Success Story Video: ఒకప్పుడు బిచ్చగత్తె... ఇప్పుడు కేఫ్‌ మేనేజర్‌.. ఒక సక్సెస్ స్టోరీ కోసం ఈ వీడియో చూడండి..(వీడియో)

Success Story Video: ఒకప్పుడు బిచ్చగత్తె… ఇప్పుడు కేఫ్‌ మేనేజర్‌.. ఒక సక్సెస్ స్టోరీ కోసం ఈ వీడియో చూడండి..(వీడియో)

Anil kumar poka

|

Updated on: Feb 13, 2022 | 9:23 AM

పందొమ్మిదేళ్ల జ్యోతికి ఇప్పటి వరకు తన తల్లిదండ్రులెవరో కూడా తెలియదు. ఎదుకంటే చిన్నప్పుడే తనను పాట్నా రైల్వే స్టేషన్‌లో వదిలేశారు. అక్కడ బిచ్చమెత్తుకునే దంపతులు జ్యోతిని దత్తత తీసుకుని పెంచసాగారు. వారితో కలిసి జ్యోతి కూడా భిక్షాటన చేయడం ప్రారంభించింది.


పందొమ్మిదేళ్ల జ్యోతికి ఇప్పటి వరకు తన తల్లిదండ్రులెవరో కూడా తెలియదు. ఎదుకంటే చిన్నప్పుడే తనను పాట్నా రైల్వే స్టేషన్‌లో వదిలేశారు. అక్కడ బిచ్చమెత్తుకునే దంపతులు జ్యోతిని దత్తత తీసుకుని పెంచసాగారు. వారితో కలిసి జ్యోతి కూడా భిక్షాటన చేయడం ప్రారంభించింది. చెత్తను ఏరింది. ఇలా జీవితం కొనగుతుండగా.. తనకు చదువుకోవాలనే కోరిక బలంగా కలిగింది. కానీ బాల్యమంతా చదువు లేకుండానే గడిచిపోయింది. చదువు ప్రారంభించేనాటికి పెంపుడు తల్లిని కూడా కోల్పోయింది. అయినా కుంగిపోలేదు. రాంబో ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ సహాయంతో చదువు కొనసాగించింది. మెట్రిక్యులేషన్ పరీక్షలో అసాధారణమైన మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. దాంతో ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. ఆ తర్వాత ఆమె ఉపేంద్ర మహారథి ఇనిస్టిట్యూట్‌లో మధుబని పెయింటింగ్స్‌లో శిక్షణ తీసుకుని, పెయింటింగ్ వేయడం కూడా నేర్చుకుంది. ఐతే ఇంతటితో జ్యోతి సంతృప్తి చెందలేదు. తన అభిరుచికి తగ్గట్టు ఒక సంస్థలో కేఫ్ నడిపే ఉద్యోగం వచ్చింది. రోజంతా కేఫ్‌ నడిపి, ఖాళీ సమయాల్లో ఓపెన్ స్కూల్ లెర్నింగ్ ద్వారా చదువుకుంటోంది. ఇప్పుడు జ్యోతి తన సొంత సంపాదనతో అద్దె ఇంట్లో ఉంటోంది. మార్కెటింగ్ రంగంలో కెరీర్‌ను తీర్చిదిద్దుకోవాలని కలలు కంటోంది. ఇదీ జ్యోతి కథ. ఇది కథ కాదు ఓ ఒంటరి ఆడపిల్ల గెలుపు. ఈ గెలుపు కొనసాగుతూ ఆమె మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని కోరుకుందాం.