Animals Viral Video: అమెరికాలో వింత ఘటన బ్రతికే ఉన్నా.. చనిపోయినట్లుగా జీవశ్ఛవాలుగా మూగ జీవులు..(వీడియో)

Animals Viral Video: అమెరికాలో వింత ఘటన బ్రతికే ఉన్నా.. చనిపోయినట్లుగా జీవశ్ఛవాలుగా మూగ జీవులు..(వీడియో)

Anil kumar poka

|

Updated on: Feb 13, 2022 | 9:29 AM

ఉత్తర అమెరికా చలితో గజగజా వణికిపోతుంది. మంచు తుఫాను దాటికి జనజీవనం స్థంభించి పోయింది. పలు రాష్ట్రాలు స్నో అలర్ట్‌ ప్రకటించాయి. రోడ్ల మీదికి వాహనాలతో రావొద్దంటూ ఎమర్జెన్సీ ప్రకటించాయి


ఉత్తర అమెరికా చలితో గజగజా వణికిపోతుంది. మంచు తుఫాను దాటికి జనజీవనం స్థంభించి పోయింది. పలు రాష్ట్రాలు స్నో అలర్ట్‌ ప్రకటించాయి. రోడ్ల మీదికి వాహనాలతో రావొద్దంటూ ఎమర్జెన్సీ ప్రకటించాయి విపరీతంగా కురుస్తున్న మంచుతో ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీలకు పడిపోవడిపోతున్నాయి. ఈ క్రమంలో ఇగ్వానస్‌ అనే ఊసరవెల్లి తరహా జీవులు సజీవ శవాలుగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఫ్లోరిడా రాష్ట్రంలో ఇవి ఎక్కడ పడితే అక్కడ ప్రాణంతో ఉన్నా శవాల్లా పడిపోతున్నాయి. దీంతో యూఎస్‌ వాతావరణ శాఖ అక్కడి ప్రజలకు పలు కీలక సూచనలు జారీ చేసింది. ఇగ్వానస్‌ శరీరంలో చల్లని రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. అయితే ఉష్ణోగ్రత్తలు మైనస్‌ 4 డిగ్రీల నుంచి మైనస్‌ 10 డిగ్రీల సెల్సియస్‌ మధ్య ఉంటే ఇవి తట్టుకోలేవు. ఉన్న పళంగా అచేతనంగా మారిపోతాయి. చచ్చిన శవంలా ఎక్కడివక్కడే పడిపోతాయి. ప్రస్తుతం ఫ్లోరిడా రాష్ట్రంలో రోడ్ల మీద ఇళ్ల పక్కన, పార్కుల్లో ఎక్కడ పడితే అక్కడ ఈ జీవులు చనిపోయినట్టుగా కనిపిస్తున్నాయి. కానీ ఒక్క సారి ఉష్ణోగ్రత పెరిగితే ఇవి సాధారణ స్థితికి చేరుకుంటాయి. కాబట్టి వాటికి ఎటువంటి హానీ తలపెట్టవద్దంటూ స్థానిక అధికారులు సూచిస్తున్నారు.