Horoscope Today : ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఈ రాశివారు జాగ్రత్త.. కీలక వ్యవహారాలలో ముందుచూపు అవసరం..

Horoscope Today : ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఈ రాశివారు జాగ్రత్త.. కీలక వ్యవహారాలలో ముందుచూపు అవసరం..

Horoscope Today : రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా మంచి ముహూర్తం చూసుకోవడం ఎంతో ముఖ్యం. అందుకే వృత్తి , ఉద్యోగ, వ్యాపారం.. ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే తమకు

uppula Raju

|

Feb 13, 2022 | 9:00 AM

Horoscope Today : రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా మంచి ముహూర్తం చూసుకోవడం ఎంతో ముఖ్యం. అందుకే వృత్తి , ఉద్యోగ, వ్యాపారం.. ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే తమకు ఆరోజు ఎలా ఉంటుంది? అని ఆలోచిస్తారు. ఏ సమయంలో ఏ పనులు చేపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయనే దానిపై దృష్టి సారిస్తారు. ఈ క్రమంలో దినఫలాలు(Horoscope) తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలో ఈరోజు (ఫిబ్రవరి 13వ తేదీ ) రాశి ఫలాలు(Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

1. మేషం

మేషరాశివారికి ఈ రోజు శుభఫలితాలు. కొన్ని కీలక నిర్ణయాలు అనుకూలంగా వెలువడతాయి. కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఆంజనేయుడిని పూజిస్తే మంచిది.

2. వృషభం

ఈ రాశివారు ఈ రోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కొత్త పనులను ప్రారంభించే ముందు మంచిచెడులను ఆలోచించి ముందుకు సాగండి. కీలక వ్యవహారాలలో ముందుచూపు అవసరం. వేంకటేశ్వర స్వామి ఆరాధన మంచిది.

3. మిథునం

మిథున రాశివారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. విందు వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. దుర్గామాతని పూజిస్తే మంచిది.

4. కర్కాటకం

కర్కాటక రాశివారు ఉత్సాహంగా పనిచేయాల్సిన సమయమిది. కొన్ని పనులను ప్రారంభించి పూర్తిచేసే ప్రయత్నం చేస్తారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ప్రయాణాలు తప్పకపోవచ్చు. వృథా ఖర్చులు ఉన్నాయి. పొదుపు చేస్తే మంచిది.

5. సింహం

సింహ రాశివారికి ఆశించిన పురోగతి ఉంటుంది. మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. గణపతి స్తోత్రం చదివితే మంచి జరుగుతుంది.

6. కన్య

కన్య రాశివారు ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. కుటుంబసభ్యుల సహకారంతో అనుకున్నది సాధిస్తారు. అధికారులతో మాత్రం జాగ్రత్తగా ఉండటమే మంచిది. దక్షిణామూర్తి స్తోత్రం చదివితే మంచిది. దైవబలం అనుకూలంగా ఉంటుంది.

7. తుల

తుల రాశివారికి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. శివస్తోత్రం చదివితే మంచిది. గొడవలకు దూరంగా ఉండాలి.

8. వృశ్చికం

వృశ్చికం రాశివారికి శ్రమ పెరుగుతుంది. ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. పంచముఖ ఆంజనేయుడిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

9. ధనస్సు

ఈ రాశివారికి శుభ ఫలితాలు ఉన్నాయి. కొత్త పనులను ప్రారంభిస్తారు. పెద్దల ఆశీర్వచనాలు ఫలిస్తాయి. సమస్యగా అనిపించిన అంశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రయాణాలు శుభప్రదం. ఇష్టదేవతను ఆరాధిస్తే మంచి జరుగుతుంది.

10. మకరం

మకర రాశివారు ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. వాటిని సమర్థంగా నిర్వహించి అందరి ప్రశంసలూ పొందుతారు. విందు,వినోద ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శివారాధన మంచిది.

11. కుంభం

కుంభ రాశివారు చేసే పనులు నలుగురికీ ఆదర్శ ప్రాయంగా ఉంటాయి. మీదైనా రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సౌఖ్యం కలదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సూర్యారాధన ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

12. మీనం

మీన రాశివారు ఈరోజు శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు,మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. చంద్రధ్యానం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. గొడవలకు దూరంగా ఉంటే మంచిది.

Lemon Side Effects: నిమ్మకాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఎక్కువగా తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..?

Vitamin B 9: విటమిన్ B9 మాత్రమే శరీరంలో ఈ పనిచేయగలదు.. అందుకోసం ఇవి తప్పనిసరి..?

Diabetic Patient: షుగర్ ఉన్నవారు బీట్‌రూట్ తింటే బెటర్.. ఈ 4 సమస్యలకి చక్కటి పరిష్కారం..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu