Karnataka Hijab Row: డ్రెస్ కోడ్ సమానత్వాన్ని సూచిస్తుంది.. అయితే ఇది అందరికీ వర్తించాలంటున్న మేధావులు..!

Karnataka Hijab Row: హిజాబ్ వివాదం పరిష్కారమయ్యే వరకు విద్యా సంస్థల క్యాంపస్‌లలో ప్రజలను రెచ్చగొట్టే దుస్తులను ధరించవద్దని విద్యార్థులను కోరుతూ..

Karnataka Hijab Row: డ్రెస్ కోడ్ సమానత్వాన్ని సూచిస్తుంది.. అయితే ఇది అందరికీ వర్తించాలంటున్న మేధావులు..!
Follow us

|

Updated on: Feb 13, 2022 | 9:26 AM

Karnataka Hijab Row: హిజాబ్ వివాదం పరిష్కారమయ్యే వరకు విద్యా సంస్థల క్యాంపస్‌లలో ప్రజలను రెచ్చగొట్టే దుస్తులను ధరించవద్దని విద్యార్థులను కోరుతూ కర్ణాటక హైకోర్టు మద్యంతర ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ ఒక విద్యార్థి సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. హిజాబ్ వివాదంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే కర్నాటక విద్యాశాఖ మంత్రి బిసి నగేష్ డ్రెస్ కోడ్‌కు సంబంధించి ప్రభుత్వ వైఖరిని పునరుద్ఘాటించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన డ్రెస్ కోడ్ విధానం చాలా స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. సర్కార్ ఉత్తర్వుల ప్రకారం విద్యాశాఖ ఆధ్వర్యంలోని కళాశాలల అభివృద్ధి కమిటీలు ఎంపిక చేసిన దుస్తులనే విద్యార్థులు ధరించాలి. సమానత్వం, సమగ్రత, లా అండ్ ఆర్డర్‌కు భంగం కలిగించే దుస్తులను ధరించద్దని ప్రభుత్వ ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నారు.

ఇదిలాఉంటే డ్రెస్‌ కోడ్‌పై సమాజంలో భిన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. సమానత్వానికి ప్రతీక అయిన డ్రెస్ కోడ్‌లోనూ సమానత్వం మూర్తీభవించాలని అంటున్నారు. ఇదే సమయంలో యూనిఫాం పై కఠినంగా ఉన్నామంటున్న కర్నాటక విద్యాశాఖ మంత్రి వేషధారణపైనా కామెంట్స్ వస్తున్నాయి. విద్యాశాఖ మంత్రి ప్రభుత్వ కార్యాలాయానికి హాజరైనప్పుడు నుదిటిపై టీకా పెట్టుకోవడం విడ్డూరంగా ఉందంటున్నారు. ఇక నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడు చంద్ర కుమార్ బోస్ కూడా రియాక్ట్ అయ్యారు. ‘‘హిజాబ్‌ను నిషేధిస్తే నిషేధించండి. అలాగే సిందూరం, గాజులు, తలపాగాలు, దువ్వెనలను కూడా నిషేధించండి.’’ అంటూ ట్వీట్ చేశారు. హిజాబ్ అంశంపై విశ్లేషకులు మేధా దత్తవ్ ఇలా అన్నారు.

కర్నాటక విద్యాశాఖ మంత్రి ప్రకారం.. విద్యార్థుల్లో సమానత్వం ప్రతిబింబించాలంటే యూనిఫాం కావాలన్న మాట వాస్తవమే. యూనిఫాం అంటేనే అందరూ సమానంగా ఉండేలా చూడటం. ప్రతి విద్యా సంస్థలో వివిధ స్థాయిల విద్యార్థులు ఉంటారు. వారందరినీ ఒకేలా చేస్తుంది ఈ యూనిఫాం నిబంధన. సాధారణంగా అయితే, కొందరు ధనవంతుల పిల్లలు కార్లలో స్కూళ్లు, కాలేజీలకు రావొచ్చు. మరికొందరు పిల్లలు నడుచుకుంటూ వస్తారు. ఇంకొందరు ప్రజారవాణాను ఉపయోగించి వస్తారు. అయితే, ఇదంతా స్కూల్/కాలేజీ గేటు బయట వరకే. ఒకరు స్కూల్/కాలేజీ ప్రాంగణంలోకి ఎంటర్ అయిన మరుక్షణం అంతా సమానంగా పరిగణించబడుతుంది. ఈ సమానత్వం ప్రస్పుటించాలంటే యూనిఫాం విధానం తప్పనిసరి. చాలా విద్యాసంస్థలు యూనిఫాం కోసం ప్రత్యేక అవుట్‌లెట్‌లను కూడా ఏర్పాటు చేశాయి.

యూనిఫాంపై ప్రశ్నలు.. యూనిఫాం ఒక నిర్దిష్ట రంగు, నిర్దిష్ట క్వాలిటీ, కట్‌తో ఉండాలి. బెల్టులు, టైలు, సాక్స్‌లు, స్కార్ఫ్‌లు, షూలు వంటి ఉపకరణాలు కూడా నిర్దిష్ట రకంగా ఉండాలి. సాక్స్‌లు షిన్-లెంగ్త్‌గా ఉండాలని స్కూల్ రూల్స్ పేర్కొన్నట్లయితే వాటిని తూచా తప్పకుండా పాటించాలి. సాక్స్‌లు మోకాలి వరకు ఉండేలా చూసుకోవాలి. మెటీరియల్ కాటన్ అయి ఉండాలి. ఇలా ప్రతి దానికి ఒక నియమం ఉంటుంది. వీటన్నింటి ద్వారా విద్యార్థులందరూ సమానంగా కనిపించేలా, అందరూ ఒకటే అనే భావన కలిగేలా యూనిఫాం ఉంటుంది. యూనిఫాం ఉంటే ఒకరు పట్టువస్త్రాలు, మరొకరు మోడ్రన్ డ్రెస్సులు ధరించే ఛాన్స్ ఉండదు. ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా అందరూ ఒకే రకమైన దుస్తులు ధరించేలా చేసే యూనిఫాం కోడ్.

ఈ విషయంలో కర్నాటక మంత్రి వాదన సరైనదే. కానీ, అదే సమయంలో అమ్మాయిలు హిజాబ్ ధరిరంచడం అనేది తప్పుకాదు. చాలా సంస్థలు సిక్కులు తమ సంప్రదాయ వస్త్రధారణ అయిన తలపాగాలను ధరించడానికి అనుమతిస్తాయి. వాస్తవానికి కలర్ కోడ్ పాఠశాల/కాలేజీ యూనిఫాం కు అనుగుణంగా ఉండాలి. అదే విధంగా హిజాబ్‌ ధరించడానికి కూడా అనుమతిస్తాయి. అయితే, కలర్ కోడ్ ఉల్లంఘన ఉండనంత వరకే ఈ పరిమితి ఉంటుంది. ఇక హిందువులు పవిత్రంగా భావించే చేతి దారాలు, తులసి మాల, క్రిస్టియన్ క్రాస్ వంటి వాటిని కూడా విద్యా సంస్థలు అమనుతిస్తాయి. వీటిన్నంటినీ సమానత్వం, సమగ్రత, లా అండ్ ఆర్డర్‌కు భంగం కలిగించే అంశాలుగా పరిగణించలేం.

మతపరమైన చిహ్నాలు .. ప్రతి విద్యాసంస్థ దాని స్వంత నిర్దేశిత యూనిఫాంను అనుసరిస్తుంది. అదే సమయంలో ఒక విద్యార్థి తన మతపరమైన గుర్తింపును అనుసరించడానికి అనుమతి ఇస్తుంది. వాస్తవానికి విద్యార్థులు.. చెవి దిద్దులు, డైమండ్ బ్రాస్‌లెట్‌లు, రకరకాల దుస్తులు ధరిస్తుంటారు. ఎవరైనా తప్పు చేస్తే ఉపాధ్యాయులు వారిని సరి చేస్తుంటారు. అయితే, ఒక సంస్థ నిర్దేశించిన యూనిఫాం కోడ్‌కు అనుగుణంగా ఉన్నంత వరకు వారి మతపరమైన ఆచారాన్ని అనుసరించవచ్చు. ఒకేవేళ విద్యాసంస్థ నిర్దేశించిన రంగు తలపాగా ధరించినప్పటినీ.. గోల్డెన్ పిన్, బ్యాడ్జ్‌ పెట్టుకున్నట్లయితే దానిని యూనిఫాం కోడ్ ఉల్లంఘనగానే పరిగణిస్తారు. అలాంటి వాటిని అనుమతించరు. అదేవిధంగా సూచించిన కోడ్‌ను అనుసరించే హిజాబ్ ధరించడాన్ని కూడా అనుమతిస్తారు. అయితే ఎవరైనా సరికొత్త ఫ్యాషన్ హెడ్‌స్కార్ఫ్‌ను ధరించినట్లయితే.. నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుంది. దానిని యూనిఫాం కోడ్‌గా అనుమతించరు. ఏదైనా విద్యా సంస్థలో అంటే అది పాఠశాల అయినా, కళాశాల అయినా, లేక వృత్తిపరమైన ప్రదేశంలో కూడా, యూనిఫాం కలిగి ఉండడం.. వారిలో సమానత్వ భావనను, అది మనది అనే భావనను తీసుకురావడమే ఉద్దేశం.

అయితే, వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకోకుండా అధికారులు హిజాబ్‌లను నిషేధించాలని నిర్ణయించుకుంటే తలపాగాలను కూడా నిషేధించాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే, చంద్ర కుమార్ బోస్ ఎత్తి చూపినట్లుగా పాఠశాలలు అన్ని రకాల మతపరమైన అంశాలను నిషేధించాలి. మతపరమైన ప్రతీకలతో సంబంధం లేకుండా డ్రెస్‌ కోడ్‌ను పాటించాలని కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ మాట్లాడటం విడ్డూరంగా ఉందంటున్నారు. ప్రభుత్వ కార్యాలయానికి హాజరైన సందర్భంలో మంత్రి తన నుదిటిపై ఎందుకు తిలకం పెట్టుకున్నారంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు పలువురు మేధావులు, విశ్లేషకులు.

Also read:

Success Story Video: ఒకప్పుడు బిచ్చగత్తె… ఇప్పుడు కేఫ్‌ మేనేజర్‌.. ఒక సక్సెస్ స్టోరీ కోసం ఈ వీడియో చూడండి..(వీడియో)

JNV Jobs: రంగారెడ్డి నవోదయ విద్యాలయంలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక..

IPL 2022: రెండో రోజు వేలానికి రెడీగా ఉన్న ప్లేయర్స్.. ఇందులో ప్రధాన ఆటగాళ్లు ఎవరెవరంటే..?

ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు
ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు
బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..
బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..
కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే
కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే
ఏపీ టెన్త్ పరీక్షాల ఫలితాల విడుదల షెడ్యూల్ ఖరారు
ఏపీ టెన్త్ పరీక్షాల ఫలితాల విడుదల షెడ్యూల్ ఖరారు
ట్యాక్స్ సిటీని.. ట్యాంకర్ సిటీగా మార్చేశారుః మోదీ
ట్యాక్స్ సిటీని.. ట్యాంకర్ సిటీగా మార్చేశారుః మోదీ
వామ్మో.. విశాల్ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది..?
వామ్మో.. విశాల్ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది..?
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ స్పెషల్‌ స్కీమ్‌ గడువు
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ స్పెషల్‌ స్కీమ్‌ గడువు
ఏపీలో మళ్లీ తెరపైకి భార్యల పంచాయితీ!.. ఫ్యామిలీ మేటర్స్‌ హీట్..
ఏపీలో మళ్లీ తెరపైకి భార్యల పంచాయితీ!.. ఫ్యామిలీ మేటర్స్‌ హీట్..
ఛీటింగ్.. టిమ్ డేవిడ్, పోలార్డ్‌లకు భారీ షాక్.. ఏం జరిగిందంటే?
ఛీటింగ్.. టిమ్ డేవిడ్, పోలార్డ్‌లకు భారీ షాక్.. ఏం జరిగిందంటే?
‘అప్పట్లో ఆ హీరోయిన్‌ను ఇష్టపడ్డా.. ఆ తర్వాత..’
‘అప్పట్లో ఆ హీరోయిన్‌ను ఇష్టపడ్డా.. ఆ తర్వాత..’
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!