EPFO: పీఎఫ్ ఖాతాదారులకు షాక్.. వడ్డీ పెంచే విషయంలో కీలక నిర్ణయం..?

EPFO: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశం మార్చిలో గౌహతిలో జరుగుతుంది. ఈ సమావేశంలో 2021-22కి సంబంధించి

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు షాక్.. వడ్డీ పెంచే విషయంలో కీలక నిర్ణయం..?
Epfo
Follow us
uppula Raju

|

Updated on: Feb 13, 2022 | 11:48 AM

EPFO: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశం మార్చిలో గౌహతిలో జరుగుతుంది. ఈ సమావేశంలో 2021-22కి సంబంధించి ప్రావిడెంట్ ఫండ్ (PF) డిపాజిట్ల వడ్డీ రేటుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గత ఏడాది మార్చిలో శ్రీనగర్‌లో జరిగిన సమావేశంలో EPF డిపాజిట్లపై సంవత్సరానికి 8.5 శాతం వడ్డీ రేటును నిర్ణయించారు. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత మార్చి రెండో వారంలో గౌహతిలో సమావేశం అవుతారు. వడ్డీ రేటు, కొత్త ఉత్పత్తులలో పెట్టుబడి తదితర విషయాల గురించి చర్చిస్తుంది.

2021-22 వడ్డీ రేటును నిర్ణయించడానికి ముందు ఆదాయ అంచనా, EPFO పెట్టుబడుల గురించి మంత్రిత్వ శాఖ చర్చిస్తుందని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ చెప్పారు. అయితే ఈ ఏడాది వడ్డీ రేటు గత ఆర్థిక సంవత్సరం మాదిరిగానే ఉంటుందని లేదా కొద్దిగా తగ్గవచ్చని కేంద్ర బోర్డు సభ్యుడు ఒకరు చెప్పారు. ఈపీఎఫ్‌వో 2020-21లో మిలియన్ల మంది చందాదారులకు 8.5 శాతం వడ్డీ రేటును చెల్లించింది. 2019-20లో 8.5 శాతం, 2018-19లో 8.65 శాతం, 2017-18లో 8.55 శాతం వడ్డీ చెల్లించింది. గత ఆర్థిక సంవత్సరం మాదిరిగానే రుణ పెట్టుబడులు, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్‌లలో (ETFలు), ఈక్విటీ పెట్టుబడులలో కొంత భాగాన్ని లిక్విడేషన్ చేయడం ద్వారా ఆదాయం వస్తుందని సీబీటీ సభ్యుడు చెప్పారు. EPFO తన వార్షిక అఫ్రూవల్స్‌లో 85 శాతం రుణాలలో, 15 శాతం ఈక్విటీలలో పెట్టుబడి పెడుతుంది.

pf బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోండి

EPF సభ్యులు SMS ద్వారా బ్యాలెన్స్ ఎంతో చెక్‌ చేసుకోవచ్చు. కేవలం ‘EPFOHO UAN LAN’ అని టైప్ చేసి వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7738299899కి ఎస్సెమ్మెస్‌ పంపాలి. మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. దీన్ని చేయడానికి EPF సభ్యుడు 011-22901406కు మిస్డ్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది.

Viral Video: చిరుతపులితో మజాకా.. రక్తం కళ్లజూడాల్సిందే.. వైరల్‌ అవుతున్న వీడియో..

Viral Photos: భూమిపై ఈ జీవి చాలా ప్రత్యేకం.. నోటితో నీరు తాగదు.. చలి అంటే విపరీతమైన భయం..

చాణక్య నీతి: భార్యాభర్తల సంబంధం చిరకాలం ఉండాలంటే చాణక్య ఏం చెప్పాడో తెలుసా..?

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.