Dog Viral Video: ఈ కుక్క వేసే యోగాసనాలు చూస్తే షాకవ్వాల్సిందే..! వైరల్‌ అవుతున్న సూపర్ వీడియో..

Dog Viral Video: ఈ కుక్క వేసే యోగాసనాలు చూస్తే షాకవ్వాల్సిందే..! వైరల్‌ అవుతున్న సూపర్ వీడియో..

Anil kumar poka

|

Updated on: Feb 13, 2022 | 9:34 AM

సోషల్‌మీడియాలో పెంపుడు జంతువులకు సంబంధించిన అనేక వైరల్‌ వీడియోలు చూస్తుంటాం. తాజగా యోగాసనాలు వేస్తున్న ఓ కుక్క వీడియో ఇప్పుడు తెగ వైరల్‌ అవుతోంది.


సోషల్‌మీడియాలో పెంపుడు జంతువులకు సంబంధించిన అనేక వైరల్‌ వీడియోలు చూస్తుంటాం. తాజగా యోగాసనాలు వేస్తున్న ఓ కుక్క వీడియో ఇప్పుడు తెగ వైరల్‌ అవుతోంది.ఓ యజమానులురాలు యోగా చేయడానికి రెడీ అవుతూ..తన యోగా మ్యాట్ ని ఓపెన్ చేస్తుంది.. అదే సమయంలో ఆ యువతి పెంపుడు కుక్క కూడా యోగా చేయడానికి రెడీ అవుతూ.. ఆమెని అనుకరిస్తూ.. యోగా మ్యాట్ ని ఆమెతో పాటుగా ఓపెన్ చేస్తుంది. అనంతరం ఆ యువతి యోగాసనాలను ఎలా చేస్తుందో అదే.. విధంగా ఈ కుక్క కూడా చేస్తుంది. శీర్షాసనం, అర్ధ శీర్షాసనం, వజ్రాసనం ఇలా ఆ యువతి పలు యోగాసనాలు వేస్తోంది. ఈ కుక్క కూడా ఆమెను చూసి ఎంతో చక్కగా, సునాయాసంగా ఆమె వేసే ఆసనాలన్నీ వేస్తోంది. ఈ కుక్క వేసే ఆసనాలు చూసి నెటిజన్లు తెగ ముచ్చటపడిపోతున్నారు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ఓ యూజర్‌ ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. లక్షల వ్యూస్, వేల లైక్స్ ను సొంతం చేసుకున్న ఈ వీడియో పై .. మీరు కూడా ఓ లుక్కేయండి..