Oral Health Tips: నోటి దుర్వాసన బాగా ఇబ్బంది పెడుతోందా?.. అయితే ఈ వంటింటి పదార్థాలతో సమస్యను దూరం చేసుకోండి..
Natural Mouth Fresheners: ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొంతమందికి నోటి దుర్వాసన (Bad Breath) సమస్య బాగా ఇబ్బంది పెడుతుంటుంది.
Natural Mouth Fresheners: ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొంతమందికి నోటి దుర్వాసన (Bad Breath) సమస్య బాగా ఇబ్బంది పెడుతుంటుంది. ముఖ్యంగా మీటింగ్‌లు, తోటి ఉద్యోగులు, స్నేహితులు, సన్నిహితులతో మాట్లాడుతున్నప్పుడు ఈ సమస్య బాగా ఇబ్బంది పెడుతుంది. నోటిలో బ్యాక్టీరియా చేరడమే దీనికి ప్రధాన కారణం. సాధారణంగా మనం తినే ఆహార పదార్థాల్లోని చక్కెరలు, పిండి పదార్థాలను బ్యాక్టీరియా విచ్ఛిన్నం చేయడం వల్ల నోటి దుర్వాసన కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో, ఇది చిగుళ్ల వ్యాధి లేదా దంత క్షయం వంటి తీవ్రమైన దంత సమస్యలకు కూడా దారి తీస్తుంది. ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే క్రమం తప్పకుండా దంత పరీక్షలు చేయించుకోవాలి. వారి సూచన మేరకు మందులు వాడాలి. అదే సమయంలో వంటింట్లో ఉండే కొన్ని నేచురల్ మౌత్ ఫ్రెషనర్స్ (Natural Mouthfreshners) ను కూడా ప్రయత్నించవచ్చు.
లవంగాలు
లవంగాలు అందరి వంటిళ్లలో ఉంటుంది. ఇది నోటి దుర్వాసన, చిగుళ్లవాపు సమస్యలను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నోటిలోని బ్యాక్టీరియా సంఖ్యను తగ్గిస్తాయి. అదేవిధంగా రక్తస్రావం, దంతక్షయం వంటి ఇతర దంత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అందుకే రోజూ కొన్ని లవంగాలను నోట్లో పెట్టుకుని నమిలితే క్రమంగా నోటి దుర్వాసన నుంచి బయటపడవచ్చు.
నీళ్లు
మోతాదుకు మించి తక్కువ నీరు తాగడం వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది. నోటి నుంచి బ్యాక్టీరియాను బయటకు పంపడంలో నీరు బాగా సహాయపడుతుంది. ఇది నోటిలో క్రిములు పెరగకుండా కూడా నిరోధిస్తుంది. అదేవిధంగా నోటిని తాజాగా ఉంచుతుంది. నోటి దుర్వాసన సమస్య ఉన్నవారు పుష్కలంగా నీరు తాగాలి. ఒకవేళ అదే పనిగా నీరు తీసుకోవడం ఇష్టం లేకపోతే అందులోకి కొద్దిగా నిమ్మరసం జోడించుకోవచ్చు.
తేనె, దాల్చినచెక్క
తేనె, దాల్చినచెక్క.. ఈ రెండింటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి నోటిలో బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గించి, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. దంతాల చిగుళ్లపై తేనె, దాల్చినచెక్క పేస్ట్‌ను క్రమం తప్పకుండా పూయడం వల్ల నోటి దుర్వాసన దూరమవుతుంది. దంత క్షయం, చిగుళ్ల నుంచి రక్తం కారడం, చిగుళ్ల వాపు తదితర సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఉప్పునీరు పుక్కిలించడం..
తరచూ ఉప్పు నీటితో పుక్కిలించడం వల్ల నోటిలో చెడు బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా నిరోధించవచ్చు. అంతేకాదు నోరు తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది. అదేవిధంగా చిగుళ్ల వాపు, రక్తం కారడం వంటి తదితర సమస్యలను కూడా నయం చేస్తుంది. ఇందుకోసం 1/4 నుంచి 1/2 టీస్పూన్ ఉప్పును ఒక గ్లాసు నీటిలో కలిపి తరచూ పుక్కిలిస్తూ ఉండాలి.
Also Read:Viral Video: మానవత్వం అంటే ఇదే కదా.. నీటిలో మునిగిపోతున్న కాకిని కాపాడిన ఎలుగుబంటి.. వీడియో వైరల్..
Valentine’s Day: రాశిని బట్టి డ్రస్ కలర్.. ప్రేమికుల రోజున ధరిస్తే.. లవ్ సక్సెస్ అయినట్టే..