AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: విమానంలో అనుకోని అతిథి.. ఒక్కసారిగా షాక్‌ అయిన ప్రయాణికులు.. వైరల్‌ వీడియో.

Viral Video: సోషల్‌ మీడియా విస్తృతి పెరగడంతో ఎక్కడ ఏ సంఘటన జరిగినా వెంటనే వైరల్‌ అవుతోంది. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న ప్రతీ ఒక్కరూ ఇప్పుడు ఒక ఒక న్యూస్‌ రిపోర్టర్‌లా మారిపోయారు. ఏ సంఘటన జరిగినా వెంటనే...

Viral Video: విమానంలో అనుకోని అతిథి.. ఒక్కసారిగా షాక్‌ అయిన ప్రయాణికులు.. వైరల్‌ వీడియో.
Narender Vaitla
|

Updated on: Feb 13, 2022 | 10:55 AM

Share

Viral Video: సోషల్‌ మీడియా విస్తృతి పెరగడంతో ఎక్కడ ఏ సంఘటన జరిగినా వెంటనే వైరల్‌ అవుతోంది. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న ప్రతీ ఒక్కరూ ఇప్పుడు ఒక ఒక న్యూస్‌ రిపోర్టర్‌లా మారిపోయారు. ఏ సంఘటన జరిగినా వెంటనే సెల్‌ ఫోన్‌లో బంధించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. ఇలా పోస్ట్‌ చేసిన వీడియోలు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే నెట్టింట తెగ వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే.. ఎయిర్‌ ఏషియాకు చెందిన ఎయిర్‌ బస్‌ ఏ320-200 అనే విమానం మలేషియాలోని కౌలాలంపూర్‌ నుంచి తవావు అనే పట్టణానికి వెళుతోంది. విమానం గాల్లోకి ఎగిరింది. కొన్ని వందల మీట్ల ఎత్తులో సాఫీగా ప్రయాణం సాగుతోంది. ఇంతలోనే ప్రయాణికులకు ఒక షాకింగ్ సన్నివేశం కనిపించింది. విమానంలో ఉండే లైటింగ్స్‌లో ఓ పాము దర్శనమిచ్చింది. దీంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. అయితే ఆ పాము లైట్‌ బాక్స్‌ నుంచి బయటకు రాకపోవడంతో తమ స్మార్ట్‌ ఫోన్‌లకు పని చెప్పారు. వీడియో రికార్డింగ్ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో శరవేగంగా సోషల్‌ మీడియాలో వ్యాపించింది.

ఇంతకీ ఆ పాము విమానంలోకి ఎలా వచ్చిందన్న దానిపై స్పష్టత లేదు. అయితే ప్రయాణికులు ఎవరైనా బ్యాగులో పెంపుడు పామును తెచ్చుకొని అయినా ఉండాలి, లేదా నేలపై నుంచి నెమ్మదిగా విమానంలోకి ఎక్కి ఉండాలి అని భావిస్తున్నారు. అయితే పాము కనిపించగానే విమానాన్ని ల్యాండ్ చేశారా.? ఇంతకీ ఆ పామును ఏం చేశారన్న విషయం మాత్రం తెలియరాలేదు. ఏది ఏమైనా భూమికి వందల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోన్న విమానంలో పాము కనిపించగానే ప్రయాణికులు ఎంతగా భయపడి ఉంటారో కదూ!

Also Read: Karnataka Hijab Row: డ్రెస్ కోడ్ సమానత్వాన్ని సూచిస్తుంది.. అయితే ఇది అందరికీ వర్తించాలంటున్న మేధావులు..!

Ravi Teja : జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్న మాస్ రాజా.. శరవేగంగా రావణాసుర షూటింగ్

Anupama Parameshwaran: రాత్రి అయిందంటే.. అది ఉండాల్సిందే…! హాట్‌ హాట్‌ ఫోటోలతో నెట్టింట అనుపమ రచ్చ..(వీడియో)