Knowledge Video: దేశంలో ఎన్ని కోట్ల మొబైళ్లు తయారయ్యాయో తెలుసా..? షాకింగ్ విషయాలు వెల్లడి..
భారత్‌లో ప్రతీ ఏడాది లెక్కకు మిక్కిలి స్మార్ట్‌ఫోన్‌లు విడుదలవుతూనే ఉన్నాయి. సామ్‌సంగ్, రియల్‌మీ, ఒప్పో, షియోమీ, వివోతో పాటు అనేక కంపెనీలు వరుస పెట్టి మొబైళ్లను లాంచ్ చేస్తున్నాయి. గత నాలుగు సంవత్సరాలలో ఫోన్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఈ తరుణంలో
భారత్‌లో ప్రతీ ఏడాది లెక్కకు మిక్కిలి స్మార్ట్‌ఫోన్‌లు విడుదలవుతూనే ఉన్నాయి. సామ్‌సంగ్, రియల్‌మీ, ఒప్పో, షియోమీ, వివోతో పాటు అనేక కంపెనీలు వరుస పెట్టి మొబైళ్లను లాంచ్ చేస్తున్నాయి. గత నాలుగు సంవత్సరాలలో ఫోన్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఈ తరుణంలో భారత్‌లో మొబైళ్ల ఉత్పత్తి గురించి గుడ్‌న్యూస్ వచ్చింది. ఇప్పటికే ప్రపంచంలోనే ఎక్కువ మొబైళ్లను తయారు చేస్తున్న దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉంది. చైనా తర్వాత అత్యధిక మొబైళ్లు తయారవుతున్నది భారత్‌లోనే.నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్.. తాజాగా భారత్‌లో మొబైళ్ల ఉత్పత్తిపై సమాచారం వెల్లడించారు. మన దేశంలో 2014లో 2 మొబైల్ ఉత్పత్తి యూనిట్లు ఉండగా.. ప్రస్తుతం 200కు పైగా ఉన్నాయని ప్రకటించారు. అంటే 7 సంవత్సరాల్లో ఏకంగా 192 యూనిట్లు ఏర్పాటయ్యాయి. యాపిల్ ఐఫోన్లు, సామ్‌సాంగ్, రెడ్‌మీ, రియల్‌మీతో పాటు అనేక స్మార్ట్‌ఫోన్లు భారత్‌లో తయారవుతున్నాయి. ఇందులో ఎక్కువ శాతం పరికరాలు వివిధ దేశాల నుంచి వస్తుండగా.. భారత్‌లోని ప్లాంట్లలో అసెంబుల్ చేసి ఫోన్‌లను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారు. ఇదే తరుణంలో ఎగుమతులు సైతం గణనీయంగా పెరిగాయి.
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

