాగే జీర్ణవ్యవస్థను పాడు చేస్తుంది.
ఖాళీ కడుపుతో జ్యూస్ తాగిన తర్వాత ఒక గంట వరకు ఏమి తినకుండా ఉండాలి. జ్యూస్ తాగిన వెంటనే ఏమైన తింటే వెంటనే వాంతులు, వికారం, విరేచనాలు కలిగే అవకాశం ఉంది. అలాగే ఖాళీ కడుపుతో జ్యూస్ తాగడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. డయాబెటిక్ రోగులు ఖాళీ కడుపుతో పండ్ల రసాలు తీసుకోకపోవడం మంచిది. ఖాళీ కడుపుతో జ్యూస్ తాగడమే కాకుండా.. వ్యాయామం, యోగ చేసిన తర్వాత కూడా జ్యూస్ తీసుకోవడం మానేయాలి. వ్యాయామం చేసిన తర్వాత శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది హానికరం. అందుకే వ్యాయమం చేసిన అరగంట తర్వాత జ్యూస్ తీసుకోవాలి.
గమనిక :- ఈ కథనం కేవలం ఇతర వెబ్ సైట్స్.. నిపుణుల సూచనల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దయచేసి వీటిని అమలు చేసే ముందు వైద్యులను సంప్రదించాలి.
Also Read: Valentine’s Day: రాశిని బట్టి డ్రస్ కలర్.. ప్రేమికుల రోజున ధరిస్తే.. లవ్ సక్సెస్ అయినట్టే..
Sarkaru Vaari Paata: కళావతి ఒరిజినల్ వచ్చేసింది.. అదిరిపోయిన మహేష్ కీర్తి కెమిస్ట్రీ..