Viral Video: చిరుతపులితో మజాకా.. రక్తం కళ్లజూడాల్సిందే.. వైరల్ అవుతున్న వీడియో..
Viral Video: బోనులో బంధించినా క్రూర జంతువులు ఎప్పుడు అదునుకోసం ఎదురుచూస్తుంటాయి. వాటి సహజ సిద్దమైన శైలిని మార్చుకోవు. చాలామంది అడవి జంతువులని చూడటానికి జూకి వెళుతారు.
Viral Video: బోనులో బంధించినా క్రూర జంతువులు ఎప్పుడు అదునుకోసం ఎదురుచూస్తుంటాయి. వాటి సహజ సిద్దమైన శైలిని మార్చుకోవు. చాలామంది అడవి జంతువులని చూడటానికి జూకి వెళుతారు. ఒక్కోసారి చిన్న పొరపాటుకు కారణంగా పెద్ద ప్రమాదానికి గురవుతారు. అలాంటి షాకింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోల ఒక వ్యక్తి చిరుతపులిని తప్పుగా వేధిస్తాడు. దీంతో అది తగిన శాస్త్రి చేస్తుంది. వీడియో చూస్తే మీరు కూడా ఇలాగే అంటారు. పొదల మధ్య ఉన్న ఒక ఇనుపు బోనులో చిరుతపులి బంధించి ఉండటం మనం వీడియోలో చూడవచ్చు. ఈ సమయంలో ఒక వ్యక్తి ఒక చెట్టు కొమ్మని పట్టుకొని దాంతో బోనులో ఉన్న చిరుతని ఆటపట్టించడానికి ప్రయత్నిస్తాడు. కానీ చిరుతపులి తన పళ్ళతో ఆ చెట్టు కొమ్మని గట్టిగా పట్టుకొని ఒక్క ఉదుటున లాగేస్తుంది. దీంతో ఆ వ్యక్తి చిరుత ఉన్న బోనుకి బలంగా తాకుతాడు. దీంతో పక్కన ఉన్న వ్యక్తులు అప్రమత్తంగా వ్యవహరించి ఆ వ్యక్తిని వెంటనే పక్కకి లాగడం మనం వీడియోలో గమనించవచ్చు. దీంతో ఆ వ్యక్తి చిరుత నోటి నుంచి త్రుటిలో తప్పించుకుంటాడు. ప్రాణాలతో బయటపడుతాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ల ద్వారా అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఒక నెటిజన్ ఇలా అన్నాడు.’ఈ సంఘటన తర్వాత ఆ వ్యక్తి ఎప్పుడు వన్యప్రాణులను వేధించడని చమత్కరించాడు’ మరొకరు ఈ విధంగా చెప్పాడు ‘ఎవరినైనా ఇబ్బంది పెట్టే ముందు ఒకసారి ఆలోచించుకోవాలని సలహా ఇచ్చాడు’ చాలామంది ఆ వ్యక్తి చేసిన పని తప్పుగా భావించారు. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత్ నందా తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. వార్తలు రాసే సమయానికి ఈ వీడియోని 34 వేల మందికి పైగా చూశారు. ప్రజలు ఈ వీడియోపై తెగ స్పందిస్తున్నారు. మీరు కూడా ఈ వీడియో చూసినట్లయితే మీ కామెంట్ తెలియజేయండి.
Instant karma… see till the end. Never get close to wild animals. And particularly when they are in stress. pic.twitter.com/Br5m3Uml1P
— Susanta Nanda IFS (@susantananda3) February 4, 2022