Calcium Deficiency: కాల్షియం లేకపోతే చాలా ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్‌..

Calcium Deficiency: ఎముకలు దృఢంగా ఉండాలంటే కాల్షియం చాలా అవసరం. ఇది రక్తం గడ్డకట్టడంలో కూడా సహాయపడుతుంది. ఇది శరీరం అభివృద్ధికి, కండరాలను తయారు చేయడానికి

Calcium Deficiency: కాల్షియం లేకపోతే చాలా ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్‌..
Calcium Deficiency
Follow us
uppula Raju

|

Updated on: Feb 13, 2022 | 1:03 PM

Calcium Deficiency: ఎముకలు దృఢంగా ఉండాలంటే కాల్షియం చాలా అవసరం. ఇది రక్తం గడ్డకట్టడంలో కూడా సహాయపడుతుంది. ఇది శరీరం అభివృద్ధికి, కండరాలను తయారు చేయడానికి సహాయపడుతుంది. కాల్షియం లోపాన్ని హైపోకాల్సెమియా అంటారు. మీ శరీరానికి తగినంత కాల్షియం లభించనప్పుడు ఇది జరుగుతుంది. మంచి ఆరోగ్యం కోసం కాల్షియం ప్రాముఖ్యతపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి. శరీరంలో క్యాల్షియం లోపించిన వారు సొంతంగా మందులు వేసుకోకూడదు, ఫుడ్ సప్లిమెంట్లను ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. కాల్షియం లోపం వయస్సుతో పాటు సాధారణం. శరీరంలో ఎక్కువ భాగం కాల్షియం ఎముకల్లోనే నిల్వ ఉంటుంది. వయస్సుతో పాటు ఎముకలు సన్నగా మారుతాయి. ఈ పరిస్థితిలో శరీరానికి కాల్షియం అవసరం ఎక్కువగా ఉంటుంది. కాల్షియం పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తినడం ద్వారా దీని లోపాన్ని నివారించవచ్చు. ఆకలి, పోషకాహార లోపం, హార్మోన్ ఆటంకాలు, అకాల డెలివరీ, మాలాబ్జర్ప్షన్ కారణంగా కాల్షియం లోపం సంభవిస్తుంది. కాల్షియం సరైన మోతాదులో తీసుకున్న తర్వాత కూడా మన శరీరం విటమిన్లు గ్రహించలేకపోవడాన్ని మాలాబ్జర్ప్షన్ అంటారు.

1. కండరాల తిమ్మిరి

శరీరంలో హోమోగ్లోబిన్ తగినంత స్థాయిలో ఉన్నప్పటికీ, తగిన మొత్తంలో నీటిని తీసుకున్నప్పటికీ మీరు క్రమం తప్పకుండా కండరాల తిమ్మిరి, నొప్పులు ఎదుర్కొంటుంటే అది కాల్షియం లోపానికి సంకేతమని చెప్పవచ్చు.

2. తక్కువ ఎముక సాంద్రత

ఎముక ఖనిజీకరణకు కాల్షియం అవసరం. కాల్షియం లోపం మన ఎముకల ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. బోలు ఎముకల వ్యాధి, పగుళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది.

3. బలహీనమైన గోర్లు

గోళ్లు బలంగా ఉండటానికి కాల్షియం అవసరం. దీని లోపం కారణంగా అవి పెళుసుగా, బలహీనంగా మారవచ్చు.

4. పంటి నొప్పి

మన శరీరంలోని 90 శాతం కాల్షియం దంతాలు, ఎముకలలో నిల్వ ఉంటుంది. దీని లోపం వల్ల దంతాలు, ఎముకలు బలహీనంగా తయారవుతాయి.

5. బహిష్టు సమయంలో నొప్పి

కాల్షియం లోపం ఉన్న స్త్రీలు ఋతుస్రావం సమయంలో తీవ్రమైన నొప్పిని అనుభవించవచ్చు, ఎందుకంటే కండరాల పనితీరులో కాల్షియం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

Kiss Day 2022: వేల ఎత్తులో గాలిలో ముద్దులు.. ప్రేమజంట సాహసం.. వైరల్‌ అవుతున్న వీడియో..

IPL 2022: ధోని కంటే చాహర్ పెద్ద ఆటగాడా.. 14 కోట్లు ఎందుకు చెల్లించినట్లు..?

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు షాక్.. వడ్డీ పెంచే విషయంలో కీలక నిర్ణయం..?